రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
హిందుస్థాన్ ఉర్వరక్ & రసాయాన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్‌ఎల్) సింద్రీ ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి
5 ప్లాంట్లు పునరుజ్జీవింపబడ్డాయి. వీటివల్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఈ క్లిష్టమైన రంగంలో ఈ చర్యలు భారతదేశాన్ని ఆత్మనిర్భర్త వైపు వేగంగా తీసుకువెళ్తాయి: శ్రీ నరేంద్ర మోదీ
గత 10 ఏళ్లలో యూరియా ఉత్పత్తి 310 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది: ప్రధాన మంత్రి
హిందుస్థాన్ ఉర్వరక్ & రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్‌ఎల్) సింద్రీ ఎరువుల కర్మాగారం రూ. 8900 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయబడింది.
Posted On:
01 MAR 2024 3:04PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జార్ఖండ్‌లోని ధన్‌బాద్ సింద్రీలో గల హిందుస్థాన్ ఉర్వరక్ & రసాయాన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్‌ఎల్) సింద్రీ ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. 2018లో ఈ ఎరువుల కర్మాగారానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో నేటి చొరవ ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. ప్రతి సంవత్సరం భారతదేశానికి 360 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, 2014లో భారతదేశం కేవలం 225 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఉత్పత్తి చేసేదని చెప్పారు. దీంతో భారీగా దిగుమతులు అవసరమయ్యేవని తెలిపారు. తమ ప్రభుత్వ కృషి వల్ల గత 10 ఏళ్లలో యూరియా ఉత్పత్తి 310 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆయన చెప్పారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో స్థానిక యువత ఉపాధికి కొత్త దారులు వచ్చాయన్నారు. రామగుండం, గోరఖ్‌పూర్ మరియు బరౌని ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ గురించి కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు. ఈ జాబితాలోకి సింద్రీ చేరిందన్నారు. తాల్చెర్ ఫర్టిలైజర్ ప్లాంట్ కూడా వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ ఐదు ప్లాంట్లు 60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తాయని, ఈ క్లిష్టమైన రంగంలో భారత్‌ను ఆత్మనిర్భర్త వైపు వేగంగా తీసుకువెళుతుందని ఆయన అన్నారు.
హిందుస్థాన్ ఉర్వరాక్ & రసాయాన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్‌ఎల్) అనేది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టిపిసి), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) మరియు ఎఫ్‌సిఐఎల్/హెచ్‌ఎఫ్‌సిఎల్ అనే ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌యులు) జాయింట్ వెంచర్ కంపెనీ. ఇది 15 జూన్ 2016న స్థాపించబడింది. సంవత్సరానికి 12.7 ఎల్‌ఎంటి స్థాపిత సామర్థ్యంతో కొత్త అమ్మోనియా యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సింద్రీ ఎరువుల యూనిట్‌ను పునరుద్ధరించింది. సింద్రీ ప్లాంట్ యూరియా ఉత్పత్తిని నవంబర్ 05, 2022న ప్రారంభించింది.
సింద్రీలో 2200 టిపిడి అమ్మోనియా మరియు 3850 టిపిడి వేప పూతతో కూడిన యూరియా సామర్థ్యం కలిగిన కొత్త అమ్మోనియా-యూరియా ప్లాంట్‌లను ఏర్పాటు చేసే బాధ్యతను హెచ్‌యుఆర్‌ఎల్‌కి అప్పగించారు. 8939.25 కోట్ల పెట్టుబడిలో ఎన్‌టిపిసి,ఐఓసిఎల్ మరియు సిఐఎల్‌కు ఈక్వీటి భాగస్వామ్యం కాగా..ఎఫ్‌సిఐఎల్‌కు 11% ఉంది.
ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సిఐఎల్) మరియు హిందుస్థాన్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎఫ్‌సిఎల్)కు సంబంధించిన మూతపడిన యూరియా యూనిట్లను స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో అత్యాధునిక గ్యాస్ ఆధారిత సింద్రీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ఒక భాగం. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన యూరియా లభ్యతను పెంపొందించడానికి ఎఫ్‌సిఐఎల్ మరియు హెచ్‌ఎఫ్‌సిఎల్ యొక్క క్లోజ్డ్ యూనిట్ల పునరుద్ధరణ ప్రభుత్వ ప్రధాన అజెండాగా ఉంది. సింద్రీ ప్లాంట్ దేశంలో సంవత్సరానికి 12.7 ఎల్‌ఎంటి దేశీయ యూరియా ఉత్పత్తిని అందిస్తుంది. తద్వారా యూరియా రంగంలో భారతదేశాన్ని “ఆత్మ నిర్భర్”గా మార్చాలనే ప్రధాన మంత్రి కలను సాకారం చేయడానికి సహాయపడుతుంది.
జార్ఖండ్ రాష్ట్రంతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు బీహార్‌లోని రైతులకు తగినంత యూరియా సరఫరా చేయడం ఈ ప్లాంట్ లక్ష్యం. ఈ ప్లాంట్ ఎరువుల లభ్యతను మెరుగుపరచడమే కాకుండా రోడ్లు, రైల్వేలు, అనుబంధ పరిశ్రమల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా ఈ ప్రాంతంలో మొత్తం ఆర్థికాభివృద్ధిని కూడా పెంచుతుంది. ఈ ప్లాంట్ ఈ ప్రాంతంలో 450 ప్రత్యక్ష మరియు 1000 పరోక్ష ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఇది కాకుండా ఫ్యాక్టరీకి వివిధ వస్తువుల సరఫరా కోసం ఎంఎస్‌ఎంఈ విక్రేతల అభివృద్ధి నుండి ఈ ప్రాంతం ప్రయోజనం పొందుతుంది.
భారతదేశం “ఆత్మనిర్భర్ భారత్” కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి సన్నద్ధమవుతున్నందున నేడు హెచ్‌యుఆర్‌ఎల్ యొక్క 'భారత్ యూరియా'..దిగుమతులను తగ్గించడమే కాకుండా స్థానిక రైతులకు ఎరువులు సకాలంలో సరఫరా చేయడానికి ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
***
(Release ID: 2010897)
Visitor Counter : 159