రైల్వే మంత్రిత్వ శాఖ
2023-24 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా వ్యాపారం, మొత్తం ఆదాయం,పట్టాలు వేయడంలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసే దిశగా ప్రయాణిస్తున్న భారత రైల్వేలు నేటి వరకు 1500 మిలియన్ టన్నుల సరుకులు రవాణా చేసిన రైల్వే
రూ. 2.40 లక్షల కోట్లకు చేరిన భారతీయ రైల్వే మొత్తం ఆదాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5100 కి.మీ.ల రైలు మార్గం వేసిన భారతీయ రైల్వే
Posted On:
15 MAR 2024 1:03PM by PIB Hyderabad
2023-24 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా వ్యాపారం, మొత్తం రాబడి,పట్టాలు వేయడంలో తన చరిత్రలో నూతన రికార్డు నెలకొల్పడానికి భారతీయ రైల్వే సిద్ధంగా ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ రోజు 2024 మార్చి 15 నాటికి రైల్వే ద్వారా జరిగిన సరుకు రవాణా 1500 ఎంటీ దాటింది. ఇంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే 1512 ఎంటీ సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఈ రికార్డును 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రైల్వే అధిగమించింది.
ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే మొత్తం ఆదాయం 2024 మార్చి 15 నాటికి రూ. 2.40 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది మార్చి 15 నాటికిమొత్తం ఆదాయం రూ. 2.23 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే ఆదాయం 17000 కోట్ల వరకు పెరిగింది. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే మొత్తం వ్యయం రూ. 2.26 లక్షల కోట్ల వరకు ఉంది. .
2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణించిన మొత్తం ప్రయాణీకుల సంఖ్య 648 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే కాలానికి చెందిన గణాంకాలతో పోలిస్తే ప్రయాణీకుల సంఖ్య 52 కోట్ల వరకు పెరిగింది. గత ఏడాది మొత్తం ప్రయాణీకుల సంఖ్య 596 కోట్లు.
2024 మార్చి 15 నాటికి భారతీయ రైల్వే 5100 కిలోమీటర్ల పొడవునా రైల్వే మార్గం నిర్మించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు రోజువారీ పట్ల వేయడం రోజుకు 14 కిలో మీటర్లకు మించి ఉంది.
***
(Release ID: 2015117)
Visitor Counter : 94