ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక సంవత్సరం 2023-24 కి సంబంధించి 10.02.2024 వరకు ప్రత్యక్ష పన్నుల మొత్తం సవరించిన అంచనాలలో 80.23 శాతం ప్రత్యక్ష పన్ను వసూళ్లు
17.30 శాతం గత ఏడాది కన్నా వృద్ధితో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఫిబ్రవరి 10, 2024 నాటికి రూ. 18.38 లక్షల కోట్లు
ప్రత్యక్ష పన్ను వసూళ్లు, రీఫండ్‌లో నికరంగా, రూ.15.60 లక్షల కోట్లు
గత ఏడాదితో పోలిస్తే 20.25 శాతం వృద్ధి
నికర కార్పొరేట్ ఆదాయపు పన్ను (సిఐటి) 13.57 శాతం, నికర వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) 26.91 శాతం గత ఏడాది కన్నా పెరుగుదల
రిఫండ్ల విలువ రూ. 2.77 లక్షల కోట్లు ఏప్రిల్ 1, 2023 నుండి 10 ఫిబ్రవరి, 2024 వరకు జారీ చేయబడ్డాయి
Posted On:
11 FEB 2024 2:13PM by PIB Hyderabad
ప్రత్యక్ష పన్ను వసూళ్ల తాత్కాలిక గణాంకాలు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 10, 2024 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు చుస్తే స్థూల వసూళ్లు, రూ. 18.38 లక్షల కోట్లుగా నమోదయింది. ఇది గత సంవత్సరం ఇదే కాలానికి స్థూల వసూళ్ల కంటే 17.30 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్లు, రిఫండ్‌ల నికరం రూ.15.60 లక్షల కోట్లు, ఇది గత సంవత్సరం ఇదే కాలానికి నికర వసూళ్ల కంటే 20.25 శాతం ఎక్కువ. ఈ సేకరణ 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం ప్రత్యక్ష పన్నుల మొత్తం సవరించిన అంచనాలలో 80.23 శాతం.
కార్పొరేట్ ఆదాయపు పన్ను (సిఐటి), వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) స్థూల రాబడి సేకరణలు కూడా స్థిరమైన వృద్ధిని చూపుతున్నాయి. సిఐటి వృద్ధి రేటు 9.16 శాతం అయితే పిఐటికి 25.67 శాతం (పిఐటి మాత్రమే)/ 25.93 శాతం (ఎస్టిటితో సహా పిఐటి) రిఫండ్ సర్దుబాటు తర్వాత, సిఐటి సేకరణలలో నికర వృద్ధి 13.57 శాతం, పిఐటి సేకరణలలో 26.91 శాతం (పిఐటి మాత్రమే)/ 27.17 శాతం (ఎస్టిటితో సహా పిఐటి).
రిఫండ్ మొత్తం రూ. 2.77 లక్షల కోట్లు ఏప్రిల్ 1, 2023 నుండి 10 ఫిబ్రవరి, 2024 వరకు జారీ చేశారు.
***
(Release ID: 2005486)
Visitor Counter : 141