ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 సమిట్ 2019జరిగిన సందర్భం లో ‘రశ్యా-ఇండియా-చైనా (ఆర్ఐసి) నేత ల లాంఛనప్రాయ శిఖర సమ్మేళనం జరగగా అందులో ప్రధాన మంత్రి ప్రారంభికప్రసంగం పాఠం  

Posted On: 28 JUN 2019 3:33PM by PIB Hyderabad

శ్రేష్ఠులు మరియు నా మిత్రులు అధ్యక్షులు శ్రీ శీ జిన్ పింగ్ గారు మరియు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ గారు లు,

క్రిందటి సంవత్సరం లో అర్జెంటీనా లో మన మూడు దేశాలు ఒక శిఖర సమ్మేళనం స్థాయి సమావేశాన్ని నిర్వహించుకొన్నాయి.

ప్రపంచం ఎదుట ఉన్న ప్రధానమైన అంశాల పై మన అభిప్రాయాల ను ఉపయోగకరమైన విధం గా ఒకరి దృష్టి కి మరొకరం తీసుకు వచ్చిన అనంతరం మనం రాబోయే కాలం లో మళ్ళీ ఒకసారి సమావేశం కావాలని సమ్మతి ని వ్యక్తపరచాం.

ఈ రోజు న ఈ యొక్క ఆర్ఐసి లాంఛనప్రాయ శిఖర సమ్మేళనాని కి గాను మిమ్ముల ను ఆహ్వానిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.


ప్రపంచం లో అగ్రగామి ఆర్థిక వ్యవస్థల ను కలిగివున్న దేశాలు గా ప్రపంచం యొక్క ఆర్థిక, రాజకీయ మరియు భద్రత సంబంధి స్థితిగతుల పైన మన మధ్య అభిప్రాయాల ను వెల్లడించుకోవడాని కి ప్రాముఖ్యం ఉన్నది. మన యొక్క ఈ త్రైపాక్షిక సమావేశం ప్రధానమైన ప్రపంచ అంశాల ను గురించి చర్చించడాని కి మరియు సమన్వయాన్ని నెలకొల్పుకోవడాని కి ఒక ఉపయోగకరమైనటువంటి మాధ్యం గా ఉందని చెప్పాలి.

ఈ సంవత్సరం లో ఈ సంవత్సరం లో ఫిబ్రవరి లో చైనా లో జరిగిన మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశం లో అనేక అంశాల ను గురించి అభిప్రాయాల ను తెలియ జేసుకోవడమైంది. ఆ అంశాల లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడాన్ని ప్రోత్సహించడం, ఇంటర్ నేశనల్ హాట్-స్పాట్ సంబంధి అంశాలు, బహుళ పార్శ్విక సంస్థల లో సంస్కరణ లు, జలవాయు పరివర్తన ల తో పాటు ఆర్ఐసి లో భాగం గా సహకారాన్ని ముందుకు తీసుకు పోవడం వంటి అంశాలు భాగం అయ్యాయి.


ఇప్పుడు ఇక నేను శ్రేష్ఠుడు, అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ ను ఆయన తన ప్రారంభిక ప్రసంగాన్ని ఇవ్వవలసింది గా కోరుతున్నాను.
 

(అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ ప్రారంభిక ప్రసంగాన్ని ముగించిన తరువాత)
ధన్యవాదాలు అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ గారు.
ఇక నేను, శ్రేష్ఠుడు, అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ను ఆయన యొక్క ప్రారంభిక ప్రసంగాన్ని ఇవ్వవలసింది గా కోరుతున్నాను

(అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తన ప్రారంభిక ప్రసంగాన్ని ముగించిన తరువాత)
అధ్యక్షుడు పుతిన్ గారు, మీకు ధన్యవాదాలు.

అస్వీకరణ: ప్రధాన మంత్రి హిందీ భాష లో ప్రసంగించారు. ఇది ఆయన ఉపన్యాసాని కి భావానువాదం.

 

***



(Release ID: 2017393) Visitor Counter : 33