ప్రధాన మంత్రి కార్యాలయం

మారిశస్ లోని అగాలెగా దీవి లో క్రొత్త ఎయర్‌స్ట్రిప్ నుమరియు  జెట్టీ ని సంయుక్తం గాప్రారంభించిన ప్రధాన మంత్రి మరియు మారిశస్ ప్రధాని


అగాలెగా దీవి లో ఆరు సముదాయ అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రారంభించారు

‘‘భారతదేశాని కిమారిశస్ ఒక చక్కని మిత్ర దేశం.  ఈ రోజు న ప్రారంభం అవుతున్న ప్రాజెక్టులు మన దేశాల మధ్య భాగస్వామ్యాన్నిమరింత గా వృద్ధి చెందింప చేస్తాయి’’

‘‘మా నేబర్‌హుడ్ఫస్ట్ పాలిసీ లో ఒక ముఖ్య భాగస్వామి గా మారిశస్ ఉంది’’

‘‘భారతదేశం తనమిత్ర దేశం అయినటువంటి మారిశస్ పిలిచినప్పుడల్లా పలికే దేశంగా ఉంటూ వస్తున్నది’’

‘‘సముద్ర సంబంధి భద్రత రంగం లో స్వాభావిక భాగస్వామ్య దేశాలు గా భారతదేశం మరియుమారిశస్ ఉన్నాయి’’

‘‘మా యొక్క జన్ ఔషధి కార్యక్రమం లో చేరే మొట్టమొదటి దేశం మారిశస్ కానుంది.  దీనితో, మారిశస్ ప్రజలుభారతదేశం లో ఉత్పత్తి అయిన మెరుగైన నాణ్యత కలిగిన జెనరిక్ ఔషధాల తాలూకు ప్రయోజనాలను అందుకోనున్నారు’’ 

Posted On: 29 FEB 2024 2:13PM by PIB Hyderabad

మారిశస్ లోని అగాలెగా దీవి లో క్రొత్త ఎయర్‌స్ట్రిప్, ఇంకా సెయింట్ జేమ్స్ జెట్టీ ని, మరి అలాగే ఆరు సముదాయ అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ కలసి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం భారతదేశాని కి మరియు మారిశస్ కు మధ్య నెలకొన్న బలమైనటువంటి మరియు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యాని కి ఒక నిదర్శన గా ఉంది. అంతేకాకుండా, ఇది మారిశస్ కు మరియు అగాలెగా కు మధ్య మెరుగైన సంధానం ఏర్పడాలన్న డిమాండు ను నెరవేర్చడం, సముద్ర సంబంధి భద్రత ను పటిష్ట పరచడం లతో పాటు సామాజికపరమైన, ఆర్థికపరమైన అభివృద్ధి ని ప్రోత్సహించనుంది. ఉభయ నేతలు యుపిఐ మరియు రూపే కార్డు సేవల ను ఇటీవలే అంటే 2024 ఫిబ్రవరి 12 వ తేదీ నాడు ప్రారంభించిన దరిమిలా తాజాగా ఈ ప్రాజెక్టుల ప్రారంభాన్ని చేపట్టడం ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది.

 

మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ మాట్లాడుతూ, మారిశస్ లోని అగాలెగా దీవి లో ఆరు సముదాయ అభివృద్ధి ప్రాజెక్టుల తో పాటు, ఒక క్రొత్త ఎయర్‌స్ట్రిప్ మరియు సెయింట్ జేమ్స్ జెట్టీ లను సంయుక్తం గా ప్రారంభించడం ద్వారా భారతదేశం, మారిశస్ లు ఈ రోజు న చరిత్ర ను లిఖిస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమం ఇరు దేశాల మధ్య ఏర్పడిన మార్గదర్శక ప్రాయమైనటువంటి భాగస్వామ్యాని కి ఒక సంకేతం అని ప్రధాని శ్రీ జగన్నాథ్ అన్నారు. మారిశస్ - భారతదేశం సంబంధాల కు ఒక క్రొత్త పార్శ్వాన్ని జోడించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రధాని శ్రీ జగన్నాథ్ ధన్యవాదాల ను తెలియజేశారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నందుకు శ్రీ జగన్నాథ్ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ‘‘అగాలెగా లో నూతన ఎయర్ స్ట్రిప్ ను మరియు జెట్టీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అనేది మారిశస్ కన్న కలల్లో మరొక కల ను నెరవేర్చడమే’’ అని ప్రధాని శ్రీ జగన్నాథ్ అన్నారు. ఈ ప్రాజెక్టు కు పూర్తి స్థాయి లో ఆర్థిక సహాయాన్ని అందించిన భారతదేశాన్ని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వం తరఫున మరియు మారిశస్ తరఫున శ్రీ నరేంద్ర మోదీ కి శ్రీ జగన్నాథ్ కృతజ్ఞతల ను కూడా తెలియజేశారు. భారతదేశం లో శ్రీ నరేంద్ర మోదీ పదవీ బాధ్యత లను స్వీకరించినప్పటి నుండి మారిశస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు గాను మారిశస్ ప్రజల పక్షాన, మరి అలాగే ప్రభుత్వం పక్షాన శ్రీ నరేంద్ర మోదీ కి ప్రగాఢమైన కృతజ్ఞత ను శ్రీ జగన్నాథ్ తెలియజేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బలమైన నాయకత్వాన్ని మరియు ప్రపంచవ్యాప్తం గా ఆయన చాటిచెబుతున్న రాజనీతిజ్ఞత ను శ్రీ జగన్నాథ్ కొనియాడారు. భారతీయ ప్రవాసులు ప్రపంచం లో విలువలు, జ్ఞానం మరియు సాఫల్యం ల పరం గా ఒక మహాశక్తి గా వెలుగులీనుతున్నారు అని ఆయన ఉద్ఘాటించారు. జన్ ఔషధి స్కీమును స్వీకరించిన మొదటి దేశం గా మారిశస్ నిలచింది అని ఆయన వెల్లడించారు. ఈ పథకం లో భాగం గా, అధిక నాణ్యత కలిగిన సుమారు 250 ఔషధాల ను ఫార్మాస్యూటికల్స్ ఎండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా నుండి సమకూర్చుకోవడం జరుగుతుంది అని, దీని ద్వారా మారిశస్ ప్రజల కు విశాల ప్రయోజనం కలుగుతుందని; అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత జోరును అందుకొంటుందని శ్రీ జగన్నాథ్ అన్నారు. మారిశస్ ఈ తరహా పెను మార్పుల కు బాట ను పరచేటటువంటి పథకాల ను అందుకొనేటట్లు గా సాయపడినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ధన్యవాదాల ను శ్రీ జగన్నాథ్ తెలియ జేశారు. ఈ ప్రాజెక్టులు అభివృద్ధి సంబంధి లక్ష్యాల ను సుగమం చేయడం తో పాటుగా, సముద్ర సంబంధి నిఘా లో దేశం శక్తియుక్తుల ను గణనీయం గా వృద్ధి చెందింప చేయగలుగుతాయి అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో ప్రసంగిస్తూ, మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ తో గడచిన ఆరు నెలల కాలం లో తాను సమావేశం కావడం ఇది అయిదో సారి అని వెల్లడించారు. భారతదేశాని కి మరియు మారిశస్ కు మధ్య కొనసాగుతున్న చైతన్యభరితమైన, బలమైన మరియు అద్వితీయమైన భాగస్వామ్యాని కి ఇది ఒక నిదర్శనం అని ఆయన అన్నారు. భారతదేశం అనుసరిస్తున్న నేబర్‌హుడ్ ఫస్ట్ పాలిసిలో మారిశస్ ఒక కీలకమైన భాగస్వామ్య దేశం; అంతేకాదు, విజన్ ఎస్ఎజిఎఆర్ (Vision SAGAR) లో మారిశస్ ఒక ప్రత్యేకమైన భాగస్వామ్య దేశం కూడా అని ఆయన అన్నారు. ‘‘గ్లోబల్ సౌథ్ (వికాసశీల దేశాలు) లో సభ్యత్వం కలిగిన దేశాలు గా మనం ఉమ్మడి ప్రాధాన్యాల ను నిర్దేశించుకొన్నాం. మరి గత పది సంవత్సరాల లో ఉభయ దేశాల మధ్య సంబంధాలు ఇది వరకు ఎన్నడూ లేనంతటి జోరు ను అందుకొన్నాయి; పరస్పర సహకారాన్ని సరిక్రొత్త శిఖర స్థాయిల కు చేర్చడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రాచీనమైన భాషాపరమైన మరియు సాంస్కృతికపరమైన సంబంధాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, యుపిఐ, ఇంకా రూపే కార్డు లు ఈ సంబంధాల కు ఆధునిక డిజిటల్ కనెక్టివిటీ ని జోడించాయి అన్నారు.

 

 

అభివృద్ధి పరమైనటువంటి భాగస్వామ్యాలు రెండు దేశాల మధ్య రాజకీయ పరమైన భాగస్వామ్యాల కు గట్టి పునాదులు గా నిలచాయి, మరి భారతదేశం అందించిన అభివృద్ధి ప్రధానమైన తోడ్పాటులు.. అవి ఇఇజడ్ కు భద్రత ను కల్పించడం కావచ్చు, లేదా ఆరోగ్య భద్రత ను కల్పించడం కావచ్చు.. మారిశస్ యొక్క ప్రాధాన్యాల ను లెక్క లోకి తీసుకొని చేపట్టినవే అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘మారిశస్ యొక్క అవసరాల ను భారతదేశం సదా గౌరవిస్తూ వచ్చింది, మరి మారిశస్ కు సాయం అవసరమైనప్పుడల్లా భారతదేశం ఆ సహాయాన్ని అందించిన మొట్టమొదటి దేశం గా ఉంటూ వచ్చింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అది కోవిడ్ మహమ్మారి కావచ్చు, లేదా చమురు తెట్టు ఘటన కావచ్చు.. ద్వీప దేశాని కి భారతదేశం చిరకాలం గా సమర్థన ను అందిస్తూ వస్తోందన్న విషయాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. గత పది సంవత్సరాల లో మారిశస్ ప్రజల కు 400 మిలియన్ యుఎస్ డాలర్ ల విలువైన సహాయాన్ని అందించడం తో పాటు, 1,000 మిలియన్ యుఎస్ డాలర్ ల మేరకు పరపతి సదుపాయాన్ని కూడా భారతదేశం అందించింది అని ప్రధాన మంత్రి తెలిపారు. మారిశస్ లో మెట్రో రైలు మార్గాల అభివృద్ధి, సముదాయ అభివృద్ధి ప్రాజెక్టులు, సామాజిక గృహ నిర్మాణ పథకం, ఇఎన్‌టి ఆసుపత్రి, సివిల్ సర్వీస్ కాలేజి లతో పాటు క్రీడాభవన సముదాయాల సంబంధి మౌలిక సదుపాయాల కల్పన లో భారతదేశం తన వంతు తోడ్పాటును అందించే అదృష్టాన్ని దక్కించుకొంది అని ఆయన వ్యాఖ్యానించారు.

 

అగాలెగా ప్రజల కు 2015 వ సంవత్సరం లో తాను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొన్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం, దీనిని భారతదేశం లో మోదీ యొక్క హామీ గా వ్యవహరించడం జరుగుతోంది. ‘‘ఈ రోజు న సంయుక్తం గా ప్రారంభించుకొన్న సదుపాయాలు జీవన సౌలభ్యాన్ని వృద్ధి చెందింప చేస్తాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఇవి మారిశస్ లోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల మధ్య సంధానాన్ని మెరుగు పరచడం తో పాటు ప్రధాన క్షేత్రం తో పరిపాలన సంబంధి సంపర్కాన్ని కూడా మెరుగు పరుస్తాయి అని ఆయన వివరించారు. వైద్య చికిత్స కారణాల వల్ల తరలింపు మరియు బడి పిల్లల రవాణా సంబంధి సదుపాయాలు మెరుగు పడతాయి అని ఆయన అన్నారు.

 

హిందూ మహాసముద్ర ప్రాంతం లో తలెత్తుతున్న సాంప్రదాయక మరియు సాంప్రదాయేతర సవాళ్ళు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల పైన ప్రభావాన్ని ప్రసరిస్తున్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ సవాళ్ళ ను ఎదుర్కోవడం లో భారతదేశం మరియు మారిశస్ లు సముద్ర రంగం భద్రత లో స్వాభావిక భాగస్వామ్య దేశాలు గా ముందుకు సాగుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతం లో భద్రత, సమృద్ధి మరియు స్థిరత్వం లు నెలకొనేటట్లు పూచీ పడడం కోసం మనం చురుకు గా పాటుపడుతున్నాం. ఇక్స్ క్లూసివ్ ఇకనామిక్ జోన్ యొక్క పర్యవేక్షణ, ఉమ్మడి గస్తీ, హైడ్రోగ్రఫి, మానవతాపూర్వకమైన సహాయాన్ని అందించడం మరియు విపత్తుల వేళల్లో సహాయక చర్యల ను చేపట్టడం వంటి అన్ని రంగాల లోను మనం సహకరించుకొంటున్నాం’’ అని భారతదేశం యొక్క ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న అగాలెగా లో ప్రారంభించుకొన్న ఎయర్ స్ట్రిప్ మరియు జెట్టీ మారిశస్ లో నీలి విప్లవాన్ని బలపరుస్తూనే రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత గా పెంచుతాయి అని ఆయన స్పష్టం చేశారు.

 

మారిశస్ లో జన్ ఔషధి కేంద్రాల ను ఏర్పాటు చేయాలని ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ తీసుకొన్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దీని తో భారతదేశం యొక్క జన్ ఔషధి కార్యక్రమం లో చేరే ఒకటో దేశం గా మారిశస్ నిలచింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ చర్య మారిశస్ ప్రజల కు మంచి నాణ్యత కలిగిన మేడ్ ఇన్ ఇండియాజెనెరిక్ మందుల ను అందజేయగలుగుతుంది అని ఆయన అన్నారు.

 

మారిశస్ ప్రధాని దూరదర్శిత్వాన్ని మరియు హుషారైన నాయకత్వాన్ని అభినందిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. భారతదేశం మరియు మారిశస్ సంబంధాలు రాబోయే కాలాల్లో నూతన శిఖరాల ను అందుకొంటాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

 

***

DS/TS



(Release ID: 2010308) Visitor Counter : 106