ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తలసేమియా నివారణ, తలసేమియాను సకాలంలో గుర్తించడం మరియు నివారణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
"ఆర్ సి హెచ్ కార్యక్రమంలో తలసేమియా పరీక్షలను తప్పనిసరి చేయడం ద్వారా తలసేమియా భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు"
ప్రజలలో తలసేమియా గురించి విస్తృత అవగాహన కి ప్రాధాన్యత ఇచ్చారు; అవగాహన వీడియోను ప్రారంభించారు.
Posted On:
08 MAY 2024 3:42PM by PIB Hyderabad
శ్రీ అపూర్వ చంద్ర, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, వ్యాధిని పరిష్కరించడానికి తలసేమియాను సకాలంలో గుర్తించడం మరియు నివారించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సరైన సమయంలో నివారించడం ద్వారానే ఈ వ్యాధిని అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మాట్లాడారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మాట్లాడుతూ, "సకాలంలో గుర్తించడం మరియు నివారణ అనేది తలసేమియాను ఎదుర్కోవటానికి అత్యంత ప్రభావవంతమైన వ్యూహాలు" అని పేర్కొన్నారు. దేశంలో దాదాపు 1 లక్ష మంది తలసేమియా రోగులు ఉన్నారని, ప్రతి సంవత్సరం సుమారు 10,000 కొత్త కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. స్క్రీనింగ్ ద్వారా సకాలంలో గుర్తించడం ద్వారా చురుకైన జోక్యం యొక్క ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
శ్రీ అపూర్వ చంద్రా ఈ విషయమై విస్తృత అవగాహన అవసరాన్ని కూడా గుర్తించారు. "తలసేమియా వ్యాధి గురించి ఇంకా చాలామందికి తెలియదు, దీనిని ఎలా నివారించాలో తెలియదు. దీన్ని గురించిన అవగాహనను పెంచడానికి దేశవ్యాప్త ప్రచారంలో అందరూ భాగస్వాములు కావాలి" అని అన్నారు. ఈ దిశగా ముందడుగుగా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు తలసేమిక్స్ ఇండియా సంస్థల సహకరం తో తలసేమియాకు సంబంధించిన ప్రభావవంతమైన నివారణ పద్ధతులు మరియు అనుకూలమైన చికిత్సను ప్రోత్సహించడం కోసం రూపొందించిన ఓ వీడియోను ప్రారంభించారు (https://youtu.be/H__bidXcanE?si=-_87PEPxAdsPNaw1).
వ్యాధి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఎన్ హెచ్ ఎం క్రింద ఉన్న పునరుత్పత్తి మరియు పిల్లల ఆరోగ్య (ఆర్ సి హెచ్) కార్యక్రమాలలో నిర్బంధ తలసేమియా పరీక్షను చేర్చాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కూడా సూచించారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిని వారి ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో ఉంచాయని, మిగతా రాష్ట్రాలను తలసేమియా స్క్రీనింగ్ మరియు పరీక్షలను విస్తరించడానికి ప్రోత్సహించనున్నామని చెప్పారు.
తలసేమియా వంశపారంపర్య సంబంధిత రక్త వ్యాధి, దీని వల్ల శరీరంలో సాధారణం కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న ఆంతర్జాతీయ తలసేమియా దినోత్సవం వ్యాధి నివారణ ప్రాముఖ్యతను గుర్తించడం, అవగాహనను పెంచడం, పాల్గొనేవారిని సంవేదీకరించడం, ముందస్తు గుర్తింపును ప్రోత్సహించడం మరియు తలసేమియా బాధితులకు నాణ్యమైన సంరక్షణనుఅందించడం అనే కీలక అంశాలకు అవకాశం కల్పిస్తుంది. ఈ సంవత్సరం "ఎంపవర్ లైవ్స్, ఎంబ్రేసింగ్ ప్రోగ్రెస్: ఎక్వల్ అండ్ అక్సెసిబల్ తలసేమియా ట్రీట్మెంట్ ఫర్ ఆల్" అనే నినాదం అందరికీ సమగ్ర తలసేమియా సంరక్షణ అందుబాటులో ఉండాలనే సామూహిక లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.
కుమారి ఆరాధనా పాట్నాయక్, ఎఎస్ మరియు ఎండీ (ఎన్హెచ్ఎం); డా. జి.వి. బసవరాజు, అధ్యక్షులు, భారతీయ బాల వైద్య అకాడమీ; కుమారి శోభా తులి, కార్యదర్శి, థాలాసెమిక్స్ ఇండియా; డా. మనస్ కల్రా, ఆనరేరీ కార్యదర్శి, పి హెచ్ ఓ , ఐ ఏ పి చావ్టర్ మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇతర ప్రధాన అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 2020084)