మంత్రిమండలి

ఒక కోటి కుటుంబాల కు ఇంటి పైకప్పు పైన సౌరఫలకాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ‘పిఎమ్-సూర్య ఘర్: ముఫ్త్ బిజ్‌లీ యోజన’కు ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి


కుటుంబాలు ప్రతి నెల 300 యూనిట్ ల విద్యుచ్ఛక్తి ని ఉచితం గా అందుకొంటాయి

Posted On: 29 FEB 2024 3:38PM by PIB Hyderabad

ఇంటి కప్పు పైన సౌర ఫలకాన్ని ఏర్పాటు చేసే మరియు ఒక కోటి కుటుంబాల కు ప్రతి నెలా 300 యూనిట్ ల వరకు విద్యుచ్ఛక్తి ని ఉచితం గా అందజేసేందుకు ఉద్దేశించిన ‘‘పిఎమ్-సూర్య ఘర్: ముఫ్త్ బిజ్‌లీ యోజన’’ ను మొత్తం 75,021 కోట్ల రూపాయల వ్యయండి తో అమలు చేయడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఈ పథకాన్ని 2024 ఫిబ్రవరి 13 వ తేదీ నాడు ప్రధాన మంత్రి ప్రారంభించారు.

 

ఈ పథకం లో ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

నివాస భవనాల పైకప్పు మీద సౌర శక్తి ఉత్పాదన కై కేంద్రీయ ఆర్థిక సహాయం (సిఎఫ్ఎ)

 

  1. ఈ పథకం లో భాగం గా రెండు కిలోవాట్ (కెడబ్ల్యు) సామర్థ్యం కలిగిన వ్యవస్థ ఏర్పాటు కు అయ్యే ఖర్చు లో 60 శాతం మరియు 2 నుండి 3 కెడబ్ల్యు సామర్థ్యం కలిగి ఉండే వ్యవస్థ ల ఏర్పాటుకు అదనం గా 40 శాతం వ్యయం ను సిఎఫ్ఎ రూపం లో సమకూర్చడం జరుగుతుంది. సిఎఫ్ఎ ను 3 కెడబ్ల్యు సామర్థ్యం వరకు ఉండే యూనిట్ లకే పరిమితం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రామాణికం గా ఉన్న ధరల లో చూసుకొంటే, ఒక కెడబ్ల్యు వ్యవస్థ కోసం 30,000 రరూపాయల సబ్సిడీ, 2 కెడబ్ల్యు సామర్థ్యం కలిగి ఉండే వ్యవస్థ లకు 60,000 రూపాయలు మరియు 3 కెడబ్ల్యు సామర్థ్యం లేదా అంత కంటే అధిక సామర్థ్యం తో ఉండే వ్యవస్థ ను ఏర్పాటు చేయడానికి 78,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది అన్న మాట.
  2. ఈ పథకం లో చేరే కుటుంబాలు జాతీయ పోర్టల్ మాధ్యం ద్వారా సబ్సిడీ కోసం దరఖాస్తు పెట్టుకొంటాయి. ఇంటి పైకప్పు మీద సౌర శక్తి వ్యవస్థ ను అమర్చడం కోసం ఒక సముచిత విక్రేత ను ఎంపిక చేసుకొంటాయి. ఏర్పాటు చేయబోయే సౌర శక్తి వ్యవస్థ యొక్క ఆకారాన్ని, లాభం తాలూకు లెక్కింపు ను, విక్రేత రేటింగు ను వగైరా సంబంధి సమాచారాన్ని జాతీయ పోర్టల్ అందించి కుటుంబాల కు అవి ఒక నిర్ణయాన్ని తీసుకొనే ప్రక్రియ లో సహకారాన్ని అందిస్తుంది.
  3. ఈ పథకం లో చేరే కుటుంబాలు 3 కిలోవాట్ వరకు గల నివాస భవన రూఫ్ టాప్ సోలర్ సిస్టమ్ (ఆర్ టిఎస్) ను నెలకొల్పుకోవడం కోసం ప్రస్తుతం 7 శాతం పూచీకత్తు అక్కరలేనటువంటి తక్కువ వడ్డీ తో కూడిన రుణం యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతాయి.

 

ఈ పథకం లోని ఇతర ముఖ్యాంశాలు

 

1. గ్రామీణ ప్రాంతాల లో ఇంటి పైకప్పు మీద సౌర వ్యవస్థ ను అమర్చడాని కి ఇది ఒక నమూనాగా ఉంటుంది. దేశం లోని ప్రతి ఒక్క జిల్లా లో ఒక ఆదర్శ సౌర గ్రామాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుంది,

 

2. పట్టణ స్థానిక సంస్థలు మరియు పంచాయతీ రాజ్ సంస్థలు వాటి వాటి నిర్ణయాధికార పరిధుల లో రూఫ్ టాప్ సోలర్ వ్యవస్థ (ఆర్ టిఎస్) ల స్థాపన ను ప్రోత్సహించడం కోసం అందజేసే ప్రోత్సాహకాలతో ప్రయోజనాలను పొందగలవు.

3. ఈ పథకం కంపోనంట్ ఫార్ పేమెంట్ సెక్యూరిటీ ఫార్ రీన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ (ఆర్ఇఎస్‌సిఒ) ఆధారితమైన నమూనాల తో పాటు రూఫ్ టాప్ సోలర్ సిస్టమ్ (ఆర్ టిఎస్) లో వినూత్నమైన ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన ఒక నిధి ని సైతం అందిస్తుంది.

 

 

ఫలితం మరియు ప్రభావం

 

ఈ పథకం ద్వారా, దీనిలో చేరే కుటుంబాలు విద్యుత్తు బిల్లు ను ఆదా చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్తు ను డిస్కామ్ లకు అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా ను సంపాదించుఃకో గలుగుతాయి. 3 కిలోవాట్ సామర్థ్యం కలిగి ఉండే ఒక వ్యవస్థ ఒక కుటుంబం సగటు న ఒక నెల లో 300 కు మించిన యూనిట్ ల విద్యుత్తు ను ఉత్పత్తి చేయ గలుగుతుంది.

 

ప్రతిపాదిత పథకం ఫలితం గా నివాస భవనాల రంగం లో ఇంటి పైకప్పు మీద అమర్చిన సౌర శక్తి మాధ్యం ద్వారా30 గీగావాట్ సౌర సామర్థ్యం పెరుగుతుంది. దీనితో 1000 బియు ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది; అంతేకాక, ఇంటి పైకప్పు మీద అమర్చిన వ్యవస్థ యొక్క 25 సంవత్సరాల జీవన కాలం లో ఉద్గారాల లో 720 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ కు సమానమైన తగ్గింపు సాధ్య పడుతుంది.

 

 

ఈ పథకం తయారీ, లాజిస్టిక్స్, సప్లయ్ చైన్, విక్రయాలు, స్థాపన, ఒ ఎండ్ ఎమ్ ఇంకా ఇతర సేవల లో సుమారు గా 17 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల కు ఆస్కారాన్ని కల్పిస్తుందన్న అంచనా ఉంది.

 

 

 

పిఎమ్-సూర్య ఘర్: ముఫ్త్ బిజ్‌లీ యోజన యొక్క లాభాల ను అందుకోవడానికి

ప్రభుత్వం ఈ పథకాన్ని ఆరంభించిన తరువాతి నుండి దీనిని గురించిన అవగాహన ను పెంచడం మరియు ఆసక్తి ఉన్న కుటుంబాల నుండి దరఖాస్తుల ను స్వీకరించడం కోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం లో ప్రయోజనాల ను అందుకోవడం కోసం ఆసక్తి కలిగిన కుటుంబాలు https://pmsuryaghar.gov.in/ లో పేరులను నమోదు చేసుకోవచ్చు.

 

 

***

 

 



(Release ID: 2015529) Visitor Counter : 67