నౌకారవాణా మంత్రిత్వ శాఖ

నౌకాయాన విభాగంలోని మహిళల నిమిత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించిన నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ

Posted On: 18 MAY 2024 6:50PM by PIB Hyderabad

నౌకాశ్రయాలుషిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.పి.ఎస్.డబ్ల్యు) నౌకాయాన విభాగంలో మహిళా నావికుల ముఖ్య సహకారాన్ని గౌరవిస్తూ  రోజు న్యూఢిల్లీలో నౌకాయాన విభాగంలోని మహిళల నిమిత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. "సేఫ్ హారిజన్స్విమెన్ ఇన్ షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ మెరిటైమ్ సేఫ్టీఅనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సముద్ర రంగంలో మహిళల భద్రత మరియు రక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  వేడుకల సందర్భంగాసముద్రయాన రంగంలో వివిధ డిగ్రీలు అభ్యసిస్తున్న వివిధ సముద్రయాన సంస్థలకు చెందిన 27 మంది మహిళా నావికులు మరియు కొంతమంది నిపుణులు సముద్ర పరిశ్రమకు అంకితభావంతో కృషి చేస్తున్న వారు గణనీయమైన కృషికి చేసిన వారిని  గుర్తించారు మహిళలను సాంప్రదాయకంగా పురుష-ఆధిపత్య రంగంలో వృద్ధి చెందడానికి అవసరమైన బలం మరియు స్థితిస్థాపకతకు ఉదాహరణగా చెప్పవచ్చు. వీరి విజయాలు నౌకాయాన రంగంలో భవిష్యత్తు తరాల మహిళలకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయిఈ సందర్భంగా ఎం.ఒ.పి.ఎస్.డబ్ల్యు. కార్యదర్శి శ్రీ టి కె రామచంద్రన్ మాట్లాడుతూ "

నౌకాయాన విభాగంలోని మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగాసముద్రయాన రంగంలో మహిళలు చేసిన అమూల్యమైన సేవలను మేము గౌరవిస్తున్నాము. మేము మరింత స్థిరమైన మరియు సమానమైన భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి అంకితభావం మరియు నైపుణ్యం చాలా కీలకం.  మనం  పరిశ్రమలో అడ్డంకులను ఛేదించిమహిళలకు అవకాశాలను కల్పించడం కొనసాగించాలికలిసిమనం సమతుల్యమైనవైవిధ్యమైన మరియు సంపన్నమైన సముద్ర సమాజాన్ని సాధించగలము.” అని అన్నారు. ఈ సంవత్సరపు ఇతి వృత్తం "సేఫ్ హారిజన్స్విమెన్ ఇన్ షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ మెరిటైమ్ సేఫ్టీ" సముద్ర భద్రతపై మహిళలు చూపే గణనీయమైన ప్రభావాన్ని నొక్కి చెబుతుందన్నారు. ఇది పరిశ్రమలో భద్రత యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను ఎత్తిచూపుతుంది. సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడంలో మరియు సముద్రంలో జీవితాలను రక్షించడంలో మహిళలు పోషించే ముఖ్యమైన పాత్రను గుర్తిస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి ఎజెండాలోని గోల్ 5లో గుర్తించబడినట్లుగా స్థిరమైన భవిష్యత్తుకు కీలకమైన స్తంభంగా లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యతను ఈ వేడుక హైలైట్ చేసింది. ఎం.ఒ.పి.ఎస్.డబ్ల్యు. అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ) మరియు ఇతర పరిశ్రమ వాటాదారుల సహకారంతో సహా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం మరియు భాగస్వామ్యాల ద్వారా సముద్రంయానంలోని మహిళలకు మద్దతు మరియు సాధికారత కల్పించడంలో కట్టుబడి ఉంది. గత 9 సంవత్సరాలలో, నావికుల సంఖ్య 140% పెరిగింది. 2014లో, క్రియాశీల భారతీయ నావికుల సంఖ్య 117,090 కాగా 2023లో 280,000కి పెరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 2014లో సుమారుగా 1,699 మంది మహిళా నావికులను నమోదు చేసింది, ఇది ఇప్పుడు 2023లో 10,440కి పెరిగింది. ఇది నమోదైన మహిళా భారతీయ నావికులలో 514% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం, 15.05.2024 నాటికి నమోదైన మొత్తం మహిళా నావికులు/ఇండోలు 13371 కాగా, 31.12.2023 వరకు యాక్టివ్ మహిళా నావికులు 4770.

***



(Release ID: 2021163) Visitor Counter : 50