ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ఆ ఆధ్యాత్మిక మహా గురువు గౌరవార్థం స్మారక తపాలాబిళ్ళ నుమరియు నాణేన్ని ప్రధాన మంత్రి విడుదల చేశారు

‘‘కృష్ణ ప్రేమ కు గీటురాయి చైతన్య మహాప్రభు.  ఆధ్యాత్మిక వాదాన్ని మరియు ధ్యానాన్ని  సామాన్య ప్రజానీకాని కి అందుబాటు లోకి ఆయన తీసుకు వచ్చారు’’

‘‘భక్తి అనేది మనమునులు ఇచ్చిన ఒక వైభవ భరితమైన తాత్త్వికత.  అది నిరాశ ను గాక, ఆశ ను మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.  భక్తి అంటే భయం కాదు, భక్తి అంటేఉత్సాహం’’

‘‘భక్తి మార్గాన్నిఅనుసరించిన మన మునులు ఒక్క స్వాతంత్య్ర ఉద్యమం లోనే కాకుండా దేశ ప్రజల కు ఎదురైనటువంటి ప్రతి ఒక్క సవాలు భరిత దశ లో కూడా దారి ని చూపెట్టి అమూల్యమైనపాత్ర ను పోషించారు’’

‘‘మనం దేశ ప్రజల ను‘దైవం’ గా భావిస్తాం మరి ‘దేవ్ సే దేశ్’ అనే దృష్టి కోణం తో ముందుకు సాగిపోతున్నాం’’

‘‘భిన్నత్వం లో ఏకత్వం అంటూ భారతదేశం అనుసరిస్తున్నటువంటి  సిద్ధాంతం లో విభజన కు తావు లేదు’’

‘‘ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అనేది భారతదేశం యొక్క ఆధ్యాత్మిక విశ్వాసం గా ఉంది’’

‘‘ఆధ్యాత్మిక వాదంమరియు జ్ఞానం ల ద్వారా నిరంతర శక్తి యొక్క మూలం వలె బంగాల్ ఉంది’’

Posted On: 08 FEB 2024 3:07PM by PIB Hyderabad

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇంత మంది మహామునుల హాజరు తో భారత్ మండపం యొక్క గొప్పతనం అనేక రెట్లు వృద్ధి చెందింది అన్నారు. ప్రభువు బసవేశ్వరుని అనుభవ మండపంపై ఆధారపడి ఈ భవనం రూపుదిద్దుకొంది అని ప్రధాన మంత్రి తెలిపారు. అది ప్రాచీన భారతదేశం లో ఆధ్యాత్మిక చర్చల కు కేంద్రం గా ఉంది అని ఆయన అన్నారు. ‘‘విశ్వాసం యొక్క శక్తి కి మరియు సామాజిక సంక్షేమం సంబంధి సంకల్పాని కి కేంద్రం గా అనుభవ మండపంఉంటూ వచ్చింది’’ అని ఆయన అన్నారు. ‘‘శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి అయినటువంటి ఈ రోజు న భారత్ మండపం లో అదే విధమైన శక్తి ని గమనించవచ్చును’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం యొక్క ఆధునిక సామర్థ్యాల కు మరియు ప్రాచీన మూలాల కు ఒక కేంద్రం గా భారత్ మండపాన్ని తీర్చిదిద్దడం లో ప్రభుత్వం శ్రద్ధ ను తీసుకొంటోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. ఇటీవలే ఇక్కడ ముగిసిన జి-20 శిఖర సమ్మేళనం న్యూ ఇండియా లో గల అవకాశాల ను ఆవిష్కరించింది అని ఆయన అన్నారు. ‘‘ప్రపంచ వైష్ణవ సమ్మేళనాని కి ఈ రోజు న ఈ సభాస్థలి ఆతిథేయి గా ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది అభివృద్ధి మరియు వారసత్వం ల మిశ్రణం అయినటువంటి ఒక నయా భారత్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది, మరి నయా భారత్ లో ఆధునికత్వాని కి స్వాగతం పలకడం తో పాటు దీనికి సంబంధించిన గుర్తింపు గర్వకారకమైన విషయం గా ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ గొప్ప సందర్భం లో పాలుపంచుకోవడం పట్ల ప్రధాన మంత్రి కృతజ్ఞత ను వ్యక్తం చేసి, భగవాన్ కృష్ణుని సమక్షం లో ప్రణామాన్ని ఆచరించారు. శ్రీల ప్రభుపాద గారి కి శ్రద్ధాంజలి ని కూడా ప్రధాన మంత్రి సమర్పించారు; శ్రీల ప్రభుపాద గారి గౌరవార్థం ఒక తపాల బిళ్ళ మరియు స్మారక నాణెం ల విడుదల సందర్భం లో అందరికీ అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.

అయోధ్య ధామ్ లో శ్రీ రామ దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యం లో శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి ని పాటించడం జరుగుతున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజల వదనాల లో సంతృప్తి ని గమనించిన ప్రధాన మంత్రి ఈ యొక్క మహా యజ్ఞం పూర్తి అయినందుకు ఖ్యాతి ని మునుల ఆశీర్వాదాల కు కట్టబెట్టారు.

భక్తి లో ఉల్లాసం అనుభూతి లోకి వచ్చేటందుకు అనువైన స్థితిగతుల ను కల్పించినందుకు చైతన్య మహాప్రభు చేసిన సేవ పట్ల ప్రధాన మంత్రి ప్రశంసల ను కురిపించారు. ‘‘కృష్ణ ప్రేమ కు ఒక గీటురాయి గా చైతన్య మహాప్రభు ఉన్నారు. ఆధ్యాత్మిక వాదాన్ని మరియు ధ్యానాన్ని సామాన్య ప్రజల కు అందుబాటు లోకి తీసుకు వచ్చారు ఆయన’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఆనందోల్లాసాల ద్వారా దైవం చెంతకు చేరే మార్గాన్ని చైతన్య మహాప్రభు చూపెట్టారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాన మంత్రి తనకు కలిగిన స్వీయ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకొంటూ, తన జీవనం లో ఒక దశ లో భక్తి ని సంపూర్తి గా అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఒక వెలితి, ఒక దూరం అంటూ తారసపడ్డాయి అని వివరించారు. భజన, కీర్తన ల ద్వారా ప్రాప్తించే హర్షం తక్షణ పరిపూర్ణ ఏకాగ్రత ను ప్రసాదించింది అని ఆయన అన్నారు. ‘‘చైతన్య ప్రభు ప్రవచించిన సంప్రదాయం యొక్క శక్తి ని నేను అనుభూతి చెందాను’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రోజు న కూడా ను కీర్తన ఆలాపన జరుగుతున్న కాలం లో ఒక భక్తుని వలె నేను చప్పట్లు చరుస్తున్నాను తప్ప ఒక ప్రధాన మంత్రి హోదా లో కాదుఅని ఆయన అన్నారు. ‘‘కృష్ణ లీల యొక్క పద రచన తో పాటు గా జీవనాన్ని అర్థం చేసుకోవడం లో ఆ గీతాల ప్రాముఖ్యం ఎంత ఉన్నది అనే దాని ని కూడా చైతన్య మహాప్రభు చాటి చెప్పారు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘చైతన్య మహాప్రభు వంటి వ్యక్తులు పరి పరి విధాలు గా వారి యొక్క కృషి ని వ్యాప్తి చెందింప చేస్తారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విధమైన విశ్వాసం శ్రీల ప్రభుపాద గారి లో మూర్తీభవించింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ధ్యానం ద్వారా దేనిని అయినా సరే ఏ రకం గా సంపాదించుకోవచ్చో అనే విషయాన్ని మనకు శ్రీల ప్రభుపాద గారి జీవితం బోధించింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరి సంక్షేమాని కి అనుసరించవలసిన బాట ను ప్రకాశవంతం చేసివేసింది అని ఆయన అన్నారు. శ్రీల ప్రభుపాద జీ ఆయన కు పది సంవత్సరాల కంటే తక్కు వయస్సు ఉన్నప్పుడే గీత ను కంఠోపాఠం చేసుకొన్నారు, సంస్కృతం లో, వ్యాకారణం లో మరియు వేదాల లో జ్ఞానాన్ని కూడా సంపాదించారు అని ప్రధాన మంత్రి అన్నారు. సూర్య సిద్ధాంత గ్రంథాన్ని శ్రీల ప్రభుపాద గారు ఖగోళ గణితం లో అన్వయించారు, తద్ద్వారా సిద్ధాంత సరస్వతి పట్టా ను సముపార్జించారు అని ఆయన వెల్లడించారు. 24 సంవత్సరాల వయస్సు లో ఒక సంస్కృత పాఠశాల ను కూడా శ్రీల ప్రభుపాద గారు నెలకొల్పారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పుస్తకాలు మరియు వ్యాసాలు కలుపుకొని 100 కు పైగా వ్రాసారు శ్రీల ప్రభుపాద గారు అని ప్రధాన మంత్రి తెలిపారు. ఒక రకం గా జ్ఞాన మార్గాని కి మరియు భక్తి మార్గాని కి మధ్య సమతౌల్యాన్ని జీవిత విధానం తో శ్రీల ప్రభుపాద గారు ఏర్పరచారు అంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు. మనిషి వాత్సల్యాని కి మరియు అహింస కు సంకల్పాన్ని తీసుకోవాలంటూ గాంధీ జీ సూచించిన అంశాన్నే వైష్ణవ ధర్మం ద్వారా ప్రసారం చేయడం కోసం శ్రీల ప్రభుపాద స్వామి పాటుపడ్డారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 


(Release ID: 2004248) Visitor Counter : 142