కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"సంగం ఇనిషియేటివ్: ఏ లీప్ టువర్డ్స్ ఏఐ-డ్రైవెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్‌ఫర్మేషన్" తొలి దశ అభ్యర్థులను ప్రకటించిన డాట్
సంగమ్ చొరవకు అద్భుతమైన ప్రతిస్పందన, ఇప్పటివరకు 144 మంది అభ్యర్థుల ఎంపిక
అత్యాధునిక మౌలిక సదుపాయాల పరిష్కారాల ప్రతిపాదనల్లో ముందంజలో సాంకేతిక దిగ్గజాలు
ప్రతిపాదనల సమర్పణ గడువు 25 జూన్ 2024 వరకు పొడిగింపు
Posted On:
15 MAY 2024 5:26PM by PIB Hyderabad
"సంగం ఇనిషియేటివ్: ఏ లీప్ టువర్డ్స్ ఏఐ-డ్రైవెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్‌ఫర్మేషన్" చొరవలో తొలి దశ అభ్యర్థులను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (డాట్) ప్రకటించింది. ఈ చొరవను డాట్ 15 ఫిబ్రవరి 2024న ప్రారంభించింది. డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి భౌతిక వాతావరణాల ఖచ్చితమైన నమూనాలు రూపొందించడం ద్వారా మౌలిక సదుపాయాల ప్రణాళిక, రూపకల్పనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఈ చొరవ లక్ష్యం. ఈ వినూత్న విధానం నిజ సమయ అభిప్రాయాలను, అంచనా విశ్లేషణలను అందిస్తుంది & మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సామర్థ్యాన్ని, ఖచ్చితత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. భౌతిక ఆస్తుల సమగ్ర డిజిటల్ ప్రతిరూపాలను రూపొందించడానికి టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటేషనల్ సాంకేతికతలు, సెన్సింగ్, ఇమేజింగ్‌లు కలిసి పని చేసేలా సంగం ఇనీషియేటివ్ చూస్తుంది. తద్వారా, సంక్లిష్ట సవాళ్లకు సలుభమైన పరిష్కరం లభిస్తుంది. పూర్తి వివరాల కోసం https://sangam.sancharsaathi.gov.in/ ను సందర్శించండి.
భారీ స్పందన
సంగం చొరవపై పరిశ్రమ దిగ్గజాలు, అంకుర సంస్థలు, ప్రముఖ విద్యాసంస్థలు సహా 112 సంస్థలు, 32 మంది వ్యక్తుల ఆసక్తి కనబరిచారు. ఇందులో పాల్గొనేవారి పూర్తి జాబితా https://sangam.sancharsaathi.gov.in/selected-participants లో అందుబాటులో ఉంది. అభ్యర్థులకు డేటా ప్లాట్‌ఫామ్స్, అధునాతన ఏఐ మోడలింగ్, ఏఆర్/వీఆర్ అప్లికేషన్లు వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళికలు, సాంకేతిక నైపుణ్యం ఉన్నాయి.
ప్రతిపాదనల సమర్పణ గడువు పొడిగింపు
పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న అధిక ఆసక్తిని చూసి, ఆసక్తి వ్యక్తీకరణల (ఈవోఎల్) సమర్పణల గడువును డాట్ 25 జూన్ 2024 వరకు పొడిగించింది. తొలి దశ కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. సంగమ్ చొరవపై ఆసక్తి ఉన్నవాళ్లు ఇప్పటికే కొనసాగుతున్న & రాబోయే కార్యక్రమాల్లో పాల్గొనడానికి తమ ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి.
పెరుగుతున్న వినియోగ కేసుల 'లివింగ్ లిస్ట్'
సంగమ్ చొరవ కోసం అందిన ఆసక్తి వ్యక్తీకరణల్లో మౌలిక సదుపాయాల ప్రణాళిక, రూపకల్పనలోని వివిధ అంశాలు, సంక్లిష్ట సవాళ్ల పరిష్కారాలు, అవకాశాలను ప్రతిబింబించేలా విభిన్న వినియోగ కేసులు ఉన్నాయి. వినియోగ కేసులు, మౌలిక సదుపాయాల ప్రణాళికలో బహుముఖ సవాళ్లను 'లివింగ్ లిస్ట్' తేటతెల్లం చేస్తుంది. ఇందులో పాల్గొనదలిచిన వాళ్లు సంబంధిత సమాచారం, అభిప్రాయాలను https://sangam.sancharsaathi.gov.in లో పంచుకోవాలి.
రాబోయే నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు
సంగమ్ చొరవ కింద, డాట్ త్వరలో నెట్‌వర్కింగ్ కార్యక్రమాలను ప్రకటిస్తుంది. అత్యాధునిక సాంకేతికతల సాధ్యత, విస్తరణ, ఏకీకరణను దృష్టిలో పెట్టుకుని జ్ఞానాన్ని పంచుకోవడం, భాగస్వామ్య నిర్మాణం, వినియోగ కేసుల అన్వేషణ లక్ష్యంగా నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు ఉంటాయి.
https://sangam.sancharsaathi.gov.in/ లింక్ ద్వారా సంగమ్ వెబ్‌సైట్‌ను సందర్శించి, తాజా సమాచారాన్ని పొందొచ్చు, చర్చ వేదికల ద్వారా రాబోయే చర్చల్లో పాల్గొనవచ్చు,
సంగమ్ కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం:
***
(Release ID: 2020779)
Visitor Counter : 109