హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి భవన్లో జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ సెరిమని-2  లో 2024 వ సంవత్సరాని కి గాను రెండు పద్మ విభూషణ్, తొమ్మిది పద్మ భూషణ్ మరియు  యాభై ఆరు పద్మ శ్రీ పురస్కారాల ను ప్రదానం చేసిన భారతదేశ రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 09 MAY 2024 8:55PM by PIB Hyderabad

భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో వైభవోపేతం గా జరిగినటువంటి సివిల్ ఇన్వెస్టిచర్ సెరిమని-2 లో 2024 వ సంవత్సరాని కి గాను పద్మ విభూషణ్ పురస్కారాలు రెంటిని, పద్మ భూషణ్ పురస్కారాల ను తొమ్మిదిటిని మరియు పద్మ శ్రీ పురస్కారాలు యాభై ఆరింటిని ప్రదానం చేశారు.

 

ఈ విశేష కార్యక్రమం లో భారతదేశం యొక్క ఉప రాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ ల మంత్రి శ్రీ అమిత్ శాహ్ లు సహా పలువురు కేంద్ర మంత్రులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

ఇన్వెస్టిచర్ సెరిమని ముగిసిన తరువాత, కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ ల మంత్రి శ్రీ అమిత్ శాహ్ న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో తాను ఏర్పాటు చేసిన రాత్రిపూట విందు కార్యక్రమం సందర్భం లో పద్మ పురస్కారాల గ్రహీతల తో శ్రీ అమిత్ శాహ్, ఇతర కేంద్ర మంత్రులు మాట్లాడారు.

 

పద్మ పురస్కారాల ను అందుకొన్న వ్యక్తులు రేపటి రోజు (2024 మే 10వ తేదీ)న ఉదయం పూట జాతీయ యుద్ధ స్మారకం లో శ్రద్ధాంజలి ని అర్పించనున్నారు. వారు రాష్ట్రపతి భవన్ ను మరియు ప్రధాన మంత్రి సంగ్రహాలయ ను కూడా సందర్శించనున్నారు.

 

***

 


(रिलीज़ आईडी: 2020188) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Gujarati , Kannada