రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సాయుధ దళాల సంయుక్తత్వం మరియు ఏకీకరణ అనే అంశాల పై మేనెల 9 వ, 10 వ తేదీల లో జరుగనున్న రెండు రోజుల సమావేశం  ‘పరివర్తన్ చింతన్ – 2’ కు అధ్యక్షత వహించనున్న సిడిఎస్ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్

Posted On: 09 MAY 2024 8:42AM by PIB Hyderabad

భారతదేశం లోని త్రివిధ సాయుధ దళాలు (సైన్యం, వాయు సేన మరియు నౌకాదళం లు) త్వరలోనే కలిసికట్టు గా కార్యకలాపాల ను జరపాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి మధ్య జరుగుతూ ఉన్న సంయుక్తత్వం మరియు ఏకీకరణ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు పోయే కృషి చోటు చేసుకొంటోంది.

 

 

‘‘పరివర్తన్ చింతన్’’ ను 2024 ఏప్రిల్ నెల 8 వ తేదీ న నిర్వహించడమైంది. ఇది దేశం లోని త్రివిధ దళాల కు చెందిన సంస్థ ల యొక్క ప్రముఖుల కోసం జరిపినటువంటి ముఖ్య సమావేశం అని చెప్పాలి. నూతన సంస్కరణల ప్రధానమైన ఆలోచన లు మరియు కార్యకలాపాల ను విస్తరించడం ఈ సమావేశం యొక్క ఉద్దేశ్యం గా ఉండింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్ అధ్యక్షత న 2024 మే నెల 9 వ మరియు 10 వ తేదీ లో రెండు రోజుల పాటు న్యూ ఢిల్లీ లో పరివర్తన్ చింతన్ - 2ను నిర్వహించాలనే పథకాన్ని రూపొందించడమైంది.

 

 

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ తాలూకు ఉప సంఘాలన్నింటి సభ్యులు, ఆ కమిటీ యొక్క శాశ్వత చైర్‌మన్ గా ఉన్నటువంటి సిడిఎస్ మరియు త్రివిధ దళాల ప్రధాన అధికారులు అనేక రంగాల లో చోటు చేసుకొన్న పురోగతి ని సమీక్షించనున్నారు. దీనికి అదనం గా, సాయుధ దళాల సంయుక్తత్వం మరియు ఏకీకరణ ల మాధ్యం ద్వారా పరివర్తన దిశ లో అపేక్షిత అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సంస్కరణల పైన చర్చించడం జరుగుతుంది.

 

 

 

**



(Release ID: 2020091) Visitor Counter : 111