కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతీయ మొబైల్ నంబర్ లను చూపుతూ వస్తున్నటువంటిఅంతర్జాతీయ నకిలీ కాల్స్ ను అడ్డుకోవడం కోసం ఆదేశాల ను జారీ చేసిన ప్రభుత్వం

Posted On: 26 MAY 2024 12:37PM by PIB Hyderabad

మోసగాళ్ళు భారతీయ పౌరుల కు ఇండియన్ మొబైల్ నంబర్ ను ప్రదర్శిస్తూ అంతర్జాతీయ నకిలీ కాల్స్ ను చేస్తున్నారని, అలాగ చేయడం ద్వారా వంచకులు ఆర్థిక మోసాల కు, సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విధమైన ఫోన్ కాల్స్ ను భారతదేశం లోపలి నుండే చేయడం జరుగుతున్నదని తోస్తున్నది. కానీ ఈ కాల్స్ కాలింగ్ లైన్ ఐడెంటిటీ (సిఎల్ఐ) ని విదేశాల నుండి సైబర్ క్రిమినల్స్ తిమ్మిని బమ్మి ని చేసి మరీ తామే చేస్తూ వస్తున్నారు. బూటకపు డిజిటల్ అరెస్టు లు, ఫెడెక్స్ కుంభకోణాలు, కురియర్ ద్వారా మత్తు పదార్థాలు/మాదక ద్రవ్యాల చేరవేత, ప్రభుత్వ అధికారులు మరియు పోలీసు అధికారులు గా చెప్పుకొంటూ, డిఒటి/టిఆర్ఎఐ అధికారుల ద్వారా మొబైల్ నంబర్ లను డిస్ కనెక్ట్ చేయడం వంటి ఇటీవలి వ్యవహారాల లో ఈ విధమైన అంతర్జాతీయ నకిలీ కాల్స్ ను దుర్వినియోగ పరచడం జరుగుతోంది.

 

 

 

ఈ కారణం గా, టెలికమ్యూనికేశన్స్ విభాగం (డిఒటి), ఇంకా టెలికమ్ సేవల ప్రదాత సంస్థలు (టిఎస్‌పి స్) ఈ విధమైన అంతర్జాతీయ నకిలీ కాల్స్ ను గుర్తించడం తో పాటు ఆ కాల్స్ ను ఏ భారతీయ కమ్యూనికేశన్స్ వినియోగదారుకైనా చేరకుండా అడ్డుకోవడాని కి గాను ఒక వ్యవస్థ ను రూపొందించాయి. ఇప్పుడు ఇలాగ వచ్చే అంతర్జాతీయ నకిలీ కాల్స్ ను అడ్డగించడాని కి టిఎస్‌పి స్ కు ఆదేశాల ను జారీ చేయడమైంది.

 

 

డిఒటి జారీ చేసిన ఆదేశాల ను అనుసరించి భారతీయ లేండ్ లైన్ నంబరుల తో వచ్చే అంతర్జాతీయ నకిలీ కాల్స్ ను నిరోధించడాన్ని టిఎస్‌పి లు ఈసరికే మొదలుపెట్టాయి.

 

 

వినియోగదారుల భద్రత మరియు సురక్షత డిజిటల్ ఇండియా తాలూకు విజన్ లో భాగం గా ఒక అంతర్ భాగం గా ఉన్న కారణం గా, టెలికమ్యూనికేశన్స్ విభాగం (డిఒటి) వారిని కాపాడడం కోసమని పౌర ప్రధానమైనటువంటి సంచార్ సాథీ పోర్టల్ (https://sancharsaathi.gov.in/) సహా అనేక కార్యక్రమాల ను ఈసరికే మొదలుపెట్టేసింది.

 

 

అత్యుత్తమ ప్రయాసల ను చేపడుతూ ఉన్నా, ఇప్పటికీ కొందరు దగాకోరు లు ఇతర మార్గాల ద్వారా సఫలం అవుతూ ఉన్నటువంటి దాఖలా లు ఉంటే ఉండవచ్చును. అటువంటి కాల్స్ విషయం లో, మీరు అనుమానపూర్వకమైన మోసపూరిత సందేశాన్ని గురించి సంచార్ సాథీ లోని చక్షుసదుపాయం ద్వారా ఉప్పందించి ప్రతి ఒక్క వ్యక్తి కి సాయం చేయవచ్చును.

 

 

 

***



(Release ID: 2021822) Visitor Counter : 66