రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

శిక్షణ లో ఉన్నఇండియన్ ఇకనామిక్ సర్వీస్ అధికారులు రాష్ట్రపతి తో సమావేశమయ్యారు

Posted On: 16 APR 2024 12:43PM by PIB Hyderabad

ఇండియన్ ఇకనామిక్ సర్వీస్ (ఐఇఎస్) కు చెందిన (2022 మరియు 2023 వ సంవత్సరాల బ్యాచ్ లలో) శిక్షణ ను పొందుతున్నటువంటి అధికారుల సమూహం భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు (2024 ఏప్రిల్ 16 వ తేదీ) న సమావేశమయ్యారు.

 

అధికారుల ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఆర్థిక వృద్ధి అనేది దేశం యొక్క అభివృద్ధి లో ఒక ముఖ్యమైనటువంటి భాగమన్నారు. స్థూల ఆర్థిక సూచికల ను మరియు సూక్ష్మ ఆర్థిక సూచికల ను ప్రగతి తాలూకు ఉపయోగకరమైన పరామితులు గా పరిగణిస్తున్నారన్నారు. ఈ కారణం గా ప్రభుత్వ విధానాల ను మరియు పథకాల ను ప్రభావవంతం అయినటువంటివి గా, ఉపయోగకరమైనటువంటివి గా రూపొందించడం లో ఆర్థిక వేత్తల భూమిక కీలకమని చెప్పారు. ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా రూపుదిద్దుకొనే దిశ లో భారతదేశం పయనిస్తోందని, కాబట్టి వారికి రాబోయే కాలాల్లో వారి యొక్క సామర్థ్యాల ను వృద్ధి చెందింప చేసుకోవడం కోసం, అలాగే వాటిని పూర్తి స్థాయి లో ఆచరణ లో పెట్టేటందుకోసం లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తాయి అని అధికారుల తో ఆమె చెప్పారు. ఈ అవకాశాల ను సరి అయిన విధం గా వినియోగించుకోవడం ద్వారా వారు దేశం యొక్క అభివృద్ధి కి గణనీయమైనటువంటి తోడ్పాటు ను ఇస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

 

ఇకనామిక్ సర్వీస్ ఆఫీసర్స్ ఆర్థిక విశ్లేషణ కోసం తగిన సూచనల ను అందించడం తో పాటు అభివృద్ధి కార్యక్రమాల యొక్క రూపకల్పన, మరి పథకాల మూల్యాంకనం, వనరుల పంపిణీ వ్యవస్థ పటిష్టీకరణ ల కోసం కూడాను దోహద పడతారని ఆశిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు. వారు ఇచ్చే సూచనల మరియు సలహాల ఆధారం గా విధానాల ను నిర్ణయించడం జరుగుతుందని, అంటే ఇది ఒక ముఖ్యమైన బాధ్యత అన్న మాట అని ఆమె పేర్కొన్నారు.

 

డేటా విశ్లేషణ మరియు సాక్ష్యాలపై ఆధార పడినటువంటి అభివృద్ధి కార్యక్రమాల అమలు అనేవి ప్రజల ఆర్థిక ఎదుగుదల ప్రక్రియ ను వేగిర పరచడం లో ప్రభుత్వాని కి సహాయకారి గా నిలచాయి అని రాష్ట్రపతి అన్నారు. క్రొత్త క్రొత్త ఆలోచనలు, పద్ధతులు మరియు మెలకువల మాధ్యం ద్వారా యువ ఐఇఎస్ అధికారులు వారి యొక్క పని ప్రధానమైనటువంటి కౌశలాన్ని ఇనుమడింప చేసుకోవడం వారి యొక్క కర్తవ్యం అని రాష్ట్రపతి స్పష్టం చేశారు. శరవేగం గా మార్పునకు లోనవుతున్న ఈ కాలం లో దేశ పురోగతి కి క్రొత్త ద్వారాల ను తెరవడం లో యువ అధికారుల సృజనాత్మకత తోడ్పడుతుందని ఆమె అన్నారు.

 

2022 వ మరియు 2023 వ బ్యాచ్ లకు చెందిన ఐఇఎస్ అధికారుల లో 60 శాతాని కి పైగా అధికారులు గా మహిళ లు ఉండడాన్ని గమనించిన తనకు సంతోషం వేస్తోంది అని రాష్ట్రపతి అన్నారు. మహిళ ల ప్రాతినిధ్యం పెరగడం భారతదేశం లో అభివృద్ధి ఫలాలు అందరికి అందేటట్లు చూడాలన్న సంకల్పాన్ని నెరవేర్చడం లో సహాయకారి కాగలదని ఆమె అన్నారు. మహిళల సర్వోతోముఖ అభివృద్ధి దిశ లో పాటుపడండి అంటూ మహిళా అధికారుల కు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు.

 

యువ అధికారులు వారి పని ప్రదేశం లో విధానపరమైన సూచనల ను, సలహాల ను ఇచ్చేటప్పుడు గాని లేదా ఏదైనా నిర్ణయాన్ని తీసుకొనేటప్పుడు గాని పేదల మరియు వెనుకబడిన వర్గాల హితాలను దృష్టి లో పెట్టుకోవాలని రాష్ట్రపతి కోరారు.

 

***


(Release ID: 2018060) Visitor Counter : 100