ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై నేతల చర్చ;
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీద చర్చల పురోగతిపై అధినేతల హర్షం;
పరస్పర ప్రయోజన సంబంధిత ప్రాంతీయ.. అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయ మార్పిడి
Posted On:
12 MAR 2024 8:43PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముచిత మాననీయ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని రిషి సునక్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై తమ కట్టుబాటు వారిద్దరూ పునరుద్ఘాటించారు. అలాగే మార్గ ప్రణాళిక-2030 కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, వర్ధమాన సాంకేతికతలు వంటి భిన్న రంగాల్లో సాధించిన పురోగతిపై వారు సంతృప్తి వెలిబుచ్చారు. అలాగే ఉమ్మడి ప్రయోజనాలుగల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారుపై చర్చలు వీలైనంత ముందుగా ముగించడంపై పురోగతిని వారు స్వాగతించారు. దీంతోపాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై దేశాధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వివిధ అంశాలపై నిరంతరం మమేకం కావాలని వారు నిర్ణయించుకున్నారు. భారతదేశంలో హోలీ పండుగ నేపథ్యంలో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
(Release ID: 2014304)
Visitor Counter : 79
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam