రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కమాండెంట్స్ కాన్‌క్లేవ్ యొక్క ఆరో సంచిక ను పుణె లో నిర్వహించడమైంది


భారతీయ సాయుధ దళాల లో భావి నేతల ను తీర్చిదిద్దడం లోఅనుసరించవలసిన రక్షణ వ్యూహాల ను గురించి ఈ కాన్‌క్లేవ్ లో చర్చోపచర్చలు జరిగాయి

Posted On: 07 MAY 2024 4:47PM by PIB Hyderabad

కమాండెంట్స్ కాన్‌క్లేవ్ యొక్క ఆరో సంచిక ను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కేంద్రం ఆధ్వర్యం లో 2024 మే నెల 7 వ తేదీ నాడు పుణె లోని మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో నిర్వహించడమైంది. సాయుధ దళాల శిక్షణ సంస్థ ల (ఎఎఫ్‌టిఐ స్) మరియు యుద్ధ తంత్ర కళాశాల లకు చెందిన కమాండెంట్ లతో పాటు సాయుధ దళాల లోని సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశం లో పాలుపంచుకొని, భారతీయ సాయుధ దళాల భావి నేతల ను తీర్చిదిద్దడం లో అనుసరించవలసిన రక్షణ వ్యూహాల క్రమాన్ని నిర్ధారించడం కోసం మేధోమథనాన్ని జరిపారు.

 

 

సీనియర్ నాయకులు పుణె లోని ఎమ్ఐఎల్ఐటి లో గుమికూడి, భవిష్యత్తు కాలాని కి తగ్గట్లుగా దళాల ను నిర్మించడం అనే వ్యూహాన్ని ఖరారు చేయడం తో పాటు సంస్థల లోని ఉత్తమమైన అభ్యాసాల ను మరియు వారి వారి అంతర్ దృష్టుల ను పరస్పరం వెల్లడి చేసుకొన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ప్రపంచ సవాళ్ళు సరిక్రొత్త రూపాల ను దాల్చుతున్న నేపథ్యం లో భారతీయ సాయుధ దళాలు నిరంతర మెరుగుదల, నూతన పద్ధతుల అనుసరణ మరియు సహకార ధోరణి పట్ల నిబద్ధత ను కలిగివుండాలి అని స్పష్టం చేసింది. సాయుధ దళాల లో రాబోయే నాయకుల కు శిక్షణ ఇవ్వడం లో సరిక్రొత్త సాంకేతికతల ను అక్కున చేర్చుకోవడం లో, నూతన అంశాల ను నేర్చుకోవడం లో ముందుండాలి అనే అంశం పై విస్తృతమైన చర్చ ను జరిపేందుకు ఈ సమావేశం కమాండెంట్ లకు మరియు ఎఎఫ్‌టిఐ లకు చెందిన విధాన నిర్ణేతల కు ఒక వేదిక గా మారింది.

 

సమావేశం కొనసాగిన క్రమం లో వ్యూహాత్మకం గా కఠిన స్థితి ని ఎదుర్కొని నిలబడడం, సాంకేతికత పరం గా పురోగమించడం, మానవ వనరుల అభివృద్ధి, వివిధ బలగాల మధ్య సంయుక్త ప్రయాస లు వంటి కీలకమైన విషయాల పైన విస్తృత చర్చ జరిగింది; ఎఎఫ్‌టిఐ లలో ప్రపంచ శ్రేణి శిక్షణ కు పూచీ పడేందుకు ఆయా సంస్థ ల యొక్క ఉత్తమ అభ్యాసాల ను పరస్పరం వినియోగించుకోవాలని, నూతన ఆవిష్కరణ , సాంకేతిక పురోగతి ల అండదండల ను అందుకోవాలని కూడా చర్చించడమైంది.

 

***



(Release ID: 2020021) Visitor Counter : 51