ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీమతి సుధ మూర్తి ని రాజ్య సభ కు నామినేట్ చేయడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 MAR 2024 2:13PM by PIB Hyderabad

శ్రీమతి సుధ మూర్తి గారు రాజ్య సభ కు నామినేట్ అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘భారతదేశం యొక్క రాష్ట్రపతి రాజ్యసభ కు శ్రీమతి @SmtSudhaMurty గారి ని నామినేట్ చేసినందుకు నేను సంతోషపడుతున్నాను. సామాజిక కార్యాలు, దాతృత్వం మరియు విద్య వంటి విభిన్నమైన రంగాల లో శ్రీమతి సుధ గారు అందించిన తోడ్పాటు లు విస్తృతమైనవి, ప్రేరణాత్మకమైనవీనూ. రాజ్య సభ లో సభ్యురాలు కావడం అనేది మన ‘నారీ శక్తి’ కి ఒక శక్తివంతమైన నిదర్శన అని చెప్పాలి. మన దేశ భవిష్యత్తు ను తీర్చిదిద్దడం లో మహిళల శక్తి కి మరియు మహిళల సామర్థ్యానికి ఇది ఒక దృష్టాంతం గా ఉంటుంది. ఆమె పార్లమెంటరీ పదవీ కాలం ఫలప్రదం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS


(रिलीज़ आईडी: 2012730) आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam