ప్రధాన మంత్రి కార్యాలయం

గ్యాల్‌ త్సుయెన్ జెత్సున్ పేమా వాంగ్‌చుక్ మాత, శిశువుల ఆసుపత్రి ని ప్రారంభించడమైంది

Posted On: 23 MAR 2024 2:43PM by PIB Hyderabad

గ్యాల్‌ త్సుయెన్ జెత్సున్ పేమా వాంగ్‌చుక్ మాత శిశువుల ఆసుపత్రి ని థిమ్పూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు భూటాన్ యొక్క ప్రధాని శ్రీ త్శెరింగ్ టోబ్ గే లు కలసి ప్రారంభించారు. ఈ అత్యాధునిక ఆసుపత్రి ని భారత ప్రభుత్వం యొక్క సహాయం తో నిర్మించడమైంది

 

రెండు దశల లో 150 పడకల గ్యాల్‌ త్సుయెన్ జెత్సున్ పేమా వాంగ్‌చుక్ మాత, శిశువు ల ఆసుపత్రి ని అభివృద్ధి పరచే కార్యక్రమాని కి భారత ప్రభుత్వం సహాయాన్ని అందించింది. ఈ ఆసుపత్రి లో ఒకటో దశ ను 22 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించ గా, 2019 వ సంవత్సరం లో ఇది పని చేయడం ప్రారంభించింది. ఆసుపత్రి లో రెండో దశ నిర్మాణాన్ని పన్నెండో పంచవర్ష ప్రణాళిక లో భాగం గా 119 కోట్ల రూపాయల ఖర్చు తో 2019 వ సంవత్సరం లోనే మొదలుపెట్టగా అది ఇప్పుడు పూర్తి అయింది.

 

క్రొత్త గా నిర్మించిన ఆసుపత్రి భూటాన్ లో మాతృమూర్తులు మరియు శిశువుల ఆరోగ్య సంబంధి సేవల నాణ్యత ను పెంచనుంది. ఈ క్రొత్త ఆసుపత్రి లో బాలల వైద్య చికిత్స, మహిళల రోగాలు మరియు ప్రసూతి విజ్ఞ‌ానం సంబంధి సేవ లు, ప్రసవ వేదన ఉపశమన కారక సేవ లు, శస్త్ర చికిత్సాలయం, పసికందుల సంరక్షణ సంబంధి సేవ లు మరియు పీడియేట్రిక్ ఇంటెన్సివ్ కేయర్ విభాగాల లో అత్యాధునిక సదుపాయాలు అందుబాటు లో ఉంటాయి.

 

ఆరోగ్య సేవల రంగం లో భారతదేశం-భూటాన్ భాగస్వామ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ గా గ్యాల్‌ త్సుయెన్ పేమా వాంగ్ చుక్ మాతా, శిశువుల ఆసుపత్రి నిలుస్తోంది.

 

 

***



(Release ID: 2016311) Visitor Counter : 119