రాష్ట్రప‌తి స‌చివాల‌యం

‘స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ’ అనే అంశం పై బ్రహ్మ కుమారీ లు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని  జాతీయ స్థాయి లో మొదలు పెట్టిన ఘట్టాని కి హాజరైన భారతదేశం రాష్ట్రపతి

Posted On: 27 MAY 2024 2:22PM by PIB Hyderabad

స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడడం కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణఅనే కార్యక్రమాన్ని బ్రహ్మ కుమారీలు న్యూ ఢిల్లీ లో ఈ రోజు న (2024, మే 27వ తేదీ న) చేపట్ట గా, ఆ కార్యక్రమం యొక్క జాతీయ ప్రారంభిక సదస్సు కు భారతదేశం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరు అయ్యారు.

 

 

ఈ సందర్భం లో రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రపంచ చరిత్ర మరియు దేశాల యొక్క చరిత్ర లో సువర్ణ అధ్యాయాలు అనేవి ఎల్లప్పటికీ ఆధ్యాత్మిక విలువల పైన ఆధారపడ్డాయి అన్నారు. ఆధ్యాత్మిక విలువల ను లెక్కచేయక, కేవలం భౌతిక ప్రగతి మార్గాన్నే అనుసరించినప్పుడు అవి అంతిమం గా వినాశకారి అని రుజువైంది అనే వాస్తవాని కి సాక్షీభూతం గా ప్రపంచ చరిత్ర నిలచింది అని ఆమె అన్నారు. ఆరోగ్యకరమైన మానసికత పునాది మీదనే సమగ్ర శ్రేయస్సు సాధ్యం అని ఆమె పేర్కొన్నారు. సిసలైన ఆరోగ్యవంతుడు/ఆరోగ్యవంతురాలు మూడు అంశాల లో ఆరోగ్యం గా ఉండగలుగుతారు. ఆ మూడు అంశాలు ఏవేవి అంటే వాటిలో శారీరికమైన, మానసికమైన మరియు ఆధ్యాత్మికమైన అంశాలు. అటువంటి వ్యక్తులే ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని, దేశాన్ని మరియు ప్రపంచ సముదాయాన్ని నిర్మించగలరు అని రాష్ట్రపతి అన్నారు.

 

 

ఆధ్యాత్మిక సశక్తీకరణయే నిజమైన సశక్తీకరణ అని రాష్ట్రపతి అన్నారు. ఏదైనా ధర్మం లేదా సంప్రదాయాన్ని అవలంబించేటటువంటి వారు ఆధ్యాత్మిక మార్గం నుండి దారి తప్పిపోయినప్పుడు, వారు మతమౌధ్యం యొక్క బాధితులు గా మరియు అస్వస్థ మానసికత బారిన పడిపోతారని ఆమె అన్నారు. ఆధ్యాత్మిక విలువ లు అన్ని ధర్మాల ప్రజల ను ఒకరితో మరొకరిని కలుపుతాయి అని ఆమె చెప్పారు.

 

 

స్వార్థాన్ని మించి ఎదిగి లోకకల్యాణ భావన తో పని చేసినప్పుడు, ఆంతరంగిక ఆధ్యాత్మికత సంఘపరం గా వెల్లడి కావడాన్ని సూచిస్తుంది అని రాష్ట్రపతి అన్నారు. జన హితం కోసం పరోపకారత్వాన్ని చాటుకోవడం అన్నింటి కంటే ముఖ్యమైన ఆధ్యాత్మిక విలువల లో ఒకటి అని ఆమె అన్నారు.

 

 

ప్రపంచం లో అనేక ప్రాంతాల లో భయాన్ని, భీతి ని మరియు యుద్ధాన్ని ప్రోత్సహించే శక్తులు చాలా చురుకు గా ఉన్నాయి అని రాష్ట్రపతి అన్నారు. ఈ తరహా వాతావరణం లో బ్రహ్మ కుమారీ సంస్థ 100 కు పైగా దేశాల లో అనేక కేంద్రాల మాధ్యం ద్వారా మానవత యొక్క సశక్తీకరణ కోసం ఒక ప్రభావవంతమైన వేదిక ను అందించింది. ఆధ్యాత్మిక విలువల ను ప్రోత్సహించడం ద్వారా విశ్వ బంధుత్వాన్ని పటిష్ట పరచేటటువంటి ఒక అమూల్యమైన ప్రయాస ఇది అని ఆమె అన్నారు.

 

 

బ్రహ్మ కుమారీ ల సంస్థ యే బహుశా మహిళ లు నడుపుతున్న ప్రపంచం లోని అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థ కావచ్చు అని తెలిసి రాష్ట్రపతి కి సంతోషం కలిగింది. ఈ సంస్థ లో బ్రహ్మ కుమారీలు ముందుంటున్నారు, మరి వారి అనుయాయులు అయినటువంటి బ్రహ్మ కుమారులు పూర్వరంగం లో కృషి చేస్తున్నారు అని ఆమె అన్నారు. ఈ విశిష్టమైన సామంజస్యం తో ఈ సంస్థ నిరంతరం ముందుకు సాగిపోతున్నది. ఈ ప్రయాస ల ద్వారా ఇది ఆధ్యాత్మిక పురోగమనాని కి సంబంధించిన మరియు మహిళల సశక్తీకరణ కు సంబంధించిన ఒక అద్వితీయ ఉదాహరణ ను ప్రపంచ సముదాయం ఎదుట నిలబెట్టింది.

 

 

రాష్ట్రపతి ఉపన్యాసాన్ని చూడడం కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయగలరు -

 

 

***

 



(Release ID: 2021961) Visitor Counter : 54