ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర బడ్జెట్ అంచనాలను మించి 7.40% మేర ఎక్కువగా జరిగి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.35 లక్షల కోట్లు వసూలు అయిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలిక)


2023-24 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలను మించి రూ. 13,000 కోట్లు వసూలు అయిన నికర ప్రత్యక్ష పన్ను (తాత్కాలిక)

18.48% వార్షిక వృద్ధిని నమోదు చేసి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 23.37 లక్షల కోట్లు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలికం)

17.70% వార్షిక వృద్ధిని సూచిస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 19.58 లక్షల కోట్లు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలిక)

రూ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.79 లక్షల కోట్ల మేరకు రిఫండ్

Posted On: 21 APR 2024 1:01PM by PIB Hyderabad

తాత్కాలిక వివరాల ప్రకారం  2023-24 ఆర్థిక సంవత్సరంలో  రూ. 1.35 లక్షల కోట్ల మేరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17.70% పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16.64 లక్షల కోట్లుగా ఉంది.  

 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను ఆదాయం రూ. 18.23 లక్షల కోట్లు వరకు ఉంటుందని సవరించిన  కేంద్ర బడ్జెట్‌ అంచనాలు పేర్కొన్నాయి.  సవరించిన అంచనాల ప్రకారం పన్ను వసూళ్లు  రూ. 19.45 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. వాస్తవ . తాత్కాలిక ప్రత్యక్ష పన్ను వసూళ్లు (రీఫండ్‌ల నికరం) బడ్జెట్ అంచనాలకు మించి  7.40%, సవరించిన అంచనాలకు మించి  0.67% మేర జరిగాయి. 

2023-24 ఆర్థిక సంవత్సరంలో  ప్రత్యక్ష పన్నుల స్థూల సేకరణ (తాత్కాలిక) (రిఫండ్  కోసం సర్దుబాటు చేయడానికి ముందు) రూ 23.37 లక్షల కోట్లుగా ఉంది.  2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 19.72 లక్షల కోట్లుగా ఉంది. 

 2023-24 ఆర్థిక సంవత్సరంలో  స్థూల కార్పొరేట్ పన్ను సేకరణ (తాత్కాలిక) రూ. 11.32 లక్షల కోట్ల వరకు ఉంది. గత ఏడాది ఈ మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాదితో పోల్చి చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో  స్థూల కార్పొరేట్ పన్ను సేకరణ  13.06% వృద్ధి నమోదు చేసింది.  2023- 24 ఆర్థిక సంవత్సరంలో   నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు (తాత్కాలికం) రూ. 9.11 లక్షల కోట్లుగా ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం తో  పోల్చి చూస్తే  నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 10.26% వృద్ధిని చూపాయి. గత ఏడాది పన్ను వసూళ్లు  8.26 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. .

 2023- 24 ఆర్థిక సంవత్సరంలో  స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ( ఎస్టీటీ తో సహా) (తాత్కాలిక) రూ .12.01 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 9.67 లక్షల కోట్ల  ( ఎస్టీటీ తో సహా) వరకు ఉన్నాయి.  స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు  24.26% వృద్ధిని చూపాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో  నికర వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ( ఎస్టీటీ తో సహా)   (తాత్కాలిక) రూ. 10.44 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది నికర వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ( ఎస్టీటీ తో సహా) రూ.8.33 లక్షల కోట్లుగా ఉంది.  నికర వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ( ఎస్టీటీ తో సహా) 25.23% వృద్ధిని చూపాయి.

 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.79 లక్షల కోట్ల రూపాయలు రిఫండ్ రూపంలో తిరిగి చెల్లించారు. , 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం  3.09 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 

 

***


(Release ID: 2018552) Visitor Counter : 242