రక్షణ మంత్రిత్వ శాఖ
ఎఒసి-ఇఎన్-సి ట్రైనింగ్ కమాండ్ పదవీ బాధ్యతల నుస్వీకరించిన ఎయర్ మార్శల్ శ్రీ నాగేశ్ కపూర్
प्रविष्टि तिथि:
01 MAY 2024 2:02PM by PIB Hyderabad
ఎయర్ మార్శల్ శ్రీ నాగేశ్ కపూర్ 2024 మే నెల 1 వ తేదీ నాడు ట్రైనింగ్ కమాండ్ (టిసి) లో ఎయర్ ఆఫిసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (ఎఒసి-ఇఎన్-సి) గా పదవీ బాధ్యతల ను స్వీకరించారు.
ఎయర్ మార్శల్ శ్రీ ఎన్. కపూర్ 1986 వ సంవత్సరం డిసెంబరు 6 వ తేదీ నాడు భారత వాయుసేన లో ఫైటర్ స్ట్రీమ్ లో తన సేవల ను ప్రారంభించారు. ఆయన నేశనల్ డిఫెన్స్ అకైడమి, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ మరియు నేశనల్ డిఫెన్స్ కాలేజి లలో పూర్వపు విద్యార్థి. ఆయన కు ఒక క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ మరియు ఫైటర్ కమ్బైట్ లీడర్ గా 3,400 గంటల కు మించిన విమాన చోదన సంబంధి అనుభవం ఉంది.
ఎయర్ మార్శల్ తన అద్భుతమైన వృత్తి జీవనం లో అనేక ఫీల్డ్ అపాయింట్‌మెంట్ లతో పాటు స్టాఫ్ అపాయింట్‌మెంట్స్ ను నిర్వహించారు. ఆయన నిర్వహించినటువంటి ఆపరేశనల్ పదవుల లో సెంట్రల్ సెక్టర్ లో ఫైటర్ స్వాడ్రన్ కు కమాండింగ్ ఆఫీసర్, వెస్టర్న్ సెక్టర్ లో ఒక ఫ్లయింగ్ బేస్ కు స్టేశన్ కమాండర్ మరియు ఒక ప్రముఖ వాయు స్థావరాని కి ఎయర్ ఆఫీసర్ కమాండింగ్ అనే టటువంటి బాధ్యతలు ఉన్నాయి. వీటికి అదనం గా, ఆయన వాయుసేన అకైడమి లో ప్రధాన బోధకుడు (ఫ్లయింగ్) మరియు ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజి, వెల్లింగ్‌టన్ లో డైరెక్టింగ్ స్టాఫ్ అనే పదవీ బాధ్యతల ను కూడా నిర్వహించారు. ఎయర్ మార్శల్ శ్రీ నాగేశ్ కపూర్ ఎయర్ ఫోర్స్ అకైడమి లో తన పదవీ కాలం లో పిసి-7 ఎమ్‌కె ఐఎల్ విమానాన్ని భారత వాయు సేన (ఐఎఎఫ్) లో చేర్చుకోవడంతో పాటు ఆ విమానం యొక్క సేవల ను వినియోగించుకోవడం లో ముఖ్య పాత్ర ను పోషించారు. ఆయన పాకిస్తాన్ లో డిఫెన్స్ అటాశీ గా దౌత్య పదవీ బాధ్యతల ను కూడా ను చేపట్టారు. ఆయన నిర్వహించినటువంటి స్టాఫ్ అపాయింట్‌మెంట్స్ విషయానికి వస్తే వాయు సేన ప్రధాన కేంద్రం లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయర్ స్టాఫ్ ఆపరేశన్స్ (స్ట్రైటజీ), సౌథ్ వెస్టర్న్ ఎయర్ కమాండ్ లో ఎయర్ డిఫెన్స్ కమాండర్ మరియు సెంట్రల్ ఎయర్ కమాండ్ ప్రధాన కేంద్రం లో సీనియర్ ఎయర్ స్టాఫ్ ఆఫీసర్ వంటివి ఉన్నాయి. ఆయన ప్రస్తుత నియామకం తాలూకు బాధ్యత లను స్వీకరించడాని కంటే పూర్వం ఎయర్ హెడ్ క్వార్టర్స్ లో ఎయర్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ పర్సనెల్ గా సేవల ను అందించారు.
ఎయర్ మార్శల్ శ్రీ నాగేశ్ కపూర్ కు ఆయన యొక్క ప్రశంసనీయమైన సేవ కు గుర్తింపు గానా అన్నట్లు 2008 వ సంవత్సరం లో వాయు సేన మెడల్ తో మరియు 2022 వ సంవత్సరం లో అతి విశిష్ఠ్ సేవా మెడల్ తో సమ్మానించడమైంది.
**
(रिलीज़ आईडी: 2019455)
आगंतुक पटल : 191