రాష్ట్రపతి సచివాలయం
భారతదేశం యొక్క రాష్ట్రపతి అయోధ్య ను సందర్శించారు; శ్రీ హనుమాన్ గఢీదేవాలయం లో మరియు ప్రభువు శ్రీ రామ్ దేవాలయం లో దర్శన కార్యక్రమం లోపాలుపంచుకొన్నారు
భారతీయ సమాజం యొక్క ఆదర్శాల కు మరియు సంస్కృతి కి ఒక చైతన్య భరితం అయినటువంటి ప్రతీక గా రాముని దేవాలయం ఉన్నది: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
Posted On:
01 MAY 2024 10:07PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ను భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు న అంటే 2024 మే నెల 1 వ తేదీ నాడు సందర్శించారు.
ప్రభువు శ్రీ రాముని యొక్క దేవాలయం లో దర్శన కార్యక్రమం లో రాష్ట్రపతి పాలుపంచుకొని, ఆరతి కార్యక్రమం లో కూడాను పాల్గొన్నారు. దర్శనం ముగిసిన అనంతరం రాష్ట్రపతి ఒక ట్వీట్ లో ‘ప్రభువు శ్రీ రాముడి ని దివ్యమైన బాలుని రూపం లో దర్శించే సౌభాగ్యం లభించింది’ అని వెల్లడించారు. రాముని యొక్క దేవాలయం భారతీయ సమాజం తాలూకు ఆదర్శాల కు మరియు సంస్కృతి కి ఒక చైతన్య భరితం అయినటువంటి ప్రతీక గా ఉందని ఆమె అన్నారు. అందరి సంక్షేమం కోసం కృషి చేసేటట్లుగా ప్రజల కు నిరంతరం ప్రేరణ ను రాముని ఆలయం ఇస్తూ ఉంటుందని ఆమె అన్నారు. ప్రభువు శ్రీ రాముని ఆశీర్వాదాలు కావాలంటూ ఆమె వేడుకొన్నారు; అలాగే పౌరులు అందరికి సమృద్ధి దక్కేటట్లు చూడవలసిందంటూ రాముడి ని ఆమె ప్రార్థించారు.
అంతక్రితం, శ్రీ హనుమాన్ గఢీ దేవాలయాన్ని రాష్ట్రపతి సందర్శించి, దర్శన కార్యక్రమం మరియు ఆరతి కార్యక్రమం లలో పాలుపంచుకొన్నారు. శ్రీ రాముని దేవాలయాన్ని సందర్శించే కంటే ముందుగా సరయు నది లోని స్నానఘట్టం వద్ద నిర్వహించిన ఆరతి కార్యక్రమం లో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు.
కుబేర్ టీలా లో జరిగిన పూజ కార్యక్రమం లో కూడా రాష్ట్రపతి పాలుపంచుకొన్నారు; జటాయు ప్రతిమ కు ప్రణామాన్ని ఆమె ఆచరించారు. దేవతామూర్తులు, మనుష్యులు మరియు ఇతర ప్రాణి కోటి ల నడుమ సమష్టి సంరక్షణ విలువల కు ఒక సంకేతం గా జటాయు పక్షి ని మన సంప్రదాయం లో ఎంతగానో ఆరాధించడం జరుగుతున్నది.
**
(Release ID: 2019458)
Visitor Counter : 145