కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
‘జీవన సౌలభ్యం’ పరిధినివిస్తరించిన ఇపిఎఫ్ఒ: క్లెయిముల ను పరిష్కరించడాని కి సేవ ను అందించే కాలాన్నితగ్గించడమైంది
క్లెయిముల పరిష్కారం కోసం ఆటో-మోడ్ పరిధి ని పెంచినఇపిఎఫ్ఒ
విద్య, వివాహం మరియు గృహ నిర్మాణం ల కోసం ఆటో క్లెయిమ్ సెటిల్ మెంట్ ను ప్రవేశపెట్టిన ఇపిఎఫ్ఒ
Posted On:
13 MAY 2024 6:58PM by PIB Hyderabad
శ్రీ అనిరుధ్ ప్రసాద్ అనారోగ్యం కారణం గా 68జె పేరాగ్రాఫ్ వర్తించే విధం గా దరఖాస్తు ను 2024 మే 9 వ తేదీ న పెట్టుకొన్నారు. ఆయన కు 92,143 రూపాయల మొత్తాని కి గాను అడ్వాన్స్ క్లెయిము ను మూడు రోజుల లోపల 2024 మే 11 వ తేదీ న పరిష్కరించడమైంది. ఇపిఎఫ్ఒ లో శ్రీ అనిరుధ్ ప్రసాద్ వంటి గాథ లు అనేకం ఉన్నాయి.
ఇపిఎఫ్ఒ తన కోట్ల కొద్దీ సభ్యుల కు జీవన సౌలభ్యాన్ని పెంపొందింప చేయడం కోసం ఇక విద్య, వివాహం మరియు గృహ నిర్మాణం ల కోసం దాఖలు అయ్యే అడ్వాన్స్ క్లెయిముల ను ఆటో-మోడ్ లో సెటిల్ చేయడం అనే విధానాన్ని ప్రవేశ పెట్టింది. మానవ ప్రమేయం ఏదీ లేకుండానే ఐటి సిస్టమ్ ద్వారా ఈ తరహా క్లెయిమ్ దానంతట అదే ప్రాసెస్ అయ్యేటందుకు గాను ఆటో క్లెయిమ్ సాల్యూశన్ ను ఇపిఎఫ్ఒ తీసుకు వచ్చింది.
అనారోగ్యం కారణం తో అడ్వాన్స్ కు దరఖాస్తు పెట్టుకొంటే సదరు క్లెయిము ను పరిష్కరించడానికి ఆటో మోడ్ ను 2020 ఏప్రిల్ లో మొదలు పెట్టడమైంది. ప్రస్తుతం దీని పరిమితి ని పెంచివేసి ఒక లక్ష రూపాయల వరకు చేర్చడమైంది. వర్తమాన సంవత్సరం లో, సుమారు 2.25 కోట్ల మంది సభ్యుల కు ఈ సదుపాయం తాలూకు ప్రయోజనం అందగలదన్న అంచనా ఉంది.
ఇపిఎఫ్ఒ 2023-24 ఆర్థిక సంవత్సరం లో దాదాపు గా 4.45 కోట్ల క్లెయిమ్ లను పరిష్కరించింది; వాటిలో 60 శాతాని కి మించిన (2.84 కోట్ల) క్లెయిమ్ లు అడ్వాన్స్ సంబంధి క్లెయిము లే. ఆ సంవత్సరం లో పరిష్కరించిన మొత్తం అడ్వాన్స్ క్లెయిమ్ లలో దాదాపు గా 89.52 లక్షల క్లెయిముల ను ఆటో మోడ్ విధానాన్ని ఉపయోగించి పరిష్కరించడమైంది.
‘‘జీవన సౌలభ్యాని’’కి మార్గాన్ని సుగమం చేయడం కోసం ఆటో క్లెయిమ్ సాల్యూశన్ ను ఇక 1952 నాటి ఇపిఎఫ్ పథకం లోని 68కె పేరా (విద్య మరియు వివాహ విషయాల కు సంబంధించిన) మరియు 68బి (గృహ నిర్మాణానికి సంబంధించిన) లలో భాగం గా అన్ని క్లెయిముల కు విస్తరింప చేయడమైంది. దీనికి తోడు, దీని పరిమితి ని 50,000 రూపాయల నుండి పెంచి రెండు రెట్ల మేరకు అంటే 1,00,000 రూపాయలు గా చేయడమైంది. ఈ చర్య తో ఇపిఎఫ్ఒ లో లక్షల కొద్దీ సభ్యుల కు మేలు చేకూరుతుందన్న అంచనా ఉంది.
ఆటో-సెటిల్‌మెంట్ ప్రక్రియ లో భాగం గా పూర్తి ప్రక్రియ మానవ ప్రమేయం లేకుండా ఐటి సిస్టమ్ ద్వారానే నడుస్తుంది. కెవైసి, అర్హత మరియు బ్యాంకు ప్రమాణత్వం లతో పాటు ఏదైనా క్లెయిము ను ఐటి పరికరణం ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు కోసం ప్రాసెస్ చేయడమవుతుంది. ఫలితం గా, ఇటువంటి అడ్వాన్సుల కోసం క్లెయిము పరిష్కారం తాలూకు గడువు 10 రోజుల నుండి తగ్గిపోయి 3 లేదా 4 రోజుల లోపునకు తగ్గిపోతుందన్నమాట. సిస్టమ్ ప్రమాణీకరించని క్లెయిముల ను వాపసు చేయడమో లేదా తిరస్కరించడం జరుగదు. దీని తరువాత క్లెయిముల ను రెండో స్థాయి పరిశీలన మరియు అనుమోదం కోసం పంపడం జరుగుతుంది.
ఆటో క్లెయిము ల పరిధి ని విస్తరించడం తో గృహ నిర్మాణం, వివాహం మరియు విద్య ల ఉద్దేశ్యాలతో పాటు ఆటో క్లెయిము వృద్ధి ద్వారా నేరు గా చాలా మంది సభ్యుల కు తక్కువ లో తక్కువ సంభావ్య అవధి లోపల వారి యొక్క ధనం తాలూకు లాభాన్ని పొందడం లో సాయం లభించనుంది. దానితో వారు వారి యొక్క విద్య, వివాహం లేదా గృహ సంబంధి అవసరాల ను అప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం లో తగినంత సాయం అందనుంది.
దీనిని 2024 మే 6 వ తేదీ న పూర్తి భారతదేశం లో ఆరంభించడమైంది; అప్పటి నుండి ఇపిఎఫ్ఒ శీఘ్ర గతిన సేల ను అందించేటటువంటి ఈ యొక్క కార్యక్రమం మాధ్యం ద్వారా 45.95 కోట్ల రూపాయల విలువైన 13,011 కేసుల కు ఆమోదాన్ని తెలిపింది.
***
(Release ID: 2020587)
Visitor Counter : 82