రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

బిఆర్ఒ తన 65 వ స్థాపన దినాన్ని జరుపుకొంది


దేశ భద్రత లో ఒక ప్రధానమైన పాత్ర ను పోషిస్తున్నందుకుమరియు సరిహద్దు ప్రాంతాల లో సామాజిక-ఆర్థిక ప్రగతి కి పూచీ పడుతున్నందుకు బిఆర్ఒను ప్రశంసించిన రక్షణ శాఖ కార్యదర్శి

ప్రాజెక్టుల ను త్వరిత గతి న పూర్తి చేయడం కోసంఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బిఆర్ఒ ఉపయోగించాలని ఉద్ఘాటించారు

Posted On: 07 MAY 2024 1:47PM by PIB Hyderabad

బార్డర్ రోడ్స్ ఆర్గనైజేశన్ (బిఆర్ఒ) 2024 మే నెల 7 వ తేదీ న తన 65 వ స్థాపక దినాన్ని జరుపుకొంటున్నది. ఈ దినాని కి గుర్తు గా న్యూ ఢిల్లీ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాని కి రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానె అధ్యక్షత వహించారు. రక్షణ శాఖ కార్యదర్శి తన ప్రసంగం లో బిఆర్ఒ ను ఆ సంస్థ యొక్క బాధ్యతల ను దుర్గమ ప్రాంతాల లో మరియు కఠినమైన శీతోష్ణస్థితి నడుమ విజయవంతం గా నెరవేర్చుతున్నందుకు గాను అభినందించారు. బిఆర్ఒ అత్యంత కీలకమైన సంస్థ, సరిహద్దు ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు ల ద్వారా బిఆర్ఒ దేశ భద్రత తో పాటు గా దీనికి తోడు మారుమూల ప్రాంతాల లో సామాజిక - ఆర్థిక ప్రగతి కి కూడా పూచీ పడడం లో ప్రధానమైన పాత్ర ను పోషిస్తోంది అని ఆయన అన్నారు.

 

ప్రాజెక్టుల ను కాలబద్ధమైన రీతి న పూర్తి చేస్తున్నందుకు గాను బిఆర్ఒ ను శ్రీ గిరిధర్ అరమానె అభినందించారు. కర్మయోగులు సరిహద్దు ప్రాంతాల లో మౌలిక సదుపాయల అభివృద్ధి ని రికార్డు కాలం లో పూర్తి చేస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు లు శీఘ్రం గా పూర్తి కావడం కోసం బిఆర్ఒ అత్యాధునిక సాంకేతికత ను మరియు మెలకువల ను ఉపయోగించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే జరిగిన నాడు మానవ ప్రయాస లు తగ్గుతాయి మరియు మానవ శ్రమ ను మరింత సమర్థమైన విధం గా వినియోగించడం సాధ్యపడుతుంది అని ఆయన అన్నారు. ఆటోమేశన్ మరియు మెకనైజేశన్ లు రాబోయే కాలం లో బిఆర్ఒ కు కీలకం గా మారుతాయి అని ఆయన అన్నారు.

 

సిల్‌ క్యారా సొరంగ మార్గం కూలిన సందర్భం లో, సిక్కిమ్ వరదల కాలం లో చేపట్టిన సహాయక మరియు రక్షణ ప్రయాసల లో బిఆర్ఒ సిబ్బంది యొక్క విలువైన తోడ్పాటు ను కూడా రక్షణ శాఖ కార్యదర్శి గుర్తు కు తీసుకు వచ్చారు. ఎంపిక చేసిన సరిహద్దు గ్రామాల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యం గా అమలు పరుస్తున్నటువంటి వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ లో బిఆర్ఒ ఒక ముఖ్య భూమిక ను పోషించగలదని ఆయన అన్నారు.

 

ఇదే కార్యక్రమం లో, బార్డర్ రోడ్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీ రఘు శ్రీనివాసన్ ప్రసంగిస్తూ, బిఆర్ఒ లో అధికారులు అందరికి శుభాకాంక్షల ను తెలియ జేశారు. దేశం అంతటా ఉనికి ని ఏర్పరచుకొన్నటువంటి బిఆర్ఒ దేశ భద్రత, సంధానం మరియు అభివృద్ధి ల పట్ల తన నిబద్ధత ను ప్రదర్శిస్తోంది అని ఆయన అన్నారు. ‘‘మన ఘనమైన పర్వత ప్రాంతాల లోని మౌనం లో- కార్యం మాట్లాడుతుంది’’ అనేటటువంటి ధ్యేయ వాక్యం ఈ సంస్థ యొక్క సమర్పణ భావాన్ని, దృఢ దీక్ష ను మరియు దేశం లోని సుదూర ప్రాంతాల లో నివసిస్తున్న ప్రజల జీవనాల పైన ప్రసరిస్తున్న ప్రభావాన్ని వేనోళ్ళ వ్యక్తం చేస్తోంది అని ఆయన అన్నారు. ప్రదేశాల ను కలపడం ప్రజల ను కలపడం అనే ప్రతిజ్ఞ ను సంస్థ సిబ్బంది అందరు మరొక్క మారు స్వీకరించాలి; మరి అదే స్ఫూర్తి తో ప్రగతి, సమృద్ధి మరియు ఐకమత్యం ల తాలూకు చిరకాల వారసత్వాన్ని చాటి చెప్పాలి అని ఆయన ఉద్ఘాటించారు.

 

ఈ కార్యక్రమం లో కొన్ని పుస్తకాల ను రక్షణ శాఖ కార్యదర్శి ఆవిష్కరించారు, వాటిలో.. సెలా సొరంగ మార్గాన్ని గురించిన ఒక సంగ్రహం తో పాటుఊంచీ సడ్ కేఁన్’, ‘పథ్ ప్రదర్శక్లతో పాటు ‘పథ్ వికాస్’ అనే గ్రంథాలు ఉన్నాయి. ఆయన 2023-24 సంవత్సరం లో ఉత్కృష్ట ప్రదర్శనకు గాను పురస్కారాల ను బిఆర్ఒ అధికారుల కు ప్రదానం చేశారు. అంతేకాకుండా, సంస్థ లో మహిళా కార్యసాధకుల కు అభినందనల ను తెలియజేశారు. సెలా టనల్ ప్రాజెక్టు లోను, వివిధ ప్రాజెక్టుల లోను మరియు సిక్కిమ్ వరద ల కాలం లోను శ్రమించిన కేజువల్ పెయిడ్ లేబరర్స్ ను కూడా సమ్మానించడమైంది.

 

కేవలం రెండు ప్రాజెక్టుల తో 1960 వ సంవత్సరం లో బిఆర్ఒ ను స్థాపించడమైంది. ఆ రెండు ప్రాజెక్టులు ఏవేవి అంటే - వాటిలో ప్రాజెక్టు టస్కర్ (ప్రస్తుత ‘వర్తక్’) మరియు ప్రాజెక్టు బీకన్ లు ఉన్నాయి. బిఆర్ఒ ప్రస్తుతం 11 రాష్ట్రాల లో మరియు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల లో 18 ప్రాజెక్టుల ను నిర్వహిస్తూ, ఒక చైతన్యభరితం అయినటువంటి సంస్థ గా రూపుదిద్దుకొన్నది. ఈ సంస్థ ఇక అతి కఠినమైన ఎత్తు ప్రాంతాలలోను మరియు మంచు పరచుకొని ఉండేటటువంటి ప్రాంతాల లోను ఒక అగ్రగామి మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ గా పేరు తెచ్చుకొన్నది.

 

బిఆర్ఒ ముఖ్యం గా సాయుధ బలగాల యొక్క వ్యూహాత్మక అవసరాల ను తీర్చడం కోసం ఉత్తర సరిహద్దు ప్రాంతం లోను మరియు పశ్చిమ సరిహద్దు ప్రాంతం లోను 9,000 అడుగుల నుండి 19,000 అడుగుల ఎత్తున ఉన్న ప్రాంతాల లో రహదారుల నిర్మాణం మరియు నిర్వహణ కార్యాల ను భుజాన వేసుకొంటున్నది. ఆరు దశాబ్దాల లో, ఈ సంస్థ భారతదేశం లోని సరిహద్దు ప్రాంతాలతో పాటు భూటాన్, మ్యాంమార్, అఫ్ గానిస్తాన్, తాజికిస్తాన్ లు సహా మిత్ర దేశాల లో ప్రతికూల జలవాయు మరియు భౌగోళిక పరిస్థితుల లో 62,214 కిలో మీటర్ లకు పైగా రహదారుల ను, 1,005 వారిధుల ను, ఏడు సొరంగాల ను మరియు 21 వాయు క్షేత్రాల ను నిర్మించిన సంస్థ ఇది. తద్వారా ఈ సంస్థ దేశం యొక్క వ్యూహాత్మక లక్ష్యాల సాధన లో తన వంతు తోడ్పాటు ను అందిస్తున్నది.

 

బిఆర్ఒ మొత్తం 3,611 కోట్ల రూపాయల విలువ కలిగిన 125 మౌలిక సదుపాయాల సంబంధి ప్రాజెక్టుల ను 2023-24 లో పూర్తి చేసింది. వీటిలో అరుణాచల్ ప్రదేశ్ లో బాలిపాడా-చార్ ద్వార్-తవాంగ్ రోడ్డు లో భాగం గా సెలా సొరంగ మార్గం నిర్మాణం కూడా ఉంది. ఈ సొరంగ మార్గాన్ని ఇటీవలే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈటానగర్ లో వర్చువల్ మాధ్యం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేశారు. బిఆర్ఒ 4.10 కిలో మీటర్ ల పొడవైన శింకున్ లా సొరంగాన్ని నిర్మించే పని ని త్వరలోనే ప్రారంభించనుంది. ఈ సొరంగ మార్గం ఒకసారి నిర్మాణం పూర్తి అయింది అంటే గనక, 15,800 అడుగుల ఎత్తున ప్రపంచం లో అతి ఎత్తయినటువంటి సొరంగ మార్గం గా పేరు తెచ్చుకోనుంది. ఇది ప్రస్తుతం చైనా లో 15,590 అడుగుల పొడవైన మిలా సొరంగ మార్గాన్ని అతిగమించనుంది.

 

బిఆర్ఒ బాగ్ డోగ్ రా మరియు బరాక్ పుర్ అనే పేరులు ఉన్న రెండు ప్రముఖ ఎయర్ ఫీల్డ్ ప్రాజెక్టుల ను పూర్తి చేసిన ఘనత ను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు లు బిఆర్ఒ ఉత్కృష్ట యాత్ర లో మరొక మైలురాయి అని చెప్పాలి. రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ మధ్ ఎయర్ ఫీల్డ్ ప్రాజెక్టు కు ఇటీవలే శంకుస్థాపన జరిపారు. ఈ ప్రాజెక్టు ను రెండే వర్కింగ్ సీజన్ లలో సాకారం చేయాలి అని బిఆర్ఒ లక్ష్యం గా పెట్టుకొంది.

 

గడచిన కొన్ని సంవత్సరాల లో, బిఆర్ఒ యొక్క బడ్జెటు వ్యయం గణనీయం గా పెరిగింది. ఈ పరిణామం సంస్థ యొక్క సామర్థ్యం మరియు ప్రభావం లలో పెద్ద పురోగతి కి సూచిక గా ఉంది. బడ్జెటు పరం గా సమర్థన అధికం కావడం తో కీలకమైన ప్రాజెక్టుల ను ప్రారంభించే, మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం లో జోరు ను జతపరచే మరియు ఆ యా ప్రాజెక్టుల నిర్వహణ పరంగా తత్పరత ను వృద్ధి చెందింప చేసుకొనేందుకు సంస్థ కు తగిన అండదండలు లభించినట్లయింది.

 

బిఆర్ఒ పురుషుల తో పాటు మహిళల కు సమాన అవకాశాల ను కల్పించడం, మహిళల కు ముఖ్యమైన పదవుల ను మరియు అవకాశాల ను ఇవ్వడం లో అగ్రగామి గా ఉంది. కర్నల్ పూనింగ్ డోమింగ్ వంటి అధికారులు లద్దాఖ్ తూర్పు ప్రాంతం లో కీలకమైన ప్రాజెక్టుల కు నేతృత్వం వహిస్తున్నారు. సెలా టనల్ ప్రాజెక్టు ను ఫలప్రదం గా పూర్తి చేయడం లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనియర్ (సివిల్) శ్రీమతి నికిత చౌధరి ఒక ముఖ్య పాత్ర ను పోషించారు.

 

 

***


(Release ID: 2020020) Visitor Counter : 121