విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశంలో విద్యుత్ పరిస్థితిపై తాజా సమాచారం: వేసవి నేపథ్యంలో పగలు మరియు రాత్రి సమయాల్లో విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చేందుకు చర్యలు

Posted On: 10 MAY 2024 8:18PM by PIB Hyderabad

ఏప్రిల్, మే మరియు జూన్ 2024 నెలలలో వేసవి విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి భారత ప్రభుత్వం తన ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ క్రింది చర్యలను ఇప్పటికే అమలులోకి తెచ్చింది.
 

  • ఉత్పత్తి కోసం పూర్తి సామర్థ్యాన్ని అందుబాటులో ఉంచడానికి దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సెక్షన్ 11 ఆదేశాలు
  • పవర్ ప్లాంట్ల ప్రణాళికాబద్ధమైన నిర్వహణ వర్షాకాలానికి మార్పు
  • థర్మల్ ఉత్పాదక యూనిట్ల పాక్షిక మరియు బలవంతపు అంతరాయాలను తగ్గించడం
  • దీర్ఘకాలంగా నిలిచిపోయిన థర్మల్ ప్లాంట్ల పునరుద్ధరణ
  • ఉత్పత్తి చేసే కంపెనీలకు (కేంద్ర మరియు రాష్ట్ర ఉత్పత్తి కంపెనీలు మరియు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్‌లు) పూర్తి సామర్థ్యం అందుబాటులో ఉండేలా తమ ఉత్పత్తి ప్లాంట్‌లను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచాలని సూచన
  • జల విద్యుత్ ఉత్పత్తి ఆప్టిమైజేషన్
  • మిగులు విద్యుత్‌ను ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌లో అమ్మకానికి అందించాలని ఉత్పాదక కేంద్రాలకు ఆదేశాలు

ఈ చర్యలతో  ఏప్రిల్ 2024లో 224 జీడబ్ల్యూగరిష్ట సాయంత్రపు విద్యుత్ డిమాండ్‌ను విజయవంతంగా తీర్చగలిగిన ప్రభుత్వం


వీటితో పాటు మే మరియు జూన్‌లలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం తదుపరి చర్యలను చేపట్టింది. ఇది మే నెలలో పగటిపూట 235 జీడబ్ల్యూ మరియు సాయంత్రం వేళల్లో 225 జీడబ్ల్యూ మరియు మే నెలలో 240 జీడబ్ల్యూ వద్ద గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేయబడింది. జూన్ 2024లో పగటి సమయం మరియు సాయంత్రం వేళల్లో 235 జీడబ్ల్యూ ఉంటుందని అంచనా.
 

  • దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల మాదిరిగానే గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కూడా సెక్షన్ 11 ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దాంతో ఇంతకుముందు అందుబాటులో ఉన్న 10జీడబ్ల్యూకి అదనంగా మే మరియు జూన్ నెలలకు అదనంగా 6 జీడబ్ల్యూ అందుబాటులోకి వచ్చింది.
  • జలవిద్యుత్ ఉత్పత్తి ఆప్టిమైజేషన్ మే మరియు జూన్ నెలల్లో డిమాండ్‌ను తీర్చడానికి అదనంగా 4 జీడబ్ల్యూని అందుబాటులోకి తెచ్చింది.
  • ఇంకా ప్రణాళికాబద్ధమైన నిర్వహణను మార్చడం మరియు థర్మల్ పవర్ ప్లాంట్ల పాక్షిక మరియు బలవంతపు అంతరాయాలను తగ్గించడం వల్ల వేసవి సీజన్‌కు మరో 5 జీడబ్ల్యూ అందుబాటులోకి వచ్చింది.
  • ఏప్రిల్‌తో పోలిస్తే మే మరియు జూన్‌లో గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 4 జీడబ్ల్యూ నుండి 5 జీడబ్ల్యూ వరకు పెరుగుతుందని అంచనా

ఈ విధంగా, పైన పేర్కొన్న చర్యలు అమలులో ఉన్నందున మరియు ప్రస్తుత ట్రెండ్ మరియు ఐఎండీ అంచనా వేసిన ప్రకారం తరువాతి నెలల్లో అంచనా వేసిన సాధారణ వర్షపాతం కారణంగా మే మరియు జూన్ 2024 వేసవి నెలలలో పగటిపూట మరియు రాత్రి సమయాల్లో విద్యుత్ డిమాండ్ తగినంతగా నెరవేరుతుందని అంచనా వేయబడింది.

***



(Release ID: 2020413) Visitor Counter : 68