నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఆర్థికరంగంలో హైడ్రోజన్, ఇంధన సెల్స్ విషయంలో అంతర్జాతీయ భాగస్వామ్యానికి సంబంధించి
హరిత హైడ్రోజన్, దాని డెరివేటివ్ లపై చర్చించిన 41వ స్టీరింగ్ కమిటీ
Posted On:
20 MAR 2024 12:38PM by PIB Hyderabad
ఆర్థిక వ్యవస్థలో హైడ్రోజన్, ఫ్యూయల్ సెల్స్‌కు సంబంధించి(ఐపిహెచ్‌ఇ)న అంతర్జాతీయ భాగస్వామ్యం విషయంలో 41వ స్టీరింగ్ కమిటీ సమావేశాలకు ఇండియా ఆతిథ్యమిచ్చింది. 2023 మార్చి 18`22 తేదీల మధ్య న్యూఢల్లీిలో ఇవి జరిగాయి. మార్చి 19న లాంఛనంగా ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేఁశాలరెండు, మూడు రోజులైన మార్చి 19, 20 తేదీలను 41వ స్టీరింగ్‌కమిటీ సమావేశ ప్రొసీడిరగ్స్‌కు కేటాయించారు. ఈ సమావేశాలు, న్యూడిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్ లో జరిగాయి.
తొలిరోజు స్టీరింగ్ కమిటీ ప్రొసీడిరగ్స్‌ను చేపట్టింది. ఐపిహెచ్‌ఇ వైస్ ఛైర్ డాక్టర్ నో వాన్ హుల్స్‌ట్ ప్రారంభోపన్యాసం చేస్తూ భారతదేశ జతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌ను ఆయన అభినందించారు. ఐపిహెచ్‌ఇ ప్రతినిధి బృందానికి ఇండియా అద్భుత ఆతిథ్యం ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పునరుత్పాదక ఇంధన వనరుల సంయుక్త కార్యదర్శి శ్రీ అజయ్ యాదవ్ ప్రారంభోపన్యాసం చేస్తూ, ఆర్థికవ్యవస్థను కర్బన రహితం చేసేందుకు , హరిత హైడ్రోజన్ వాడకాన్ని వాడవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ దిశగా పరస్పర సమన్వయంతో కూడిన కార్యాచరణ అవసరమని అన్నారు.
ఆస్గ్రియా, చిలీ, ఫ్రాన్స్, యూరోపియన్ కమిషన్, జపాన్, జర్మని, నెదర్లాండ్స్,యుఎఇ, యుకె, అమెరికా , సింగపూర్, దక్షిణ కొరియా లనుంచి ఐపిహెచ్‌ఇ ప్రతినిధులు, ఆతిథ్యదేశమైన ఇండియా నుంచి ఐపిహెచ్‌ఇ ప్రతినిధులు ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హరిత హైడ్రోజన్, దాని డెరివేటివ్‌లను ఉపయోగించడానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ కమిటీ, అంతర్జాతీయ స్థాయిలో హరిత హైడ్రోజన్ కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను చర్చించింది.
అలాగే గ్లాస్‌గో అజెండా, హైడ్రోజన్ మినిస్టీరియల్, క్లీన్ ఎనర్జీమినిస్టీరియల్, హెచ్ 2 చొరవ, క్లీన్‌హైడ్రోజన్ మిషన్ ఇన్నొవేషన్, జి7 హైడ్రోజన్ కార్యాచరణ ఒప్పందం, జి 20 , కాప్ 28, అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ, తదితరాల గురించి కూడా ఈ సమావేశం చర్చించింది. దీనితో పాటుఈ అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఐపిహెచ్‌ఇ లక్ష్యాలను సాధించడం గురించి , తమ ముందున్న లక్ష్యాల గురించి చర్చించారు. పరిశుభ్రమైన, సమర్ద ఇంధన దిశగా పరివర్తన సాధించడం, హైడ్రొజన్, ఫ్యూయల్ సెల్‌టెక్నాలజీ ని సమర్ధంగా వివిధ రంగాలు, ఇతరత్రా వాడుకలో ముందుకు తీసుకెళ్లఢం ఐపిహెచ్‌ఇ లక్ష్యం.
వివిధ వర్కింగ్ గ్రూప్‌లు, టాస్క్‌ఫోర్సులు సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా సమావేశం చర్చించింది. ఈ వర్కింగ్‌గ్రూప్‌లు, టాస్క్‌ఫోర్సులు తీసుకోవలసిన మరిన్ని చర్యలపైనా చర్చింరారు. రెగ్యులేషన్ కోడ్స్, ప్రమాణాలు, భద్రతపైన, విద్య , విస్తరణ కార్యకలాపాల పైన వర్కింగ్ గ్రూప్‌లను ఐసిహెచ్ ఇ కలిగి ఉంది.అలాగే హైడ్రోజన్‌నైపుణ్యాలు, హైడ్రోజన్ ఉత్పత్తి విశ్లేషణ, హైడ్రోజన్ సర్టిఫికేషన్ యంత్రాంగం, హైడ్రోజన్ వాణిజ్య నిబంధనలు వంటి వాటిపై టాస్క్‌ఫోర్స్‌లు ఉన్నాయి. ఈ కమిటీ అంతర్జాతీయంగా హైడ్రోజన్ వాణిజ్యంలో డబ్ల్యుటిఒ ఫ్రేమ్‌వర్క్ పాత్రపై కూడా చర్చించింది.ఈ కమిటీ ప్రొసీడిరగ్స్‌లో ఐపిహెచ్‌ఖి దార్శనికత, స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యకలాపాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్ వంటివి ఉన్నాయి. ఈ కమిటీ ప్రొసీడిరగ్స్ 2024 మార్చి 20 న కూడా కొనసాగాయి.
ఐదురోజులపాటు నిర్వహించతలపెట్టిన స్టీరింగ్ కమిటీ సమావేశాలలో తొలిరోజు సమావేశాన్ని 2024 మార్చి18న ఐఐటి ఢల్లీిలో ఐపిహెచ్‌ఇ అకడమిక్‌ఔట్ రీచ్ ఏర్పాటుచేసింది. ఈ సదస్సులో ప్రతినిధులు భవిష్యత్ హైడ్రోజన్ ఇంధనం, ఫ్యూయల్‌సెల్ టెక్నాలజీ వంటి వాటి గురించి వారుతమ విలువైన ఆలోచనలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
***
(Release ID: 2016308)
Visitor Counter : 123