రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
షోపియాన్ బైపాస్ నిర్మాణానికి రూ.224.44 కోట్లు మంజూరు: కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
- జమ్మూ & కాశ్మీర్‌లోని జాతీయ రహదారి- 444పై నిర్మాణం
प्रविष्टि तिथि:
12 MAR 2024 12:43PM by PIB Hyderabad
జమ్మూ & కాశ్మీర్లో రూ. నేషనల్ హైవే-444లో షోపియాన్ బైపాస్ నిర్మాణానికి 224.44 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీనిని పేవ్డ్ షోల్డర్తో 2-లేన్ కాన్ఫిగరేషన్తో దీనిని నిర్మించానున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఒక పోస్ట్లో తెలియజేశారు. షోపియాన్ జిల్లాలో 8.925 కి.మీ విస్తరించి ఉన్న ఈ అభివృద్ధి పని ఈపీఎస్ విధానాన్ని ఉపయోగించి అమలు చేయబడుతుంది. జమ్మూ & కాశ్మీర్లోని యూటీ పరిధిలో షోపియాన్ జిల్లాను ఒకవైపు.. పుల్వామాతోను మరోవైపు కుల్గామ్తోను అనుసంధానం చేస్తూ నిర్మిస్తారు. దీంతోఈ ప్రాజెక్టుకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందని ఆయన అన్నారు. ఇది దక్షిణ కాశ్మీర్లో, ప్రత్యేకించి "యాపిల్ బౌల్ ఆఫ్ ది వ్యాలీ"గా పిలువబడే షోపియాన్ జిల్లాలో ఆపిల్ పెంపకందారులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. మార్కెట్లకు ఉత్పత్తులను వేగంగా రవాణా చేయడం ద్వారా. మెరుగైన అనుసంధానత మరియు రహదారి భద్రతా చర్యలను పెంచడం వంటి మొత్తం ప్రభావం ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2013972)
आगंतुक पटल : 82