రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జాయింట్ నెస్ 2.0 ద్వారా సాయుధ దళాల్లో ఉమ్మడి సంస్కృతి పెంపొందించడానికి చర్యలు.. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్


సాయుధ దళాల్లో సైనిక సంసిద్ధత, యుద్ధ పోరాట పటిమ పెంపొందించడానికి థియేటర్ కమాండ్స్ ... జనరల్ అనిల్ చౌహాన్

Posted On: 21 MAY 2024 2:29PM by PIB Hyderabad

సంయుక్తంగా కలిసి పనిచేయడానికి త్రివిధ దళాలు ఉమ్మడి సంస్కృతి అలవరచుకోవాలని  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని యూఎస్ఐ ఆఫ్ ఇండియా లో జనరల్ అనిల్ చౌహాన్ 22వ మేజర్ జనరల్ సమీర్ సిన్హా స్మారక ఉపన్యాసం ఇచ్చారు.  'జాయింట్ మాన్  షిప్ ది వే ఎహెడ్' అనే అంశంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడారు. భవిష్యత్తులో ఉమ్మడిగా కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందుతున్న నేపథ్యంలో  ఉమ్మడి సంస్కృతి అవసరమన్నారు. త్రివిధ దళాల్లో ఉమ్మడి సంస్కృతిని అభివృద్ధి  జాయింట్ నెస్ 2.0 ఉపయోగపడుతుందన్నారు. 

త్రివిధ దళాల మధ్య అవగాహన,సామరస్యం, ఏకాభిప్రాయం సాధించడానికి జాయింట్ నెస్ 1.0 ఎంతగానో ఉపయోగపడిందని జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. కలిసి పనిచేసే అంశంపై విభేదాలు లేనందున మరింతగా కలిసి పనిచేయడానికి దళాలను సిద్ధం చేయడానికి జాయింట్ నెస్ 2.0 ప్రణాళిక అమలు జరగాలన్నారు. 

త్రివిధ దళాల్లో ప్రతి దళానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది అని సీడీఎస్ అన్నారు. త్రివిధ దళాలకు నాలుగో సంస్కృతిని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.  "ఉమ్మడి సంస్కృతి సేవ నిర్దిష్ట సంస్కృతికి భిన్నంగా ఉంటుంది. ప్రతి దళం ప్రత్యేక సంస్కృతిని గౌరవించాలి. ప్రతి దళం ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. వీటి నుంచి ఉత్తమ విధానాలను గుర్తించి ఉమ్మడి సంస్కృతి అభివృద్ధి చేయడానికి కృషి జరగాలి.త్రివిధ దళాల్లో ఉమ్మడిగా ఉండే సంస్కృతిని గుర్తించి ఉమ్మడి సంస్కృతికి రూపకల్పన జరగాలి' అని  సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. 

జాతీయ కార్యక్రమాలలో త్రివిధ దళాల  భాగస్వామ్యంతో సహా ఉమ్మడి సంస్కృతి అభివృద్ధి చేయడానికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌ ఏర్పాటుకు కలిసి పనిచేయడం, సమగ్రత అవసరమన్నారు. త్రివిధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌ దోహదపడుతుందన్నారు. ' ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌ ఏర్పాటు వల్ల  రైజ్-ట్రైన్-సస్టెయిన్ (RTS) ను ఇతర పరిపాలన విధులు వేరు అవుతాయి.దీనివల్ల  భద్రతా విషయాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి వీలవుతుంది " అని జనరల్ అనిల్ చౌహాన్ వివరించారు. 

అయితే, థియేటర్ కమాండ్స్ ఏర్పాటుతో  తదుపరి సంస్కరణలకు రంగం సిద్ధం అవుతుందని జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. దీనివల్ల బహుళ భౌగోళిక  కార్యకలాపాలు, స్పేస్ మరియు సైబర్ స్పేస్‌లను సాంప్రదాయ డొమైన్‌లుగా మార్చడం, యుద్దభూమి సమాచారం  డిజిటలైజేషన్ వంటి అనేక సంస్కరణలు అమలు చేయడానికి వీలవుతుందని  ఆయన అన్నారు.

భారత రక్షణ రంగంలో  సంస్కరణలు అవసరమని  జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా  కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న దేశాలు తమ  తమ భద్రతా వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం  భవిష్యత్తులో జరిగే యుద్ధం తీరును మార్చి వేస్తుందని  జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. 

 

***

 



(Release ID: 2021813) Visitor Counter : 26