కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

2023 వ సంవత్సరంలో అక్టోబరు మొదలుకొని డిసెంబరు మధ్య మూడు నెలల కాలాని కి గాను ‘‘ఇండియన్ టెలికం సర్వీసెస్ పర్‌ఫార్మెన్స్ ఇండికేటర్రిపోర్టు’’ ను విడుదల చేసినట్రాయ్

Posted On: 23 APR 2024 2:51PM by PIB Hyderabad

టెలికమ్ రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ- ట్రాయ్) ‘‘ఇండియన్ టెలికమ్ సర్వీసెస్ పర్‌ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్టు ’’ ను ఈ రోజు న విడుదల చేసింది. ఈ నివేదిక 2023 వ సంవత్సరం డిసెంబరు 31 వ తేదీ తో ముగిసిన మూడు నెలల కాలాని కి సంబంధించింది. ఈ నివేదిక 2023 అక్టోబరు 1 వ తేదీ మొదలుకొని అదే సంవత్సరం లో డిసెంబరు 31 వ తేదీ మధ్య కాలం లో భారతదేశం లో టెలికం సర్వీసుల స్థూల దృష్టి కోణం మరియు టెలికం సర్వీసుల తో పాటు కేబుల్ టివి, డైరెక్ట్ టు హోం (డిటిహెచ్), ఇంకా రేడియో ప్రసార సేవల ను గురించి న కీలకమైన కొలమానాల ను, వృద్ధి ధోరణుల ను తెలియజేస్తుంది. సేవల ను అందిస్తున్నటువంటి సంస్థ లు తెలిపిన సమాచారం ఆధారం గా ఈ నివేదిక ను రూపొందించడమైంది.

 

నివేదిక యొక్క శుద్ధ సారాన్ని కూడాను జత పరచడమైంది. పూర్తి నివేదిక ట్రాయ్ యొక్క వెబ్ సైట్ (www.trai.gov.in లో మరియు http://www. Trai.gov.in/release-publication/reports/performance-indicators-reports అనే లింకు) లోను లభ్యం అవుతున్నది. ఈ నివేదిక కు సంబంధించిన ఎటువంటి సలహా ను అయినా ఇవ్వడానికి గాని లేదా ఏదైనా అంశం పైన వివరణ ను పొందడం కోసం గాని టెలిఫోన్ నంబర్ +91-11-23234367 లో గాని లేదా ఇ-మెయిల్: advfea2@trai.gov.in లో గాని ట్రాయ్ యొక్క సలహాదారు (ఎఫ్&ఇఎ) శ్రీ అమిత్ శర్మ ను సంప్రదించవచ్చును.

 

శుద్ధ సారాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.

 

***

 



(Release ID: 2018601) Visitor Counter : 137