వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 27% పెరిగిన నమోదు


చెల్లించిన ప్రతి రూ. 100 ప్రీమియమ్‌కు దాదాపు రూ. 500 క్లెయిమ్ గా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పొందిన రైతులు

అమలులోకి వచ్చిన గత 8 సంవత్సరాల కాలంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద క్లెయిమ్ లు పొందిన 23.22 కోట్లకు పైగా రైతులు

Posted On: 06 MAR 2024 10:56AM by PIB Hyderabad

 అమల్లోకి వచ్చిన గత 8 సంవత్సరాల కాలంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) కింద   56.80 కోట్ల రైతులు నమోదు అయ్యారు. నమోదైన మొత్తం రైతులలో   23.22 కోట్ల మంది రైతుల క్లెయిమ్‌లు పరిష్కారం అయ్యాయి.  ఈ కాలంలో రైతులు తమ ప్రీమియం వాటాగా సుమారు రూ.31,139 కోట్లు చెల్లించారు. రైతులు చెల్లించిన ప్రీమియం  ఆధారంగా 1,55,977 కోట్ల రూపాయలకు  పైగా వారికి క్లెయిమ్‌లుగా అందాయి. చెల్లించిన  ప్రతి రూ.100 ప్రీమియానికి దాదాపు రూ.500 క్లెయిమ్‌లుగా రైతులు పొందారు. 

  డిమాండ్ ఆధారిత పథకంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) అమలు జరుగుతోంది. పథకంలో రాష్ట్రాలు లేదా రైతులు  స్వచ్ఛందంగా చేరవచ్చు. పిఎంఎఫ్‌బివై లో చేరిన రైతుల సంఖ్య 2021-22 లో 33.4%,  2022-23 లో  రైతుల  41 శాతం పెరిగింది.  2023-24 సంవత్సరంలో ఇంతవరకు  పథకం కింద నమోదు చేసుకున్న రైతుల సంఖ్య  27% పెరిగింది. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో పథకం కింద బీమా చేయబడిన మొత్తం రైతులలో 42% మంది రైతులు ఎటువంటి  రుణం తీసుకోలేదు. .

 2016లో ప్రారంభమైన పిఎంఎఫ్‌బివై ప్రీమియం పరంగా ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఊహించని సంఘటనల వలన పంట నష్టం లేదా ఇతర నష్టాల నుంచి  పథకం కింద రైతులు రక్షణ పొందుతారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సీజన్లు/సంవత్సరాలు/ప్రాంతంలో నష్టపోయిన  రైతులకు పరిహారం అందించి వారి  ఆదాయాన్ని స్థిరీకరించేందుకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించిన పిఎంఎఫ్‌బివై లక్ష్యాల మేరకు అమలు జరుగుతోంది. కేంద్ర ప్రాయోజిత పథకంగా పిఎంఎఫ్‌బివై అమలు జరుగుతోంది. దీనివల్ల రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా కేటాయింపులు లేదా నిధుల విడుదల జరగలేదు. 

పథకం నిర్వహణ, అమలులో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి వాటాదారులతో సంప్రదింపులు జరుపుతూ క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు  జరుగుతున్నాయి.. సమీక్ష అనంతరం అమలు చేసిన  ప్రధాన సంస్కరణలలో భాగంగా పథకంలో చేరే అంశంలో   రైతులందరికీ స్వేచ్ఛ కల్పించారు. బీమా కంపెనీలు వసూలు చేసే  స్థూల ప్రీమియంలో కనీసం 0.5 శాతం తప్పనిసరిగా  ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (IEC) కార్యకలాపాల కోసం  ఉపయోగించాల్సి ఉంటుంది. సాంకేతిక వినియోగం, ఈశాన్య ప్రాంతంలో కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక నిష్పత్తిని ని 50:50 నుండి 90:10 కి మార్చడం ; బీమా కంపెనీలతో దీర్ఘకాలిక అంటే 3 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకోవడం, అవసరాలకు అనుగుణంగా రిస్క్ కవర్‌ని ఎంచుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించడం, సాంకేతికత వినియోగం తదితర అంశాల్లో సంస్కరణ ద్వారా మార్పు తీసుకు వచ్చారు. 

పిఎంఎఫ్‌బివై అమలును  వ్యవసాయం,కుటుంబ సంక్షేమ శాఖ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. దీనిలో భాగంగా  వాటాదారులతో  వారానికోసారి వీడియో కాన్ఫరెన్స్‌లు, బీమా కంపెనీలు/రాష్ట్రాలతో పరస్పర సమావేశాలు నిర్వహిస్తున్నారు.  క్లెయిమ్‌లను సకాలంలో పరిష్కరించడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి. అవసరమైన సమాచారం సకాలంలో, వేగంగా అందేలా చూసేందుకు వివిధ కొత్త సాంకేతికతలు అమలు జరుగుతున్నాయి. .

పరిధి విస్తరణ కోసం చర్యలు: 

ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల ఏడాదికేడాది పథకంలో చేరుతున్న రైతుల సంఖ్య పెరుగుతోంది.   బ్యాంకుల్లో రుణాలు తీసుకోకుండా రైతులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. పథకం అమలు, పరిధిని  మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది దీనిలో భాగంగా  (ఎ) బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మూడు సంవత్సరాల పాటు ఒప్పందం అమలులో ఉండే విధంగా బీమా కంపెనీని ఎంపిక చేయడం  (బి) మూడు ప్రత్యామ్నాయ ప్రమాద నమూనాలు--లాభ నష్టాల భాగస్వామ్యం, కప్-అండ్-క్యాప్ (60-130), కప్-అండ్-క్యాప్ (80-110) విధానం అమలు. దీనికింద ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం లో రాష్ట్ర ఖజానాలో జమ అవుతుంది. (సి) నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (NCIP), టెక్నాలజీ ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ (YES-TECH), వాతావరణ సమాచార నెట్‌వర్క్ మరియు డేటా సిస్టమ్ (WINDS), నిజ సమయ పరిశీలన, పంటల చిత్రాల సేకరణ (CROPIC) ఇంటిగ్రేషన్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతుల ఖాతాకు నేరుగా బదిలీచేయడం,  క్లెయిమ్‌ల పరిష్కారం కోసం NCIPపై రాష్ట్ర భూ రికార్డులు, NCIP లో  DigiClaim మాడ్యూల్ అమలు చేయడం  (డి) ఐఈసి  కార్యకలాపాలు ఎక్కువ చేయడం లాంటి చర్యలు అమలు జరుగుతున్నాయి. 

పథకం అమలు ద్వారా సాధించిన అనుభవం,  వివిధ వాటాదారుల నుంచి సేకరించిన  అభిప్రాయాల ఆధారంగా  మెరుగైన పారదర్శకత, జవాబుదారీతనం, రైతులకు క్లెయిమ్‌లను సకాలంలో చెల్లించడం, పథకాన్ని మరింత రైతు స్నేహపూర్వకంగా అమలు చేయడానికి ప్రభుత్వం  పిఎంఎఫ్‌బివై కార్యాచరణ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తోంది. పథకం కింద ప్రయోజనాలు సకాలంలో, పారదర్శకంగా అర్హులైన రైతులకు చేరేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది. 

****



(Release ID: 2011973) Visitor Counter : 140