హోం మంత్రిత్వ శాఖ
మాదక ద్రవ్యాల మహమ్మారి ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వ విజయానికి సంబంధించి మూడు వీడియోలను విడుదల చేసిన కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాల గుర్తింపు, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ల ధ్వంసం, డ్రగ్స్‌కు బానిసలైన వారికి పునరావాసం కల్పిస్తూ, నిందితుల నిర్బంధం - శ్రీ అమిత్‌షా
మాదక ద్రవ్యాల వ్యాపారం పట్ల మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం సమర్ధవంతమైన ఫలితాలను ఇవ్వడమే కాదు, ఈ విధానం ఫలితంగా స్వాధీనాలు, అరెస్టుల సంఖ్య చురుకుగా పెరిగింది
2006-2013 మధ్య కాలంలో 1257గా ఉన్న నమోదైన కేసుల సంఖ్య, 2014-2023 కాలంలో మూడు రెట్లు పెరిగి 3755కు చేరింది
అరెస్టుల సంఖ్య 2006-13మధ్య ఉన్న 1363కు నాలుగు రెట్లు పెరిగి, 2014-23 కాలంలో 5745కు చేరింది
2006-13లో పట్టుబడిన 1.52 లక్షల కిలోల నుంచి మోడీ హయాంలో పట్టుబడిన డ్రగ్స్ పరిమాణం 3.95 లక్షల కిలోలకు రెట్టింపు అయింది.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ 2006-13 కాలంలో సాధించిన రూ. 768 కోట్ల నుంచి మోడీ ప్రభుత్వ హయాంలో 30 రెట్లు పెరిగి రూ. 22,000 కోట్లకు చేరుకుంది
మోడీ ప్రభుత్వకాలంలో రూ. 12,000 కోట్ల విలువైన 12 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను కూడా యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీలు ధ్వంసం చేశాయి
Posted On:
03 MAR 2024 5:49PM by PIB Hyderabad
మాదకద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయానికి సంబంధించిన మూడు వీడియోలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి & సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఎక్స్‌పై ( ఒకప్పుడు ట్విట్టర్)లో వరుస పోస్ట్‌లను, వీడియోలను విడుదల చేశారు.
మాదకద్రవ్యాల వ్యాపారం పట్ల మోడీ ప్రభుత్వ కఠిన విధానం సమర్ధవంతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ విధాన ఫలితంగా, అరెస్టులు, నిర్బంధంలోకి తీసుకున్న వారి సంఖ్య చురుకుగా పెరగడం, అని ఒక పోస్ట్‌లో శ్రీ షా పేర్కొన్నారు.
మరొక పోస్ట్‌లో, మోదీజీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వాలు, ఏజెన్సీల మధ్య సమన్వయం, సహకారం, తోడ్పాటు ద్వారా దేశవ్యాప్తంగా ప్రబలమైన మాదక ద్రవ్యాల వ్యతిరేక సాధనం నిర్మితమైంది. ఈ వ్యూహం ఫలితంగా మాదక ద్రవ్యాల స్వాధీనం, తత్సంబంధిత కేసులు నమోదయ్యాయని, శ్రీ షా అన్నారు.
మన భవిష్యత్ తరాలకు # మాదకద్రవ్యాలరహిత/ ముక్త భారత్ గొప్ప కానుక. మాదక ద్రవ్యాలను గుర్తించడం, మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌లను నాశనం చేయడం, వాటికి బానిసలైన వారికి పునరావాసం కల్పిస్తూ, నేరస్థులను నిర్బంధించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రధానమంత్రి మోడీజీ నాయకత్వంలో మన దేశం వడివడిగా అడుగులు వేస్తోందని శ్రీ షా అన్నారు.
అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడానికి మోడీ ప్రభుత్వం చేసిన బహుముఖ ప్రయత్నాల కారణంగా స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల పరిమాణం దాదాపు 100%పెరగడమే కాకుండా, వాటితో వ్యాపారం చేస్తున్న వారిపై నమోదైన కేసులు 152% పెరిగాయి.
మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, 2006-2013 మధ్య కాలంలో నమోదైన కేసుల సంఖ్య 1257గా ఉండగా, ఈ సంఖ్య 2014-2023 మధ్య కాలంలో 3 రెట్లు పెరిగి 3755కు పెరిగింది. అరెస్టులు 2006-13 మధ్యలో ఉన్న 1363కు నాలుగు రెట్లు పెరిగి 2014-23లో 5745కు చేరుకుంది. మోడీ పాలనాకాలంలో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల పరిమాణం రెట్టింపై 3.95 లక్షల కేజీలకు చేరింది, ఈ పరిమాణం 2006-13 మధ్య కాలంలో 1.52 లక్షల కిలోలుగా ఉంది. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ మోడీ ప్రభుత్వ కాలంలో 30రెట్లు పెరిగి రూ.22,000 కోట్లు కాగా, 2006-13లో అది రూ. 768 కోట్లుగా ఉంది.
మోడీ ప్రభుత్వ కాలంలో యాంటీ- నార్కోటిక్స్ ఏజెన్సీలు రూ. 12,000 కోట్ల విలువైన 12 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసింది. జూన్ 2023 వరు ఎన్‌సిబి, ఇటువంటి 23 కేసులకు సంబంధించి ఆర్ధికపరమైన దర్యాప్తు జరిపి, రూ. 74,75,00,531 విలువైన ఆస్తులను జప్తు చేసింది.
మాదక ద్రవ్యాల రహిత భారత్ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతను నెరవేర్చేందుకు నాలుగు (04) అంచెల ఎన్‌సిఒఆర్‌డి యంత్రాంగాన్ని 2019లో కేంద్ర, రాష్ట్ర ఔషధ చట్ట అమలు సంస్థల మధ్య మెరుగైన సమన్వయం, తోడ్పాటు కోసం బలోపేతం చేయడం జరిగింది.
మాదక ద్రవ్యాల ముక్త భారత్ సంకల్పాన్ని సాకారం చేస్తున్న మోడీ ప్రభుత్వం.
(Release ID: 2011446)
Visitor Counter : 100