ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళా ఉద్యోగుల కు స్వీయరక్షణ పట్ల జాగృతి ని కల్పించడంకోసం కార్యశాల ను నిర్వహించిన ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
Posted On:
01 MAY 2024 4:44PM by PIB Hyderabad
ఆత్మరక్షణ మెళకువలు సహా మహిళల కు సంబంధించిన అంశాల ను గురించి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్‌డిఒఎన్ఇఆర్) లోని మహిళా ఉద్యోగులు మరియు విజ్ఞాన్ భవన్ ను ఆనుకొని ఉన్న భవన సముదాయం లో విధుల ను నిర్వహించే సిఐఎస్ఎఫ్ అధికారుల తో కలసి ఒక సమావేశాన్ని అంతర్గత ఫిర్యాదుల సంఘం యొక్క చెయర్ పర్సన్, ఎమ్‌డిఒఎన్ఇఆర్ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అనురాధ ఎస్. చగ్‌తీ నిర్వహించారు. ఈ సమావేశం లో మోనాలిసా దాస్, జెఎస్; ఇంకా శ్రీమతి సుచితా గుప్త, ఎస్ఎ లు కూడా పాలుపంచుకొన్నారు. సంఘం లో వెలుపలి సభ్యురాలు గా ఉన్న వైశాలి ధూత్ గారు మరియు సంఘం లోని ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ధూత్ గారు స్త్రీబల్ ఫౌండేశన్ కు సిఇఒ గా ఉన్నారు. ఆమె అనుభవజ్ఞురాలు అయిన ఆత్మరక్ష శిక్షకురాలు మరియు తాయ్ క్వాండో యుద్ధ విద్య లో నాలుగో డిఎఎన్ బ్లాక్ బెల్ట్ గ్రహీత కూడాను.
ఈ సమగ్ర సమావేశం లో ప్రాథమిక చిట్కాల ను, స్థితి ని బట్టి ఎలా నడుచుకోవాలి అనే జాగరూకత ను, పిడిగుద్దులు, నిరోధం, ఇంకా ఇతర ఆత్మరక్షణ సంబంధి పద్ధతుల ను గురించి చర్చించడమైంది. ధూత్ గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి తన ను తాను కాపాడుకోవడానికి పెద్దపీట ను వేయవలసి ఉంది అని నొక్కి చెప్పారు. అలాగే ఆత్మ రక్షణ సంబంధి శిక్షణ కు మరియు వ్యాయామానికి ప్రతి రోజు 10 నిమిషాల వంతు న అయినా కేటాయించుకోండి అంటూ సమావేశం లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ ను ప్రోత్సహించారు.
ఈ విధమైన నేర్పు వ్యక్తిగత సురక్ష కు పూచీ పడడం ఒక్కటే కాకుండా, ఇతరుల కు తోడ్పడుతూ వారిని రక్షించడంలోనూ మహిళల కు సత్తా ను అందిస్తుంది అని ఆమె అన్నారు.
**
(Release ID: 2019462)
Visitor Counter : 114