మంత్రిమండలి

ఖరీఫ్ సీజన్, 2024 (01.04.2024 నుండి 30.09.2024 వరకు) ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె) ఎరువుల కు పోషకాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బిసి)రేటుల కు, మూడు క్రొత్త ఫెర్టిలైజర్ గ్రేడుల ను ఎన్‌బిఎస్ పథకం లో చేర్చడానికి ఆమోదాన్నితెలిపిన మంత్రిమండలి

Posted On: 29 FEB 2024 3:36PM by PIB Hyderabad

ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె) ఎరువుల కు ఖరీఫ్ సీజను, 2024 (01.04.2024 నుండి 30.09.2024 వరకు) పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) రేటుల ను ఖరారు చేయడాని కి సంబంధించి ఎరువుల విభాగం తీసుకు వచ్చిన ప్రతిపాదన ను, మూడు క్రొత్త గ్రేడులకు చెందిన ఎరువుల ను ఎన్‌బిఎస్ పథకం లో చేర్చడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఖరీఫ్ సీజను 2024 కు గాను రమారమి 24,420 కోట్ల రూపాయలు తాత్కాలిక బడ్జెటు రూపేణా అవసరం అవుతాయి.

 

 

ప్రయోజనాలు:

  1. రైతుల కు ఆర్థిక సహాయం (సబ్సిడీ) పరంగా, వారు భరించ గలిగే ధరలు మరియు సహేతుకమైన ధరల కు ఎరువులు అందుబాటు లో ఉండేందుకు ఈ నిర్ణయం బాట ను పరుస్తుంది.
  2. ఎరువులు మరియు ఇన్‌పుట్స్ యొక్క అంతర్జాతీయ ధరల లో ఇటీవల చోటు చేసుకొన్న ధోరణుల ను దృష్టి లో పెట్టుకొని పి & కె ఎరువుల పైన సబ్సిడీ ని హేతుబద్దీకరించడమైంది.
  3. మూడు క్రొత్త గ్రేడుల ను ఎన్‌బిఎస్ లో చేర్చడం వల్ల భూమి స్వస్థత సమతౌల్య స్థితిలో ఉండడాన్ని ప్రోత్సహించడంలోను మరియు నేల అవసరాలకు అనుగుణం గా సూక్ష్మ పోషకాల ను దట్టించినటువంటి ఎరువుల ను ఎంపిక చేసుకొనేందుకు రైతుల కు సమర్థ ప్రత్యామ్నాయాల ను అందుబాటు లోకి తీసుకు రావడం లోను తోడ్పాటు లభిస్తుంది.

 

 

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:

రైతుల కు వారు భరించగలిగిన ధరల కు వారి అవసరాల మేరకు పి & కె ఎరువులు లభ్యం అయ్యేటట్లు చూడడానికి గాను ఖరీఫ్ 2024 ను దృష్టి లో పెట్టుకొని (01.04.2024 నుండి 30.09.2024 మధ్య వర్తిస్తుంది) ఆమోదించిన రేటుల కు పి & కె ఎరువుల పై సబ్సిడీ ని అందించడం జరుగుతుంది.

 

 

పూర్వరంగం:

రైతుల కు 25 గ్రేడుల కు చెందిన పి & కె ఎరువుల ను ఎరువుల తయారీ సంస్థలు/దిగుమతిదారు సంస్థల ద్వారా ప్రభుత్వం సమకూర్చుతున్నది. పి & కె ఎరువుల పై సబ్సిడీ ఎన్‌బిఎస్ పథకం ప్రకారం 2010 ఏప్రిల్ ఒకటో తేదీ నాటి నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం రైతుల కు మిత్రపూర్వకం గా ఉండేటటువంటి విధానాన్ని అనుసరిస్తూ, వారు భరించగలిగినంత ధరలలో పి & కె ఎరువులు లభ్యం అయ్యేటట్లు చూడాలని కంకణం కట్టుకొంది. ఎరువులు మరియు ఇన్‌పుట్స్ అంటే.. యూరియా, డిఎపి, ఎంఒపి, ఇంకా సల్ఫర్ ల అంతర్జాతీయ ధరల లో ఇటీవల చోటు చేసుకొన్న ధోరణు లను పరిగణన లోకి తీసుకొని ప్రభుత్వం ఖరీఫ్ 2024 కు వర్తించేటట్లుగా అంటే 01.04.24 నుండి 30.09.24 వరకు ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె) ఎరువుల కు ఎన్‌బిఎస్ రేటుల ను ఆమోదించాలని నిర్ణయించింది. మూడు క్రొత్త ఎరువుల గ్రేడుల ను ఎన్‌బిఎస్ పరిధి లో చేర్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సబ్సిడీ ని ఆమోదించిన మరియు నోటిఫై చేసిన రేటుల ప్రకారం ఎరువుల కంపెనీల కు అందజేయడం జరుగుతుంది. ఈ కారణం గా ఎరువులు తక్కువ ధరల లో రైతుల కు అందుబాటు లోకి రాగలవు.

 

***



(Release ID: 2010541) Visitor Counter : 94