ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల దినం సందర్భం లో ఎల్‌పిజి సిలిండర్ ధరల లో 100 రూపాయల మేరకు తగ్గింపు ను ప్రకటించిన ప్రధాన మంత్రి
Posted On:
08 MAR 2024 8:52AM by PIB Hyderabad
మహిళల దినం సందర్భం లో ఎల్‌పిజి సిలిండర్ ధరల ను 100 రూపాయల మేరకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది దేశవ్యాప్తం గా లక్షల కొద్దీ కుటుంబాల కు ఆర్థిక భారాన్ని చాలా వరకు గా తగ్గిస్తుందని, మరియు దీనితో విశేషించి మన నారీ శక్తి కి లాభం కలుగుతుందని కూడా ఆయన అన్నారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘మహిళల దినం సందర్భం లో ఈ రోజు న మేం ఎల్‌పిజి సిలిండర్ యొక్క ధరల లో 100 రూపాయల రాయితీ ని ఇవ్వాలి అనేటటువంటి ఒక ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. దీనితో నారీ శక్తి యొక్క జీవనం సులభ తరం కావడం తో పాటు కోట్ల కొద్దీ కుటుంబాల కు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ఈ చర్య పర్యావరణ సంరక్షణ లో సైతం సహాయకారి అవుతుంది; దీని ద్వారా పూర్తి కుటుంబం యొక్క ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.’’
‘‘ఈ రోజు న, మహిళల దినం సందర్భం లో, మా ప్రభుత్వం ఎల్‌పిజి సిలిండర్ యొక్క ధరల లో 100 రూపాయల మేరకు రాయితీని ఇవ్వాలి అనే నిర్ణయాన్ని తీసుకొంది. దీనితో దేశమంతటా లక్షల కొద్దీ కుటుంబాల కు ఆర్థిక భారం చాలావరకు తగ్గిపోగలదు విశేషించి మన నారీ శక్తి కి లాభం కలుగుతుంది.
వంట గ్యాసు ను మరింత అధిక మితవ్యయం తో కూడిందిగా మలచడం ద్వారా కుటుంబాల కు మేలు చేయడం తోపాటు ఒక ఆరోగ్యవంతమైన వాతావరణాని కి పూచీ పడాలనేదే మా లక్ష్యం గా ఉంది. ఇది మహిళల కు సాధికారిత ను కల్పించడం , ఇంకా వారి కి ‘జీవన సౌలభ్యాని’ కి పూచీపడాలన్న మా వచనబద్ధత కు అనుగుణం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2012655)
Visitor Counter : 153
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam