రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రేమల్ తుపాను:  కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి సంస్థల తో ఐసిజి నెలకొల్పుకొన్న మార్గదర్శకప్రాయమైన సమన్వయం పశ్చిమ బంగాల్ కోస్తా తీరాని కి ఆవల సముద్రం లో జీవన నష్టాన్నిగాని లేదా సంపత్తి నష్టాన్ని గాని అతితక్కువ స్థాయి కి పరిమితం చేసింది

Posted On: 28 MAY 2024 11:54AM by PIB Hyderabad

భారతీయ కోస్తాతీర రక్షక దళం (ఐసిజి) గంభీరన మహా చక్రవాతం (ఎస్‌సిఎస్) రేమల్తో తలెత్తిన స్థితిని ఫలప్రదం గా ఎదుర్కోవడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ఏజెన్సీల తో కలసి మార్గదర్శక ప్రాయమైనటువంటి సమన్వయాన్ని చాటింది. ఈ చక్రవాతం మే 22 వ తేదీ న అల్పపీడన ప్రాంతం గా ఉత్పన్నమైంది మరియు మే 26-27 వ తేదీ ల మధ్య రాత్రి కి పశ్చిమ బంగాల్ మరియు బాంగ్లాదేశ్ ల కోస్తా తీరాల లో భూమి మీదకు చేరుకొనే కంటే ముందు శీఘ్రం గా ముమ్మరించి ఎస్‌సిఎస్ గా మారిపోయింది.

 

 

దీని తరువాత, కోస్ట్ గార్డ్ రీజియన్ (నార్థ్-ఈస్ట్) యొక్క ప్రధాన కేంద్రం ముందుజాగ్రత చర్యల ను మొదలుపెట్టింది; వేరు వేరు కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి ఏజెన్సీల తో సమన్వయాన్ని నెలకొల్పుతున్నది. తత్ఫలితం గా సముద్రం లో ఎటువంటి ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం గాని సంభవించలేదు. స్థితి ని ప్రభావవంతమైన పద్ధతి లో నియంత్రించడమైంది. ఐసిజి తుపాను రాకడ ను దృష్టి లో పెట్టుకొని తుపాను కాలం లో వ్యాపార నౌకల ను చురుకు గా కాపు కాస్తూ , వ్యూహాత్మక సురక్ష కు పూచీపడాలన్న ఉద్దేశ్యం తో నౌకలను, విమానాల ను మరియు తీరం మీది పహరా వ్యవస్థల ను మోహరించింది. హల్దియా, ఇంకా పారాదీప్ లలో గల ఐసిజి యొక్క రిమోట్ ఆపరేటింగ్ స్టేశన్స్ నుండి ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాల ను ప్రసారం చేయడమైంది. చేపల ను పట్టే పడవ లు మరియు ఇతర వ్యాపార సంబంధి నౌకల ను అప్రమత్తం చేసింది.

 

ఐసిజి యొక్క నౌక వరాద్ ఎస్‌సిఎస్ తీరం దాటడం తోనే స్థితి ని సమీక్షించడం కోసం పారాదీప్ నుండి బయలుదేరింది. దీనికి అదనం గా, రెండు డోర్నియర్ విమానాలు భువనేశ్వర్ నుండి నింగికి ఎగశాయి; అవి బంగాళాఖాతం ఉత్తర ప్రాంతం లో విస్తృత పహరా బాధ్యతల ను నిర్వర్తించాయి.

 

 

 

***



(Release ID: 2021964) Visitor Counter : 59