సహకార మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో శుక్రవారం నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్‌తో పాటు 'నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ 2023:రిపోర్ట్'ను విడుదల చేయనున్న కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన "సహకార్ సే సమృద్ధి" దార్శనికతను నెరవేర్చడానికి సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది మరో ముఖ్యమైన కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వాలు,జాతీయ సమాఖ్యలు మరియు వాటాదారులతో కలిసి సహకార-కేంద్రీకృత ఆర్థిక నమూనాను ప్రోత్సహించడానికి జాతీయ సహకార డేటాబేస్ అభివృద్ధి చేయబడింది
నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ కేంద్ర మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రియు కోఆపరేటివ్ సొసైటీల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం కీలకమైన సాధనంగా పనిచేస్తుంది.సహకార రంగంలోని వాటాదారులందరికీ ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.
నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ (ఎన్‌సిడి) ప్రారంభ సహకార రంగంలో ఒక మైలురాయి అవుతుంది
Posted On:
07 MAR 2024 2:12PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్చి 8, 2024న శుక్రవారం న్యూఢిల్లీలో జాతీయ సహకార డేటాబేస్‌ను ప్రారంభించనున్నారు. అలాగే 'నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ 2023: ఎ రిపోర్ట్'ని కూడా సహకార మంత్రి విడుదల చేస్తారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన "సహకార్ సే సమృద్ధి" నెరవేర్చడానికి ఇది సహకార మంత్రిత్వ శాఖ యొక్క మరొక ముఖ్యమైన కార్యక్రమం.ఈ కార్యక్రమం కింద భారతదేశ విస్తారమైన సహకార రంగం గురించి ముఖ్యమైన సమాచారాన్ని సంగ్రహించడానికి ఒక బలమైన డేటాబేస్ అత్యవసర అవసరాన్ని సహకార మంత్రిత్వ శాఖ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ సమాఖ్యలు మరియు వాటాదారులతో కలిసి సహకార-కేంద్రీకృత ఆర్థిక నమూనాను ప్రోత్సహించడానికి జాతీయ సహకార డేటాబేస్ అభివృద్ధి చేయబడింది.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యదర్శులు మరియు ఇతర సీనియర్ అధికారులు, రాష్ట్రాలు/యూటీలు, ఆర్‌సిఎస్, సహకార సంఘాలు మరియు సహకార సమాఖ్యలు/సంఘాల నుండి సహకార ప్రధాన కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు సహా దాదాపు 1400 మంది పాల్గొంటారు. నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ (ఎన్‌సిడి) ఉపయోగం మరియు అప్లికేషన్ మరియు భారతదేశంలో సహకార ల్యాండ్‌స్కేప్‌ను మెరుగుపరిచే దాని సామర్థ్యాన్ని గురించి పాల్గొనేవారికి సంక్షిప్తీకరించడానికి మరియు అవగాహన కల్పించడానికి ముందస్తు సెషన్‌లో సాంకేతిక వర్క్‌షాప్ నిర్వహించబడుతుంది.
వివిధ వాటాదారుల నుండి దశలవారీగా జాతీయ సహకార డేటాబేస్‌లో సహకార సంస్థల డేటా సేకరించబడింది. మొదటి దశలో మూడు రంగాలకు చెందిన దాదాపు 2.64 లక్షల ప్రాథమిక సహకార సంఘాలు అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఏసిఎస్), డెయిరీ మరియు మత్స్య పరిశ్రమల మ్యాపింగ్ పూర్తయింది. రెండవ దశలో వివిధ జాతీయ సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్యలు, రాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్‌టిసిబి), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డిసిసిబిలు), అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు (యుసిబిలు) రాష్ట్ర సహకార వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (ఎస్‌సిఏఆర్‌డిబి), ప్రాథమిక సహకార వ్యవసాయం డేటా మరియు రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (పిసిఏఆర్‌డిబి), సహకార చక్కెర మిల్లులు, జిల్లా యూనియన్‌లు మరియు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు (ఎంఎస్‌సిఎస్) సేకరించబడ్డాయి/మ్యాప్ చేయబడ్డాయి. మూడవ దశలో 5.3 లక్షల కంటే ఎక్కువ ప్రాథమిక సహకార సంఘాల డేటా మిగిలిన అన్ని రంగాల నుండి రాష్ట్రం/యూటీల ఆర్‌సిఎస్/డిఆర్‌సిఎస్ కార్యాలయాల ద్వారా మ్యాప్ చేయబడింది.
నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ అనేది వెబ్ ఆధారిత డిజిటల్ డాష్‌బోర్డ్. ఇందులో జాతీయ/రాష్ట్ర సమాఖ్యలతో సహా సహకార సంఘాల డేటా సంగ్రహించబడింది. సహకార సంఘాల డేటా ఆర్‌సిఎస్/డిఆర్‌సిఎస్ కార్యాలయాలలో రాష్ట్రాలు/యూటీల నోడల్ అధికారులచే నమోదు చేయబడింది మరియు ధృవీకరించబడింది మరియు వివిధ జాతీయ/రాష్ట్ర సమాఖ్యల ద్వారా సమాఖ్యల డేటా అందించబడింది. జాతీయ డేటాబేస్ దేశంలోని వివిధ రంగాలలో విస్తరించి ఉన్న 29 కోట్ల కంటే ఎక్కువ సామూహిక సభ్యత్వంతో సుమారు 8 లక్షల సహకార సంఘాల సమాచారాన్ని సేకరించింది/మ్యాప్ చేసింది. సహకార సంఘాల నుండి సేకరించిన సమాచారం వారి నమోదిత పేరు, తేదీ, స్థానం, సభ్యుల సంఖ్య, సెక్టోరల్ సమాచారం, కార్యకలాపాల ప్రాంతం, ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక నివేదికలు, ఆడిట్ స్థితి మొదలైన వివిధ అంశాలు ఉంటాయి.
నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ కేంద్ర మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు/యుటిలు మరియు సహకార సంఘాల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం కీలకమైన సాధనంగా పనిచేస్తుంది. ఇది సహకార రంగంలోని వాటాదారులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. డేటాబేస్ రిజిస్టర్డ్ సొసైటీల కోసం సమగ్ర సంప్రదింపు వివరాలను అందిస్తుంది. ప్రభుత్వ సంస్థలు మరియు ఈ సొసైటీల మధ్య సున్నితమైన కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తుంది.
నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ సింగిల్ పాయింట్ యాక్సెస్, సమగ్రమైన మరియు అప్‌డేట్ చేయబడిన డేటా, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, వర్టికల్ మరియు హారిజాంటల్ లింకేజీలు, ప్రశ్న-ఆధారిత నివేదికలు మరియు గ్రాఫ్‌లు, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)నివేదికలు, డేటా అనలిటిక్స్ మరియు జియోగ్రాఫికల్ మ్యాపింగ్ వంటి సహకార రంగం యొక్క సమర్థత మరియు ప్రభావానికి దోహదపడే అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఈ కార్యక్రమ విజయం ప్రభావవంతమైన సహకారం, ఖచ్చితమైన డేటా సేకరణ మరియు సెక్టోరల్ అంతరాలను గుర్తించడానికి డేటాబేస్ యొక్క వ్యూహాత్మక వినియోగంపై ఆధారపడి ఉంటుంది.మొత్తంమీద డేటాబేస్ సహకార రంగంలో పారదర్శకత మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
జాతీయ సహకార డేటా ప్రారంభం సహకార రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో సహకార సంఘాల పెరుగుదల ఆర్థిక, సామాజిక మరియు సమాజ సవాళ్లను పరిష్కరించడం, వ్యక్తులను శక్తివంతం చేయడం, పేదరికాన్ని నిర్మూలించడం మరియు గ్రామీణ సమాజాల మొత్తం శ్రేయస్సుకు దోహదం చేయడం వంటి వాగ్దానాలను కలిగి ఉంది. ఈ చొరవ అట్టడుగు స్థాయిలో సానుకూల పరివర్తనను సూచిస్తుంది. సంపన్నమైన మరియు 'ఆత్మనిర్భర్ భారత్' యొక్క దృక్పథంతో సమలేఖనం చేయబడింది.
***
(Release ID: 2012251)
Visitor Counter : 171