మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అర్లి చైల్డ్‌హుడ్ కేర్ & ఎడ్యుకేశన్ (ఇసిసిఇ) యొక్క విస్తృత లక్ష్యాల సాధన కోసం నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ సంజయ్ కుమార్
प्रविष्टि तिथि:
09 MAY 2024 2:55PM by PIB Hyderabad
అర్లి చైల్డ్‌హుడ్ కేర్ & ఎడ్యుకేశన్ (ఇసిసిఇ) యొక్క విస్తృత లక్ష్యాల ను సాధించడం కోసం న్యూ ఢిల్లీ లోని ఆంబేడ్కర్ ఇంటర్‌నేశనల్ సెంటర్ లో ఈ రోజున జరిగిన ఒక సమావేశాని కి విద్య మంత్రిత్వ శాఖ లో పాఠశాల విద్య & అక్షరాస్యత కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం లో మహిళలు మరియు బాలల వికాసం మంత్రిత్వ శాఖ (ఎమ్ఒడబ్ల్యుసిడి), రాష్ట్రాలు మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేశన్ & లిటరసీ (డిఒఎస్ఇ&ఎల్) ల కు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల ప్రతినిధులు పాలుపంచుకొన్నారు. నేశనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్-ఫౌండేశనల్ స్టేజ్ (ఎన్‌సిఎఫ్-ఎఫ్ఎస్) లో లక్షించిన ప్రకారం, ఇసిసిఇ యొక్క ఇబ్బందులకు తావు ఉండనటువంటి పరివర్తన మరియు నాణ్యత భరిత ఇసిసిఇ కై పాఠశాల లో చేరే కంటే ముందుగా నేర్వవలసిన విద్య మరియు పాఠశాల విద్య ల ఆచరణ ఎంతైనా అవసరం.
ఈ సందర్భం లో శ్రీ సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ, సమావేశం యొక్క సందర్భాన్ని నొక్కి పలికారు; నాణ్యత భరిత ఇసిసిఇ యొక్క లక్ష్య సాధన లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ కు ఉన్న ప్రముఖమైనటువంటి పాత్ర ను గురించి ఆయన ప్రముఖం గా ప్రకటించారు. ఎమ్ఒడబ్ల్యుసిడి మరియు వివిధ రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు పరుస్తున్న వివిధ కార్యక్రమాల ను చూస్తుంటే సంతోషం గా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
సమావేశం కొనసాగిన క్రమం లో, ఒకటో తరగతి బోధన సదుపాయం ఉన్న సిబిఎస్ఇ మరియు కేంద్రీయ విద్యాలయాలు అన్నింటి లో మూడు ఏళ్ళ నుండి ఆరేళ్ళ వయస్సు బాలల కోసం మూడు బాల వాటికల వసతి ని కల్పించవలసిన ఆవశ్యకత ను గురించి ప్రముఖం గా పేర్కొనడమైంది. తగిన పూర్వ పాఠశాల విద్య ను నేర్చుకోవడం మరియు ఒకటో తరగతి కి సాఫీ గా మారడం కోసం వికేంద్రీకృత పద్ధతి న డబ్ల్యుసిడి యొక్క సమన్వయం తో గ్రామాల లో ప్రాథమిక పాఠశాలల తో పాటు గా ఆంగన్ వాడీ లను కూడా ఏర్పాటు చేయవలసిందని సిఫారసు చేయడమైంది.
సర్వాంగీణమైన విద్యాభ్యాసం కోసం పూర్వ ప్రాథమిక తరగతుల నిర్వహణ సదుపాయం కలిగివున్న ప్రభుత్వ పాఠశాలల్లో జాదూయీ పిటారా ను ఉపయోగించవలసిందిగా సూచించడమైంది. ఇప్పటికే ఉపయోగం లో ఉన్న బోధనాత్మక ఆట వస్తువుల వల్ల సిద్ధిస్తున్న ఫలితాల ను మదింపు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తో కలసి ఎన్‌సిఇఆర్‌టి పని చేయవచ్చునని, తద్ద్వారా ఎన్‌సిఎఫ్-ఎఫ్ఎస్ లక్ష్యాల తో పాటు సమలేఖనానికి పూచీ పడవచ్చన్న సలహా ను ఇవ్వడమైంది.
పూర్వ ప్రాథమిక (ప్రి-ప్రైమరి) స్థాయి నుండి ఒకటో తరగతి లోకి మారుతున్న బాలల పై దృష్టి పెట్టడం కోసం పోషణ్ ట్రాకర్ మరియు యుడిఐఎస్ఇ+ డేటా ను జోడించడం కోసం సహకరించుకోవాలని ఎమ్ఒఇ మరియు డబ్ల్యుసిడి లకు సలహా ను ఇవ్వడమైంది. రాష్ట్రాలు జరిపే కొనుగోళ్ల లో పారదర్శకత్వానికి మరియు సామర్థ్యానికి పూచీపడడం కోసం జాదూయీ పిటారా సంబంధి సామగ్రి కి కొలమానాల ను నిర్దేశించవచ్చు అలాగే రిక్వెస్ట్ స్ ఫార్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్‌పి స్ ) ను ఉపయోగించవచ్చని తెలియజేయడమైంది.
దృష్టిగోచరత్వం మరియు గుర్తింపు లను పెంచడం కోసం రాష్ట్రాల లో నిపుణ్ భారత్, జాదూయీ పిటారా, ఇ-జాదూయీ పిటారా మరియు విద్యా ప్రవేశ్ వంటి కార్యక్రమాల కై బ్రాండింగు ను ప్రమాణీకరించడం గురించి కూడా చర్చలు జరిగాయి.
జాదూయీ పిటారా తాలూకు స్వీకరించినటువంటి మరియు అనుకూలమైన వెర్శన్ తో కూడినటువంటి జాదూయీ పిటారాల కోసం ఎన్‌సిఇఆర్‌టి నిర్ధారించిన, నిర్దేశాల ప్రకారం నేర్చుకొన్న అంశాల వల్ల ఏ మేరకు పలితాలు వచ్చాయి అనే అంశాన్ని బేరీజు వేయాలి అనే సలహా కూడా వ్యక్తమైంది. నిర్దేశిత బోధన పరిణామాల ను అనుసరించడం లో ఎస్‌సిఇఆర్‌టి లకు ఎన్‌సిఇఆర్‌టి అండ గా నిలవాలి అని తెలియజేయడమైంది.
ప్రి- స్కూల్ టీచర్ లకు మరియు ఆంగన్ వాడీ వర్కర్ లకు (ఎడబ్ల్యుడబ్ల్యు) తగిన శిక్షణ ను ఇవ్వవలసిన అవసరం గురించి కూడాను సమావేశం లో కూలంకషకం గా చర్చించడమైంది.
***
(रिलीज़ आईडी: 2020189)
आगंतुक पटल : 150