యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
గువాహతిలో ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్న శ్రీ అనురాగ్ ఠాకూర్
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 ప్రారంభ కార్యక్రమాన్ని మెరిపించనున్న పపాన్
Posted On:
17 FEB 2024 7:11PM by PIB Hyderabad
గువాహతిలో 19 ఫిబ్రవరిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరవనున్నారు.
ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, స్వరకర్త పాపన్ గువాహతిలోని సరుసజై స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ క్రీడలను ఈశాన్య ప్రాంతానికి చెందిన ఏడు రాష్ట్రాల వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇవి ఫిబ్రవరి 29న ముగియనున్నాయి.
ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలకు అస్సాం ముఖ్యమంత్రి శ్రీహిమంత బిశ్వశర్మతో పాటుగా కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరవుతారు. వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ క్రీడాకారులకు ప్రేరణాత్మక సందేశం ఇవ్వనున్నారు. ఈ క్రీడలకు సంబంధించిన నాలుగవ ఎడిషన్ ఇది. కెఐయుజి 2023లో 200 విశ్వవిద్యాలయాలకు చెందిన 4500మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
పపాన్‌గా ప్రాచుర్యం పొందిన అంగరాగ్ మహంత కెఐయుజి 2023- అష్టలక్ష్మికి ఒక అద్భుతమైన ఉర్రూతలూగించే ప్రారంభాన్ని ఇవ్వనున్నారు.
ప్రారంభ కార్యక్రమానికి పాపాన్‌ను జోడించడం అన్నది గ్లామర్‌ను తెస్తుందని అస్సాం క్రీడలు, యువజన సంక్షేమ మంత్రి శ్రీమతి నందితా గర్లొసా అన్నారు. పపాన్ బార్‌త్‌కు యువ ఐకాన్ అని, గువాహతి అతడిని ప్రత్యక్షంగా చూసి వింటుందని అన్నారు. భూపేన్ హజారికా వంటి గొప్ప సంగీతకారులు తమకు ఉండేవారని, మంచి సంగీతం ఏ తరానికీ అర్థం కాదని అన్నారు. హజారికా, పపాన్ ఇద్దరూ తమవైన పద్ధతుల్లో ప్రత్యేకమైనవారని, ఇక్కడ జుబీన్ గార్గ్‌ను మరువరాదని శ్రీమతి గోర్లాసా పేర్కొన్నారు.
ఘనంగా ప్రారంభం కానున్న ఈ క్రీడలు ప్రేక్షకులందరినీ ఉచితంగా ఆహ్వానించడంతో పాటు, ఐక్య, భిన్నత్వం, క్రీడా స్ఫూర్తి వంటి విలువలను పట్టి ఇతివృత్తితో కూడిన ప్రదర్శన ఉంటుంది. అదనంగా అస్సాం సజీవ సంస్కృతి కేంద్రం అయ్యి, ఆకట్టుకునే దేశీయ కళలను ప్రదర్శిస్తూ ఈ కార్యక్రమానికి సాంస్కృతిక మెరుగులను అద్దుతుంది.
ముఖ్యంగా, ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు 2023 అష్టలక్ష్మి శనివారం కబడ్డీ మ్యాచ్‌లతో సరుసజై స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రెండు వర్గాలుగా విభజితమైన ఎనిమిది జట్లు కీర్తి కోసం పోటీ పడుతున్నాయి.
భారత ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఖేలో ఇండియా చొరవలో భాగం కెఐయుజె. ఖేలో ఇండియా మిషన్ క్షేత్రస్థాయి క్రీడలను ప్రోత్సహించి, దేశవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభను గుర్తించడంపై దృష్టి పెడుతుంది.
***
(Release ID: 2007287)