ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జమ్మూలోని ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


జమ్ముకాశ్మీర్‌లో గత 10 సంవత్సరాలలో మెడికల్ కాలేజీల సంఖ్య 4 నుండి 12కి పెరిగింది. అదేవిధంగా అదే సమయంలో ఎంబీబీఎస్‌ సీట్లు 500 నుండి 1300కి అంటే రెండింతలు పెరిగాయి: ప్రధాన మంత్రి

"గత 10 సంవత్సరాలలో జె&కెలో పీజీ మెడికల్ సీట్లు 0 నుండి 650కి పెరిగాయి"

"ఎయిమ్స్ జమ్మూ ప్రారంభమైన నేపథ్యంలో జమ్మూ ప్రజలు ప్రత్యేక వైద్య చికిత్స పొందేందుకు ఇకపై ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు"

2047 నాటికి వికసిత భారత్ విజన్‌ను పునరుద్ఘాటిస్తుంది మరియు ఆ కలను నెరవేర్చుకునే దిశలో వికసిత జమ్మూ & కాశ్మీర్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది

జమ్మూ ఎయిమ్స్ శంకుస్థాపన నుండి ప్రారంభోత్సవానికి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పట్టింది. ఈ నిర్మాణ వేగం ఈ ప్రాంతం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జె&కె భారతదేశంలో ఎయిమ్స్‌, ఐఐటీ, ఐఐఎం మరియు ఇతర ప్రముఖ సంస్థలను కలిగి ఉన్న ఏకైక ప్రాంతంగా అవతరించింది: , జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

Posted On: 20 FEB 2024 3:19PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జ‌మ్ములోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఈ ప్రాంతంలో అనేక ఇతర అభివృద్ధి పనులకు ప్రారంబోత్సవాలు, శంకుస్థాపన చేశారు మరియు కేంద్ర పథకాల లబ్ధిదారులతో సంభాషించారు.

ఈ కార్యక్రమంలో జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా  మరియు కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్స్ ఆఫ్ ఇండియా సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్,  జమ్మూ పార్లమెంటు సభ్యుడు శ్రీ జుగల్ కిషోర్ శర్మపాల్గొన్నారు.

 

image.png

image.png

 


స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ “గత 10 సంవ‌త్స‌రాల‌లో జమ్మూ & కాశ్మీర్‌లో వైద్య కళాశాలల సంఖ్య 4 నుండి 12కి పెరిగింది. అదే సమయంలో ఎంబీబీఎస్‌ సీట్లు 500 నుండి 1300కి రెండింతలు పెరిగాయి. 2014కి ముందు జమ్మూ & కాశ్మీర్‌లో పీజీ మెడికల్ సీట్లు లేవని చెబుతు ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతంలో 650 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో 35 కొత్త నర్సింగ్ మరియు పారామెడిక్ కాలేజీలు కూడా రాబోతున్నాయని దీని వల్ల నర్సింగ్ సీట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని ప్రధాని చెప్పారు.

జమ్మూలోని ఎయిమ్స్‌ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో 15 కొత్త ఎయిమ్స్‌ను నిర్మించింది. ఇందులో కేవలం జె&కె లోనే రెండు ఉన్నాయి” అని తెలిపారు "ఎయిమ్స్ జమ్మూ ప్రారంభించిన నేపథ్యంలో జమ్మూ ప్రజలు ప్రత్యేక వైద్య చికిత్సను పొందేందుకు ఇకపై ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఇది విలువైన సమయం మరియు వనరులను ఆదా చేయడంలో వారికి సహాయపడుతుంది" అని ఆయన అన్నారు.

 

image.png


దేశంలోని అన్ని రంగాలలో మౌలిక సదుపాయాల పరివర్తన వేగవంతమైన వేగాన్ని ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. 2047 నాటికి భారతదేశం వికసిత భారత్‌గా మారాలన్న తన దృక్పథాన్ని పునరుద్ఘాటించిన ఆయన ఆ దృక్పథం కోసం కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వికసిత జమ్మూ & కాశ్మీర్ అనేది వికసిత భారత్‌కు ముందస్తు అవసరం అని మరియు జమ్ము కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ అభివృద్ధి మరియు ఉద్ధరణ ప్రాజెక్టులు ఆ దార్శనికతను వాస్తవంలోకి తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా తన హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్‌ జమ్మూకి శంకుస్థాపన చేసిన ఐదేళ్లలోనే ప్రారంభోత్సవం చేశామని కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని చెప్పారు.

 

దయచేసి ఈ ట్వీట్‌ను పొందుపరచండి:


జమ్మూ & కాశ్మీర్ (జె&కె) అభివృద్ధి మరియు కేంద్ర పథకాల ప్రయోజనాలను అట్టడుగు వర్గాలకు తీసుకురావడంలో లేదా ఆ ప్రాంతానికి రెండు ఎయిమ్స్‌లను అందించడంలో ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చినందుకు శ్రీ మనోజ్ సిన్హా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. "గత 5 సంవత్సరాలుగా జె&కెలో ప్రత్యేకించి ఈ ప్రాంతం యొక్క ఆరోగ్యం, విద్య, భద్రత మరియు మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధిలో మార్పు వచ్చింది. తద్వారా తీవ్రవాదం 75% క్షీణించింది మరియు పెట్టుబడులు మరియు కొత్త అవకాశాల పెరుగుదలలో స్పష్టంగా కనిపిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. "శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో ఎయిమ్స్‌, ఐఐటీ, ఐఐఎం మరియు ఇతర ప్రముఖ సంస్థలను కలిగి ఉన్న ఏకైక ప్రాంతంగా జె&కె అవతరించింది" అని కూడా ఆయన వివరించారు.


డాక్టర్ జితేంద్ర సింగ్ దేశంలో మరియు ముఖ్యంగా జె&కె లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఈ అభివృద్ధి పథకాలు చాలా వరకు ప్రారంభం నుండి చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయని మరియు అభివృద్ధి చివరి మైలుకు చేరుకునేలా వాటిని చురుగ్గా కొనసాగించినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి ఘనత అని ఆయన పేర్కొన్నారు.

 


నేపథ్యం:

ఎయిమ్స్‌ జమ్మూ, నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్‌స్టిట్యూట్, విజయపూర్ (జమ్మూ)లో ఉన్న తృతీయ ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునికమైన విశ్వసనీయమైన అధిక-నాణ్యత రెఫరల్ సెంటర్. ఇది మన దేశంలో ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ అసమతుల్యతలను పరిష్కరించడానికి సాక్ష్యం-ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి మరియు వైద్య విద్య ప్రమాణాలను పెంచడానికి ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎంఎస్‌ఎస్‌వై) ఆధ్వర్యంలో స్థాపించబడింది.

 

image.png


ఎయిమ్స్‌ జమ్మూ అట్టడుగు వర్గాలకు సేవ చేయాలనే నిబద్ధతతో సరసమైన ప్రత్యేక వైద్య సంరక్షణను అందించడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా చికిత్స కోసం సుదూర నగరాలకు ప్రయాణించే ఆర్థిక భారం మరియు సమయ పరిమితులను తగ్గించడం మరియు ప్రాంతం యొక్క ఆరోగ్య సంరక్షణ దృశ్యాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

"హీలింగ్ మీట్స్ హోప్" అనే నినాదంతో ఇన్స్టిట్యూట్ యొక్క లోగో జమ్మూ ప్రాంతం యొక్క సామాజిక-సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఔట్ పేషెంట్ విభాగంలో రోజూ 2000-3000 మంది రోగులు వస్తారని అంచనా వేస్తూ సమగ్ర వైద్య సేవలను అందించడానికి ఆసుపత్రి సిద్ధంగా ఉంది. ఫేజ్-1లో ట్రామా కేర్, జనరల్ కేర్ మరియు సూపర్ స్పెషాలిటీలను అందించే 193 ఐసియు పడకలు సహా 750 పడకలను ఏర్పాటు చేశారు. ఎయిమ్స్‌ జమ్మూ సాధారణ మరియు ప్రత్యేక సంరక్షణ రెండింటినీ కలుపుతూ సుమారు 50 విభాగాలను కలిగి ఉండాలని యోచిస్తోంది. న్యూక్లియర్ మెడిసిన్, 20 మాడ్యులర్ ఓటీలు, ఎంఆర్‌ఐ మరియు సీటీ స్కాన్ వంటి అధునాతన సౌకర్యాలు, 24 గంటలూ పనిచేస్తాయి. మానవీయ మరియు నిరంతర సంరక్షణ తక్షణమే అందుబాటులో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఎయిమ్స్‌ జమ్మూకు రెండుఅంతస్తుల "ఆయుష్ బ్లాక్" 30 పడకలతో పాటు ఇతర సౌకర్యాలు మరియు భాగస్వామ్యాలతో ప్రాంతీయ ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి సాంప్రదాయ మరియు ఆధునిక వైద్యాన్ని విలీనం చేసే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఎయిమ్స్‌ జమ్మూ అనేది అత్యవసర సంరక్షణలో త్వరితగతిన ట్రామా పేషెంట్ రవాణా కోసం హెలిప్యాడ్‌తో ప్రాంతం & అంతకు మించి ఆశాకిరణం.

పేషెంట్ అసిస్టెంట్ సర్వీసెస్, ఇండోర్ నావిగేషన్ సిస్టమ్, పేషెంట్ కేర్ మేనేజర్‌లు మరియు కోఆర్డినేటర్‌లు మరియు స్మార్ట్ పేమెంట్ కార్డ్‌లు వంటి వినూత్న సౌకర్యాలను కలిగి ఉన్న 'పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్'ని స్థాపించడం ద్వారా ఎయిమ్స్‌ జమ్మూ ఒక సంచలనాత్మక చొరవను పరిచయం చేసింది. పేషెంట్ నావిగేషన్ సిస్టమ్ యొక్క పరిచయం రోగులందరికీ ప్రాప్యతను మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది. ప్రత్యేకించి దృష్టి లోపం ఉన్నవారితో సహా విభిన్న వికలాంగులకు ప్రయోజనం చేకూర్చడం ద్వారా ఎయిమ్స్‌లో వారు కోరుకున్న ప్రాంతానికి నావిగేషన్‌ను సులభతరం చేస్తాయి.

 

image.png


ఎయిమ్స్‌ జమ్మూలో ఎంబీబీఎస్‌ ప్రోగ్రామ్ కోసం సంవత్సరానికి 100 మంది విద్యార్థులను మరియు నర్సింగ్ కోసం 60 మంది విద్యార్థులు ఉంటారు ఇది భవిష్యత్తులో మెడికల్, డెంటల్ (ఎండి/ఎంఎస్/ఎండిఎస్), నర్సింగ్, సూపర్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్‌లు (డిఎం/ఎంసిహెచ్‌), డాక్టరేట్ (పిహెచ్‌డి) డిగ్రీలు మరియు మరిన్నింటిలో పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను కూడా ప్రవేశపెడుతుంది.

44 నెంబర్‌ జాతీయ రహదారి వెంబడి 226.84 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆసుపత్రి భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత సుందరమైన క్యాంపస్‌లలో ఒకటి. క్యాంపస్ పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ హాబిటాట్ అసెస్‌మెంట్ (జిఆర్‌ఐహెచ్‌ఏ) కోసం 4-స్టార్ గ్రీన్ రేటింగ్ కోసం అభివృద్ధి చేయబడింది. సోలార్ ప్యానెల్ సిస్టమ్, మురుగునీటి శుద్ధి కర్మాగారం మరియు 13,500 చెట్లు మరియు 5 లక్షల పొదలను కూడా ఇందులో నాటారు.

 

image.pngimage.png


అత్యాధునిక ప్రొజెక్షన్ సిస్టమ్, ఆడియో-విజువల్ సిస్టమ్ మరియు 1000 మంది కూర్చునే సామర్థ్యంతో కూడిన కన్వెన్షన్ సెంటర్, 216 మంది అటెండెంట్‌లకు నైట్ షెల్టర్, బహుళ అంతస్థుల స్టాఫ్ హౌసింగ్, యూజీ/పిజీ హాస్టల్‌లు, స్పోర్ట్స్ క్లబ్, క్రికెట్ స్టేడియం, బాస్కెట్‌బాల్ మరియు లాన్ టెన్నిస్ కోర్ట్‌లు, స్క్వాష్ కోర్ట్, 3284 కార్ల కోసం సర్ఫేస్ పార్కింగ్ మరియు 26 మంది అతిథుల కోసం గెస్ట్ హౌస్‌ మొదలైన మౌలిక సదుపాయాలు ఎయిమ్స్‌ జమ్మూలో ఉన్నాయి.  క్యాంపస్‌లో జీవన నాణ్యతను పెంపొందించడానికి యాంఫీథియేటర్, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ పాత్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

54% మంది అధ్యాపకులు మరియు దాదాపు 78%-80% నర్సింగ్ అధికారులు మహిళలే. ఎయిమ్స్‌ జమ్మూలో సమాన అవకాశాలు, సహాయక పని వాతావరణాలు మరియు లింగ-సెన్సిటివ్ విధానాల ద్వారా మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తుంది. మహిళా నాయకత్వానికి తగిన శిక్షణా కార్యక్రమాలు వైవిధ్యం మరియు చేరిక పట్ల దాని నిబద్ధతను ఉదహరిస్తాయి.

ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా, ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ యొక్క అవాంతరాలు లేని ఏకీకరణ కోసం ఎయిమ్స్‌ జమ్మూ ప్రారంభించిన 1 సంవత్సరంలోపు 4 మైలురాళ్లలో ఆరోగ్య సంరక్షణలో 100% డిజిటలైజేషన్ వైపు పరివర్తన చెందుతుంది. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (ఈహెచ్‌ఆర్‌లు) సంప్రదాయ పేపర్ రికార్డులను భర్తీ చేస్తాయి.

ఎయిమ్స్‌ జమ్మూ ఐఐటీ, ఐఐఎం, ఐఐఐఎం వంటి ప్రధాన సంస్థలతో మరియు ప్రతిస్పందించే, అనుకూలమైన మరియు ప్రపంచవ్యాప్తంగా అనుసంధానించబడిన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి సహకారాన్ని ఏర్పాటు చేసింది. ఇది టెలిమెడిసిన్, ట్రామా సైన్సెస్, నర్సింగ్, కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అడ్వాన్స్‌డ్ స్టడీస్ వంటి వివిధ డొమైన్‌లలో "సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్"ని చురుగ్గా ఏర్పాటు చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ మరియు విద్యలో విజయం మరియు ప్రాముఖ్యతను లక్ష్యంగా చేసుకుంది. ఇది రాబోయే 24/7 ఆధునిక డిజిటల్ లైబ్రరీ ఆరోగ్య సంరక్షణ పద్ధతులను అభివృద్ధి చేయడంలో కీలకమైన ఆస్తిగా పనిచేస్తుంది. "ఎయిమ్స్‌ జమ్మూ" అనేది ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి మరియు వైద్య విద్య కోసం "గ్లోబల్ విలేజ్"గా భావించబడుతుంది. ఓఐసీలు/ఎన్‌ఆర్‌ఐలు అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. రోగుల అన్ని పరిశోధనాత్మక, ఆపరేటివ్, పునరావాస మరియు వృత్తిపరమైన అవసరరాలను నెరవేర్చేందుకు సమగ్ర 'వన్ క్యాంపస్' సమాధానాన్ని లక్ష్యంగా చేసుకుంది.

జమ్మూలోని ఎయిమ్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, జమ్మూ & కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం అలాగే అమలు చేసే ఏజెన్సీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

 

****



(Release ID: 2007662) Visitor Counter : 67