రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
పేటీఎం ఫాస్టాగ్ వినియోగదార్లు ఈ నెల 15 లోపు వేరే బ్యాంక్ ఫాస్టాగ్‌కు మారాలని సూచించిన ఎన్‌హెచ్‌ఏఐ
Posted On:
13 MAR 2024 2:16PM by PIB Hyderabad
టోల్ ప్లాజాల వద్ద అసౌకర్యం లేకుండా & జాతీయ రహదార్లపై అవాంతరాలు లేని ప్రయాణం కోసం పేటీఎం ఫాస్టాగ్ వినియోగదార్లకు ఎన్‌హెచ్‌ఏఐ కొన్ని సూచనలు జారీ చేసింది. ఈ నెల 15 లోపు, మరొక బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ కొనుగోలు చేయాలని పేటీఎం ఫాస్టాగ్ వినియోగదార్లకు సూచించింది. దీనివల్ల, జాతీయ రహదార్లపై ప్రయాణించేటప్పుడు జరిమానా లేదా రెట్టింపు రుసుముల వంటి వాటిని తప్పించుకోవచ్చని వెల్లడించింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షల కారణంగా, పేటీఎం ఫాస్టాగ్ వినియోగదార్లు ఈ నెల 15 తర్వాత రీఛార్జ్ లేదా టాప్-అప్ చేయలేరు. అయితే, ఇప్పటికే ఉన్న నిల్వను ఈ నెల 15 తర్వాత కూడా వినియోగించుకోవచ్చు.
పేటీఎం ఫాస్టాగ్‌కు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు ఉన్నా & సాయం అవసరమైనా, వినియోగదార్లు సంబంధిత బ్యాంకులను సంప్రదించవచ్చు. లేదా, ఐహెచ్‌ఎంసీఎల్ వెబ్‌సైట్‌లో ఉన్న 'ఎఫ్‌ఏక్యూ'లను చూడవచ్చు.
***
(Release ID: 2014431)
Visitor Counter : 137