రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ (1 టిఎస్ )లో 106 ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ ట్రైనీస్ కోర్స్ (IOTC) సిబ్బందికి సముద్రంలో శిక్షణ

Posted On: 12 MAY 2024 5:31PM by PIB Hyderabad

 

సముద్రంలో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 106 ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ ట్రైనీస్ కోర్స్ (IOTC) సిబ్బందికి వీడ్కోలు కార్యక్రమం జరిగింది 2024 మే 9న జరిగిన ఈ కార్యక్రమానికి సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్
ఇన్ చీఫ్ వీఏడీఎం వీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశాలకు చెందిన వారితో  సహా 99 మంది సముద్రంలో 1 టిఎస్ లో  విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన వారిని సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వీఏడీఎం వీ శ్రీనివాస్ అభినందించి ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందజేశారు.

 

శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మిడ్‌షిప్‌మ్యాన్ సి ప్రణీత్‌కుటెలిస్కోప్,శిక్షణలో  మొదటి స్థానంలో నిలిచిన మిడ్‌షిప్‌మ్యాన్ పిపికె రెడ్డి బైనాక్యులర్‌ను అందుకున్నారు.
 

శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడిన  ముఖ్యఅతిథి సముద్ర వాతావరణాన్ని అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు మారుతున్న యుద్ధ తంత్రాలు, వ్యూహాలు, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవడానికి కృషి చేయాలని సూచించారు. వేగం, భద్రత, ధైర్యంతో విధులు నిర్వర్తిస్తూ కింది స్థాయి సిబ్బంది పట్ల  వృత్తి నైపుణ్యం,సానుభూతితో పని చేయాలని ఆయన సూచించారు. ‘సేవా పరమో ధర్మం’ నినాదంతో విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు.
 

2024 మే 11న ఐఎన్ఎస్ తీర్ లో సంప్రదాయబద్ధంగా శిక్షణ [పూర్తి చేసుకున్న అధికారులు నిర్వహించిన విన్యాసాలను  సదరన్ నావల్ కమాండ్ సీఎస్ఓ (శిక్షణ) రియర్ అడ్మిరల్ సతీష్ షెనాయ్ సమీక్షించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు పశ్చిమ, తూర్పు సముద్ర తీరంలో నౌకాదళ యుద్ధనౌకలు, సముద్రతీరానికి సంబంధించిన సమగ్ర  శిక్షణ  కోసం కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ నౌకల్లో చేరుతారు.  మారిషస్ కోస్ట్ గార్డ్ కి చెందిన అసిస్టెంట్ కమాండెంట్  ప్రిషితా జగ్గమా 1 టిఎస్ లో సముద్ర శిక్షణ పూర్తి చేసిన మొదటి మహిళ  గా గుర్తింపు పొందారు.

****



(Release ID: 2020438) Visitor Counter : 74