సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు రెండేళ్లలో రూ.40,000 కోట్లకు పెరుగుతాయి: కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 13 MAR 2024 7:30PM by PIB Hyderabad

దేశ రక్షణ సామర్థ్యాలను సొంతంగా పెంచుకోవడంలో భారత ప్రభుత్వం దృఢంగా ముందుకు వెళ్తోందని కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రస్తుతం, భారతదేశం రూ.1 లక్ష కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను రూపొందిస్తోందని, రూ.16,000 కోట్ల రక్షణ రంగ ఎగుమతులు చేస్తోందని అన్నారు. వచ్చే రెండేళ్లలో ఈ ఎగుమతుల విలువ రూ.40,000 కోట్లకు పెరుగుతుందని తెలిపారు.

ఏ దేశానికైనా యుద్ధం ఒక వినాశన కారణమన్న కేంద్ర మంత్రి, నాలుగు సార్లు యుద్ధం చేయాల్సి వచ్చిన భారత్ కంటే ఏ దేశానికీ ఇది బాగా తెలియదని అన్నారు. ఈ రోజు న్యూదిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇది యుద్ధాల యుగం కాదు, చర్చలు & సంప్రదింపుల సమయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన మాటలను శ్రీ ఠాకూర్ గుర్తు చేశారు.

ఇజ్రాయెల్ చాలా క్లిష్ట పరిస్థితుల నుంచి ఎదిగిందని, పునరుద్ధరణకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని, ఆవిష్కరణల్లో అగ్రగామిగా మారిందని మంత్రి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారీ స్థాయి విధ్వంసం భయాల నుంచి కోలుకున్న ఇజ్రాయెల్, ఈ రోజు ఒక స్వయంసమృద్ధ దేశంగా మారిందని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.

***



(Release ID: 2014428) Visitor Counter : 89