ఆర్థిక మంత్రిత్వ శాఖ

సుపరిపాలన కోసం 'నేషనల్‌ పెన్షన్‌ సిస్టం ట్రస్ట్‌', 'పెన్షన్‌ ఫండ్‌' నిబంధనలకు సవరణలు నోటిఫై చేసిన పీఎఫ్‌ఆర్‌డీఏ


పింఛను నిధి నిర్వహణ నిబంధనలను సరళీకరించేందుకు & బహిర్గతాలను మెరుగుపరిచేందుకు కంపెనీల చట్టం-2013కు అనుగుణంగా సవరణలు

Posted On: 21 FEB 2024 12:20PM by PIB Hyderabad

'జాతీయ పింఛను వ్యవస్థ నిధి' (రెండో సవరణ) నిబంధనలు-2023, 'పింఛను నిధి' (సవరణ) నిబంధనలు-2023కు చేపట్టిన సవరణలను 'పింఛను నిధి నియంత్రణ & అభివృద్ధి ప్రాధికార సంస్థ' (పీఎఫ్‌ఆర్‌డీఏ) 05.02.2024 & 09.02.2024 తేదీల్లో నోటిఫై చేసింది.

ఎన్‌పీఎస్‌ ట్రస్ట్ నిబంధనల్లో చేసిన సవరణలు ధర్మకర్తల నియామకం, వారికి నిబంధనలు & షరతులు, ధర్మకర్తల మండలి సమావేశాలను నిర్వహించడం, ఎన్‌పీఎస్‌ ట్రస్ట్ సీఈవో నియామకం సంబంధిత నిబంధనలను సరళీకరిస్తాయి.

'పింఛను నిధి' నిబంధనల్లో చేసిన సవరణలు కంపెనీల చట్టం 2013కు అనుగుణంగా, పింఛను ఫండ్ల నిర్వహణ నిబంధనలను సులభంగా మారుస్తాయి. పింఛను ఫండ్లు రహస్యాలను దాచి పెట్టకుండా నిరోధిస్తాయి.

ఇతర కీలక సవరణలు:

  1. 'సరిపోయే & సరైన వ్యక్తి' ప్రమాణాలకు అనుగుణంగా పింఛను ఫండ్ ప్రాయోజితుల పరిధిపై స్పష్టత.
  2. పింఛను ఫండ్ల ద్వారా ఆడిట్ కమిటీ, నామినేషన్ & రెమ్యూనరేషన్ కమిటీ వంటి అదనపు బోర్డు కమిటీల ఏర్పాటు.
  3. పేరు నిబంధనలో 'పెన్షన్ ఫండ్'ను చేర్చడం, ప్రస్తుత పింఛను ఫండ్లు 12 నెలల్లోపు ఈ నిబంధనకు మారేలా చూడడం.
  4. పింఛను ఫండ్ నిర్వహించే పథకాల వార్షిక నివేదిక డైరెక్టర్ల బాధ్యతగా మార్చడం.

పరిపాలనను సరళీకృతం చేయడం, ఇబ్బందులు తగ్గించడం లక్ష్యంగా కీలక అంశాల్లో సవరణలు జరిగాయి. సవరించిన నిబంధనలపై మరింత సమాచారం కోసం పీఎఫ్‌ఆర్‌డీఏ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు:

ఎన్‌పీఎస్‌ ట్రస్టు: https://www.pfrda.org.in/myauth/admin/showimg.cshtml?ID=2883

పింఛను ఫండ్‌: https://www.pfrda.org.in/myauth/admin/showimg.cshtml?ID=2891

సమ్మతి ఇబ్బందులు తగ్గించేలా, నిర్వహణను సులభంగా మార్చేలా కేంద్ర బడ్జెట్‌ 2023-24 ప్రకటనకు అనుగుణంగా ఈ సవరణలు జరిగాయి.

***



(Release ID: 2007755) Visitor Counter : 74