పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మానవుల ప్రాణాలను కాపాడేందుకు మేం చేయగలిగినదంతా చేస్తామన్న శ్రీ భూపేంద్ర యాదవ్
Posted On:
22 FEB 2024 9:05AM by PIB Hyderabad
వాయనాడులో పులుల, ఏనుగుల దాడుల కారణంగా మరణించిన బాధితుల కుటుంబాలను కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రి భూపేంద్ర యాదవ్ పరామర్శించారు.
రెండు రోజుల వాయనాడ్ పర్యటన కోసం బెంగళూరు నుంచి నేరుగా వచ్చిన కేంద్ర మంత్రి, వన్యప్రాణుల దాడులలో మరణించిన వారి కుటుంబాలను సందర్శించారు.
శ్రీ యాదవ్ పులి నోట మరణించిన ప్రజీష్ ఇంటికీ, ఏనుగుల దాడిలో మరణించిన పాల్, అజీష్‌ల ఇళ్లకు వెళ్ళారు.
బాధిత కుటుంబాలను ఓదార్చి, వారు, స్థానికులు చెప్పిన మాటలను కేంద్ర మంత్రి విన్నారు.
ఈ ప్రాంతంలో మానవుల - మృగాల మధ్య సంఘర్షణ ప్రధాన సమస్య అయిందని ఆయన అన్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ క్షేత్రంలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులకు ప్రభుత్వం రాజకీయంగా, పాలనాపరంగాను అన్నిరకాల తోడ్పాటును అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం ఉండాలని ఆయన అన్నారు. కేరళ, కర్నాటక రెండు రాష్ట్రాలూ ఇందులో ఉన్నందున, ఇరు రాష్ట్రాలకు చెందిన సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని వివరించారు. తాను ఫిబ్రవరి 22వ తేదీన ఈ క్షేత్రంలో పని చేస్తున్న స్థానిక అధికారులు, ఎన్జీవోలతో తాను సమావేశమవుతున్నట్టు చెప్పారు. సమావేశం తర్వాత మరింత సమాచారమిస్తామన్నారు. పర్యావరణం, మానవ జీవితం రెండూ సమానంగా ముఖ్యం కనుకవాటిని పరిరక్షించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మార్గదర్శక దృష్టిని తాము అనుసరిస్తున్నామని ఆయన అన్నారు. జంతువుల పట్ల దయ అవసరమే అయినా నూతన సాంకేతికత సాయంతో మానవ జీవితాలను కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
***
(Release ID: 2008242)
Visitor Counter : 140