ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
విద్యార్థుల కు 2024 పరీక్షల ఫలితాల ను ప్రకటించడం తోనే డిజిలాకర్ మాధ్యంద్వారా మార్క్ శీట్ మరియు సర్టిఫికెట్ లను సులభంగా అందుబాటు లోకి తెచ్చి వారి సాధికారిత కు బాట ను పరుస్తున్న సిఐఎస్‌సిఇ
Posted On:
07 MAY 2024 9:39AM by PIB Hyderabad
కౌన్సిల్ ఫార్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేశన్ (సిఐఎస్‌సిఇ) ఒక అగ్రగామి డిజిటల్ పరివర్తన కార్యక్రమాన్ని చేపడుతూ డిజిలాకర్ ప్లాట్ ఫార్మ్ అనే మాధ్యం ద్వారా 2024 వ సంవత్సరం కోసం ఐసిఎస్ఇ (పదో తరగతి) మరియు ఐఎస్‌సి (పన్నెండో తరగతి ) పరీక్షల ఫలితాల ను డిజిటల్ మాధ్యం లో ప్రకటించడం కోసం డిజిలాకర్ ప్లాట్ ఫార్మ్ తో అనుబంధాన్ని ఏర్పరచుకొంది. దీనికి అదనం గా, సిఐఎస్‌సిఇ పరీక్షల ఫలితాలు ప్రకటించిన వెంటనే డిజిలాకర్ మాధ్యం ద్వారా మార్క్ శీట్ లను మరియు సర్టిఫికెట్టు లను అందుబాటు లోకి తీసుకు వచ్చింది. ఈ సంవత్సరం లో ఐసిఎస్ఇ లో మొత్తం 2,43,617 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. మరో 99,901 మంది ఐఎస్‌సి పరీక్షల ను వ్రాశారు.
ప్రస్తుతం 3.43 లక్షల మంది కి పైగా విద్యార్థులు పరీక్షల ఫలితాలు రాగానే డిజిలాకర్ లో సిఐఎస్‌సిఇ ద్వారా జారీ అయిన వారి విద్యార్జన సంబంధి దస్తావేజు లు ఉదాహరణ కు మార్క్ శీట్ లు మరియు సర్టిఫికెట్టుల ను ఎటువంటి అంతరాయాలకు తావు ఉండని విధం గా తెలుసుకొనే అవకాశం చిక్కుతుంది.
ఐసిఎస్ఇ 2024 పరీక్షల లో మొత్తం 99.47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. వారిలో బాలుర కంటే బాలికలదే పైచేయి గా (బాలుర లో 99.31 శాతం ఉత్తీర్ణత ఉండగా, బాలికల లో 99.65 శాతం ఉత్తీర్ణత) ఉంది. ఐఎస్‌సి పరీక్షల లో, 98.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. ఈ పరీక్షల లో కూడా ను బాలికలే బాలుర తో పోల్చినప్పుడు బాలిక లు (బాలుర లో 97.53 శాతం మంది ఉత్తీర్ణులు అవగా, బాలిక లు 98.92 శాతం ఉత్తీర్ణులు అయ్యారు) మెరుగైన ఫలితాల ను నమోదు చేశారు.
డిజిలాకర్ అనేది డిజిటల్ ఇండియా కార్యక్రమం లో ఒక ప్రముఖ ప్లాట్ ఫార్మ్ గా ఉంది. ఇది డిజిలాకర్ అనేది బోర్డు లు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర సంస్థ లు జారీ చేసే విద్య సంబంధి పత్రాల ను డిజిటల్ ఫార్మేట్ లో జారీ చేసేందుకు మరియు వాటి వద్దకు చేరుకొనేందుకు ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన మరియు పర్యావరణ మిత్రపూర్వకమైన పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చి ఈ క్రాంతికారి నిర్ణయానికి బాట ను పచింది.
ముఖ్య అంశాలు:
- యావత్తు భారతదేశం లోను మరియు విదేశాల లోను 2,42,328 మంది విద్యార్థులు ఐసిఎస్ఇ పరీక్ష లో ఉత్తీర్ణులు అయ్యారు: 98,088 మంది ఐఎస్‌సి లో ఉత్తీర్ణత ను సాధించారు.
- ఫలితాలను ప్రకటించిన వెనువెంటనే మార్క్ శీట్ లు, సర్టిఫికెట్టుల ను డిజిటల్ ఫార్మేట్ లో డిజిలాకర్ ప్లాట్ ఫార్మ్ ద్వారా అందుబాటు లోకి వస్తాయి.
· విద్యార్థులు వారి ఆధికారిక డిజిటల్ డాక్యుమెంట్స్ ను ఏ కాలం లో అయినా, ఎక్కడ నుండి అయినా సరే పొందేందుకు వీలు ఉంటుంది.
పరీక్షల ఫలితాల ను ఇకపై డిజిలాకర్ మరియు సిఐఎస్‌సిఇ వెబ్ సైట్ లో వాస్తవ కాల ప్రాతిపదిక న ప్రకటించిన వెంటనే అందుబాటులో ఉంటాయి అని సిఐఎస్‌సిఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్ & సెక్రట్రి డాక్టర్ శ్రీ జోసెఫ్ ఇమేన్యుయెల్ ప్రకటించారు. దీనికి అదనం గా, డిజిలాకర్ ప్లాట్ ఫార్మ్ లో విద్య సంబంధి దస్తావేజు పత్రాలు లభ్యం అవుతాయి అని ఆయన తెలిపారు.
***
(Release ID: 2020019)
Visitor Counter : 139