నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
గ్రీన్ హైడ్రోజన్ మరియు రిన్యూవబుల్ ఎనర్జిమేన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టుల కు ప్రోత్సాహాన్ని అందించనున్న ఇరెడా యొక్క జిఐఎఫ్టి సిటీ
నేశనల్ గ్రీన్హైడ్రోజన్ మిశన్ లో భాగం గా పెట్టుకొన్న లక్ష్యాల ను సాధించడం లో శక్తి నిలవ దికీలక పాత్ర: వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జి సమిట్ 2024 లో ఇరెడా సిఎమ్ డి
Posted On:
18 APR 2024 10:37AM by PIB Hyderabad
ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జి డివెలప్ మెంట్ ఏజెన్సి లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ.. ‘ఇరెడా’) గాంధినగర్ లోని జిఐఎఫ్ టి సిటీ (గిఫ్ట్ సిటీ) లో ఒక కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం కొన్ని విదేశీ కరెన్సీల లో రుణ ఐచ్చికాల ను సమకూర్చడం లో విశేషించి తోడ్పడనుంది. దీనితో నేచరల్ హెడ్జింగు కు ఆస్కారం లభించడం తో పాటు గ్రీన్ హైడ్రోజన్ మరియు రిన్యువబుల్ ఎనర్జి మేన్యుఫాక్చరింగ్ లకు సంబంధించిన ప్రాజెక్టు ల ఫైనాన్సింగ్ కాస్ట్ లు కూడా గణనీయం గా తగ్గగలవు. ఈ యొక్క వ్యూహాత్మక కార్యక్రమం ఒక హరిత భవిత మార్గం లో దేశం సాగిస్తున్న ప్రయాణానికి తన వంతు తోడ్పాటు ను అందించగలుగుతుంది అని ఇరెడా చెయర్ పర్సన్ ఎండ్ మేనేజింగ్ డైరెక్టరు (సిఎమ్ డి) శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. ఆయన 2024 ఏప్రిల్ 17వ తేదీ నాడు అబు ధాబి లో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జి సమిట్ 2024 లో భాగం గా ‘‘దీర్ఘకాలిక శక్తి నిలవ కు సంబంధించిన భావి వృద్ధి అవకాశాలు’’ అంశం పై నిర్వహించిన ఒక బృంద చర్చ లో పాల్గొని మాట్లాడుతూ, ఈ సంగతి ని తెలియ జేశారు.
నేశనల్ గ్రీన్ హైడ్రోజన్ మిశన్ లో భాగం గా 2030వ సంవత్సరానికల్లా ప్రతి ఏటా 5 మిలియన్ మీట్రిక్ టన్నుల కు పైచిలుకు హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయాలన్న మహత్వాకాంక్ష భరిత లక్ష్యాన్ని సాధించడం లో శక్తి నిలవ ప్రక్రియ ది కీలకమైన పాత్ర అని ఇరెడా సిఎమ్ డి స్పష్టం చేశారు. నిలవ కు సంబంధించిన సాంకేతికత లు పురోగమించేటట్టు గా చూడడం కోసం కొన్ని కీలక ప్రాథమ్యాల ను నిర్దేశించుకొన్నట్లు ఆయన వివరించారు.
శక్తి ని నిలవ చేసేందుకు సంబంధించిన పరిష్కారమార్గాల యొక్క పనితీరు ను మెరుగుపరచడం తో పాటు తత్సంబంధి ఖర్చు ను తగ్గించుకోవడం కోసం పరిశోధన మరియు అభివృద్ధి ప్రయాసల ను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది అని కూడా సిఎమ్ డి నొక్కి పలికారు. శక్తి ని నిలవ ఉంచుకోవడానికి సంబంధించిన సాంకేతికతల ను మోహరించడం లో సాఫల్యాన్ని సాధించడం కోసం సరఫరా వ్యవస్థ ను పటిష్టపరచేటటువంటి విధానాల ను ఆచరణ లో పెట్టవలసి ఉంటుంది అని ఆయన అన్నారు. స్పర్ధాత్మకం అయినటువంటి మరియు అవసరాలను తీర్చేటటువంటి ఆర్థిక సహాయ ఏర్పాటుల ను సమకూర్చడం వల్ల శక్తి నిలవ కు సంబంధించిన ప్రాజెక్టుల లో పెట్టుబడుల కు ప్రోత్సాహం లభించగలదని కూడా ఆయన అన్నారు.
ఈ దిశ లో భారతదేశం చురుకైన చర్యల ను తీసుకొంది; ఈ చర్యల లో 2047 వ సంవత్సరం వరకు ఎంతమేరకు నిలవ అవసరపడుతుంది అనేటటువంటి ఒక మార్గసూచీ ని రూపొందించడం, అనువుగా ఉండేటటువంటి సాంకేతికతల ను ఉపయోగించుకొంటూ నిలవ ప్రక్రియ కు దోహద పడే టెండర్ లు, బ్యాటరీ తయారీ ఇంకా పంప్ డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుల కు సమర్థన ను అందించేటటువంటి ప్రభుత్వ విధానాల ను అమలు లోకి తీసుకు రావడం వంటివి ఈ విధమైన చర్యల లో కొన్ని చర్యలు గా ఉన్నాయి. 2030-32 కల్లా దాదాపు గా 400 గీగావాట్-అవర్స్ (జిడబ్ల్యుహెచ్) మేరకు నిలవ లు అవసరం అవుతాయి, ఇందుకోసం 3.5 లక్షల కోట్ల రూపాయల కు పైచిలుకు పెట్టుబడి కావలసి వస్తుంది అని సెంట్రల్ ఎలక్ట్రిసిటి ఆథారిటి ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది.
స్పర్ధాత్మకమైన రేటుల కు సరిక్రొత్త గా ఉనికి లోకి వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ రూపొందించే నవోన్మేష ఉత్పాదనల కు సాయపడడం అనే మాధ్యం ద్వారా ఇరెడా నవీకరణయోగ్య శక్తి ప్రాజెక్టుల కు ఆర్థిక సహాయాన్ని అందించడం లో ఇరెడా ఇతర సంస్థల కంటే ముందు నిలబడుతోంది. మరి భారతదేశం లో శక్తి నిలవ సంబంధి సాంకేతికతల ను రంగం లోకి తీసుకు వచ్చే సంస్థల కు అండదండలను అందించడానికి ఇరెడా కంకణం కట్టుకొంది.
****
(Release ID: 2018166)
Visitor Counter : 363