ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర & రాష్ట్ర జీఎస్‌టీ విభాగాధిపతుల ఒక రోజు జాతీయ సదస్సును రేపు న్యూదిల్లీలో ప్రారంభించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

Posted On: 03 MAR 2024 2:48PM by PIB Hyderabad

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు యంత్రాంగాన్ని బలోపేతం చేసే ఉత్తమ మార్గాల అన్వేషణలో, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం కేంద్ర & రాష్ట్ర జీఎస్‌టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధిపతుల జాతీయ సదస్సును నిర్వహిస్తోంది.


కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్, సోమవారం, న్యూదిల్లీలో ఒకరోజు సదస్సును ప్రారంభించి, కీలక ప్రసంగం చేస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి కూడా ఈ సదస్సుకు హాజరవుతారు.

సదస్సులో సమగ్రంగా చర్చించే అంశాలు:

  • జీఎస్‌టీ ఎగవేతకు అడ్డుకట్ట: ప్రస్తుత సవాళ్లను పరిశీలించడం, కేంద్రం & రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పద్ధతులను సమీక్షించడం.
  • నకిలీ ఇన్వాయిస్‌లను ఎదుర్కోవడం: జీఎస్‌టీ ఎగవేతలను పరిష్కరించడం, ఈ సవాళ్లను పరస్పర సహకారంతో ఎదుర్కోవడానికి సమర్థవంతమైన పద్ధతులను రచించడం.
  • ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం: రాష్ట్ర & కేంద్ర అమలు అధికారులు ఇచ్చే ప్రదర్శనల ద్వారా ఉత్తమ అభ్యాసాలను ప్రోత్సహించడం. పన్ను ఎగవేతలను ఎదుర్కోవడానికి అత్యంత విజయవంతమైన వ్యూహాలు, వినూత్న విధానాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.
  • భాగస్వామ్యాలను పెంచడం: రాష్ట్ర & కేంద్ర అధికార్ల మధ్య చక్కటి సహకారాన్ని పెంచడం. దీనివల్ల ఏకీకృత, సమగ్ర విధానం ఏర్పడుతుంది.
  • సాంకేతికత & సమాచారాన్ని వృద్ధి చేయడం: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల ప్రయత్నాల్లో ఖచ్చితత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి అధునిక సాంకేతికత సాధనాలు, సమాచార విశ్లేషణల సామర్థ్యాన్ని పెంచడంపై చర్చిస్తారు.
  • సులభతర వాణిజ్యాన్ని సమతౌల్యం చేయడం: వ్యాపార వాతావరణాన్ని సరళంగా మార్చడం & సమర్థవంతమైన, నిరోధక చర్యల ద్వారా కీలక సమతౌల్యాన్ని సాధించడం.

సమాఖ్య స్ఫూర్తితో ఉత్తమ విధానాలను పంచుకోవడానికి, పరస్పర అభ్యాసాలను పెంచుకోవడానికి, జీఎస్‌టీ అమలును సమష్టిగా బలోపేతం చేయడానికి కేంద్రం & రాష్ట్ర జీఎస్‌టీ అధికార్లకు ఈ సదస్సు ఒక విలువైన వేదికగా నిలుస్తుంది.

***



(Release ID: 2011447) Visitor Counter : 77