ప్రధాన మంత్రి కార్యాలయం

బెల్జియమ్ ప్రధాన మంత్రి శ్రీ అలెగ్జాండర్ డీ క్రూ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలపరచుకొనేందుకు గలమార్గాల ను గురించి నేత లు చర్చించారు

ఒకటో పరమాణు శక్తి శిఖర సమ్మేళనాని కి విజయవంతం గాఆతిథేయి గా వ్యవహరించినందుకు ప్రధాని శ్రీ డీ క్రూ కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి

పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల పైన మరియుప్రపంచ అంశాల పైన ఇద్దరు నేతలు వారి వారి ఆలోచనల ను ఒకరి కి మరొకరు తెలియజేసుకొన్నారు

Posted On: 26 MAR 2024 4:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బెల్జియమ్ యొక్క ప్రధాని శ్రీ అలెగ్జాండర్ డీ క్రూ తో టెలిఫోన్ లో ఈ రోజు న మాట్లాడారు.

బ్రసెల్స్ లో ఇటీవల జరిగిన ఒకటో పరమాణు సంబంధి శక్తి శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరించి ఆ కార్యక్రమాన్ని సఫలం చేసినందుకు ప్రధాని శ్రీ డీ క్రూ కు అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.

భారతదేశాని కి మరియు బెల్జియమ్ కు మధ్య నెలకొన్న ఉత్కృష్ట సంబంధాల ను ఇద్దరు నేత లు సమీక్షించారు. వ్యాపారం, పెట్టుబడి, స్వచ్ఛమైన సాంకేతికత లు, సెమికండక్టర్స్, ఔషధ నిర్మాణం, గ్రీన్ హైడ్రోజన్, ఐటి, రక్షణ, నౌకాశ్రయాలు, ఇంకా ఇతర పలు రంగాల లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సుదృఢం చేసుకొనేందుకు ఏ యే మార్గాలను అనుసరించాలో వారు చర్చించారు.

కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ కు అధ్యక్ష బాధ్యతల ను ప్రస్తుతం బెల్జియమ్ వహిస్తున్న కాలం లో ఇండియా-ఇయు స్ట్రటీజిక్ పార్ట్‌నర్‌శిప్ ను మరింత గా పెంపొందింప చేసుకోవడం కోసం ఇద్దరు నేత లు వారి యొక్క వచనబద్ధత ను ధ్రువపరచారు.

వారు ప్రాంతీయ ఘటన క్రమాల పైన మరియు ప్రపంచ ఘటన క్రమాల పైన అభిప్రాయాల ను ఒకరికి మరొకరు తెలియ జేసుకొన్నారు. పశ్చిమ ఆసియా ప్రాంతం లోను మరియు రశ్యా-యూక్రేన్ సంఘర్షణ లోను శాంతి మరియు సురక్ష పునరుద్ధరణ వీలైనంత త్వరిత గతి న జరిగేటందుకు గాను సహకారాన్ని మరియు సమర్థన ను వృద్ధి చెందింప చేసే విషక్ష్ లో వారు తమ సమ్మతి ని తెలియ జేశారు.

నేత లు ఇరువురు సంప్రదింపుల ను కొనసాగిస్తూ ఉండేందుకు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 2016401) Visitor Counter : 145