కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎస్ఎమ్ఎస్  కుంభకోణాని కి పాల్పడే సంస్థలపైన చర్యల ను తీసుకొన్న డిఒటి మరియు ఎమ్‌హెచ్ఎ

Posted On: 27 MAY 2024 3:54PM by PIB Hyderabad

పౌరుల ను సంభావిత ఎస్ఎమ్ఎస్ మోసం బారి నుండి రక్షించడం కోసం టెలికమ్యూనికేశన్స్ విభాగం (డిఒటి) దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఎ) సహకారం తో ‘సంచార్ సాథీ’ కార్యక్రమం మాధ్యం ద్వారా నిర్ణాయక చర్యల ను చేపట్టింది.

 

 

ఎమ్‌హెచ్ఎ లోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేశన్ సెంటర్ (ఐ4సి) సైబర్ క్రైమ్ కు పాల్పడడం కోసం వంచనాత్మక సందేశాలను పంపించడం కోసం 8 ఎస్ ఎమ్ఎస్ హెడర్ లను దుర్వినియోగపరచడాన్ని గురించి సమాచారాన్ని అందించింది.

 

 

డిఒటి తీసుకొన్న చర్యలు:

 

 

i. గడచిన మూడు నెలల్లో ఈ ఎనిమిది హెడర్ లను ఉపయోగించి 10,000 కు పైగా మోసపూరితమైన సందేశాలను పంపించినట్లు గుర్తించడమైంది.

 

ii. ఈ ఎనిమిది ఎస్ఎమ్ఎస్ హెడర్ ల యజమాన్య సంస్థలు గా ఉన్న ప్రముఖ ఎన్ టిటీల ను వ్యవహార నిషిద్ధ పట్టీ లో ఉంచడమైంది.

⁠⁠iii. ⁠⁠ఈ ప్రముఖ ఎన్ టిటీలు ఎనిమిదింటి యొక్క యాజమాన్యం లో గల అన్ని 73 ఎస్ఎమ్ఎస్ హెడర్స్ మరియు ఇతర 1522 ఎస్ఎమ్ఎస్ కంటెంట్ టెంప్‌లెట్స్ ను వ్యవహార నిషిద్ధ పట్టీ లో ఉంచడమైంది.

  1. వీటిలో ఏదైనా ప్రముఖ ఎంటిటీ, ఎస్ఎమ్ఎస్ హెడర్ లు లేదా టెంప్‌లెట్స్ ను ఉపయోగించడానికి ఇప్పుడు ఏ టెలికమ్ సేవ ల ప్రదాత (ఆపరేటర్) కు ఎస్ఎమ్ఎస్ లను పంపించడానికి ఉపయోగించే వీలు ఉండదు.

 

ఈ సంస్థల ను డిఒటి వ్యవహార నిషిద్ధ పట్టీ లో లో ఉంచి, పౌరుల ను సతాయించడాన్ని నిరోధించింది. సైబర్ క్రైమ్ కు వ్యతిరేకం గా పౌరుల ను కాపాడడం కోసం నడుం కట్టినట్లు డిఒటి పునరుద్ఘాటించింది.

 

 

సైబర్ క్రైమ్ మరియు ఆర్థిక వంచన లకు పాల్పడడానికి టెలికమ్ వనరుల ను దుర్వినియోగ పరచడాన్ని అడ్డుకోవడం లో డిఒటి కి సాయాన్ని అందించేందుకు పౌరులు సంచార్ సాథీ లో చక్షుసౌకర్యాన్ని వినియోగించుకొంటూ సందిగ్ధ మోస పూరిత సమాచారానికి వ్యతిరేకం గా ఫిర్యాదు ను దాఖలు చేయవచ్చును.

 

 

టెలిమార్కెటింగ్ సంబంధి ఎస్ఎమ్ఎస్ / కాల్ ను గురించి:

 

1. టెలి మార్కెటింగ్ కోసం మొబైల్ నంబర్ లను నిషేధించడం: టెలి మార్కెటింగ్ కార్యకలాపాల కోసం మొబైల్ నంబర్ లను ఉపయోగించడాని కి అనుమతి లేదు. ఎవరైనా వినియోగదారు ప్రచార సందేశాన్ని పంపించడం కోసం తన టెలిఫోన్ కనెక్శను ను వాడినట్లయితే, ఒకటో ఫిర్యాదు రాగానే వారి యొక్క కనెక్శను ను తొలగించడం జరుగుతుంది. ఇంకా వారి యొక్క పేరు ను మరియు చిరునామా ను రెండు సంవత్సరాల కాలాని కి గాను నల్లటి సూచీ లో వేసే ఆస్కారం కూడా ఉంది.

 

 

2. టెలి మార్కెటింగ్ సంబంధి కాల్స్ ను గుర్తించడం: టెలి మార్కెటింగ్ కాల్స్ ను ఆ కాల్స్ కు ముందు అగుపించే సంఖ్య ల ద్వారా గుర్తించవచ్చును. : టెలిమార్కెటింగ్ కోసం 180,140 ఉన్నాయి. మరి ఇందుకోసం 10 అంకెల తో కూడిన సంఖ్యలను అనుమతించరు.

 

3. స్పామ్ ను గురించి సమాచారాన్ని ఇవ్వడం: స్పామ్ ను గురించి తెలియ జేయడం కోసం, 1909 నంబరు కు డయల్ చేయగలరు, లేదా డిఎన్‌డి (డు నాట్ డిస్టర్బ్) సేవ ను ఉపయోగించుకోగలరు.

 

 

 

 

 

***



(Release ID: 2021963) Visitor Counter : 93