గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక సంవత్సరం 2023-24 లో రికార్డు ఉత్పాదన ను నమోదు చేసిన గని త్రవ్వకాల రంగం


కీలకమైన ఖనిజాలు మరియు అల్యూమినియమ్ లోహం ల ఉత్పాదనలో చక్కనైన వృద్ధి

Posted On: 03 MAY 2024 4:32PM by PIB Hyderabad

2024 వ సంవత్సరం మార్చి నెల లో ఖనిజాల ఉత్పాదన సూచీ 156.1 గా ఉండింది; అది 2023 మార్చి మాసం లో స్థాయి ని పోల్చి చూసినప్పుడు 1.2 శాతం అధికం గా ఉంది. ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై) 2023-24 కు గాను సూచీ ఎఫ్ వై 2022-23 కంటే 7.5 శాతం మేరకు పెరిగింది. కాపర్ కాన్సంట్రేట్, బంగారం, మాంగనీస్, వజ్రం, గ్రాఫైట్, క్యానైట్, సిలిమనైట్, లైమ్ శెల్, సున్నపు రాయి, మేగ్నసైట్ వంటి కొన్ని ఇంధనేతర ఖనిజాలు 2024 మార్చి నెల లో అంతక్రితం సంవత్సరం మార్చి మాసం తో పోల్చినప్పుడు సకారాత్మకమైన వృద్ధి ని నమోదు చేశాయి.

 

విలువ పరం గా గమనిస్తే మొత్తం ఎమ్‌సిడిఆర్ ఖనిజ ఉత్పాదన లో ఇనుప ఖనిజం, ఇంకా సున్నపురాయి కలసి దాదాపు గా 80 శాతం మేరకు ఉంటాయి. ఈ కీలకమైన ఖనిజాల ఉత్పాదన ఎఫ్‌వై 2023-24 లో తాత్కాలిక సంఖ్య ల ప్రకారం ఉన్నతమైన వృద్ధి ని ప్రదర్శించింది. ఎఫ్‌వై 2023-24 లో ఇనుప ఖనిజం యొక్క ఉత్పాదన 7.4 శాతం వృద్ధి తో 277 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎమ్‌ఎమ్‌టి) గా ఉండి, ఎఫ్‌వై 2022-23 లో సాధించిన 258 ఎమ్‌ఎమ్‌టి ఉత్పాదన తాలూకు రికార్డు ను బ్రద్దలు కొట్టింది. సున్నపురాయి ఉత్పాదన ఇదే తరహా సరళి ని ప్రదర్శిస్తూ ఎఫ్‌వై 2022-23 లో నెలకొల్పిన 406.5 ఎమ్ఎమ్‌టి రికార్డు కంటే ఎఫ్‌వై 2023-24 లో 10.7 శాతం మేర కు వృద్ధి చెంది, 450 ఎమ్ఎమ్‌టి కి చేరుకొంది.

 

 

నాన్-ఫెర్రస్ మెటల్ సెక్టర్ లో, ఎఫ్‌వై 2023-24 లో మౌలిక అల్యూమినియం లోహం యొక్క ఉత్పాదన ను గమనించినట్లయితే ఎఫ్‌వై 2022-23 లోని ఉత్పాదన రికార్డు ను బ్రద్దలు కొట్టింది. మౌలిక అల్యూమినియం ఉత్పాదన ఎఫ్‌వై 2022-23 లో నమోదు అయిన 40.73 లక్షల టన్నుల (ఎల్‌టి) నుండి 2.1 శాతం వృద్ధి రేటు తో ఎఫ్‌వై 2023-24 లో 41.59 ఎల్‌టి కి చేరుకొంది.

 

 

భారతదేశం ప్రపంచం లో రెండో అతి పెద్ద అల్యూమినియమ్ ఉత్పాదనదారు దేశంగా, మూడో అతి పెద్ద సున్నం ఉత్పాదనదారు దేశం గా, నాలుగో అతి పెద్ద ఇనుమ ఖనిజం ఉత్పాదనదారు దేశం గా ఉంది. ఎఫ్‌వై 2023-24 లో ఇనుప ఖనిజం మరియు సున్నపు రాయి ల ఉత్పాదన పరం గా ఆరోగ్యకరమైన వృద్ధి కి అద్దం పడుతూ, వాటి వినియోగ పరిశ్రమలు అయినటువంటి ఉక్కు మరియు సిమెంటు పరిశ్రమల నుండి పటిష్టమైన గిరాకీ కనిపించడాన్ని సూచిస్తున్నది. అల్యూమినియం లో అధిక వృద్ధి ని కూడా కలుపుకొంటే, ఈ వృద్ధి తాలూకు ధోరణులు శక్తి, మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణం, ఆటోమోటివ్, ఇంకా యంత్ర భాగాల వంటి వినియోగదారు సంబంధి రంగాల లో ఆర్థిక కార్యకలాపాలు సుదృఢం అవుతున్నాయని తెలియ జేస్తున్నాయి.

 

 

 

***


(Release ID: 2019705) Visitor Counter : 116